Hyundai Ai3 Micro SUV Price In India 2023, Check Launch Date, Full Specifications - Sakshi
Sakshi News home page

Hyundai Ai3 : కొత్త కారు కొనాలనుకుంటున్నారా ? బడ్జెట్‌ ధరలో

Apr 7 2023 10:11 AM | Updated on Apr 7 2023 11:15 AM

Hyundai New Small Hyundai Ai3 Will Launch Soon In India - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన తయారీ సంస్థ హ్యూందాయ్‌ భారతీయ మార్కెట్లో చిన్న ఎస్‌యూవీని త్వరలో పరిచయం చేయబోతోంది. బడ్జెట్‌లో (ప్రారంభ ధర రూ.6లక్షలు) ఏఐ3 కోడ్‌ పేరుతో రూపుదిద్దుకుంటున్న ఈ కారునే ఇక్కడ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 

టాటా పంచ్, సిట్రోవెన్‌ సి3, మారుతీ సుజుకీ ఇగ్నిస్, నిస్సాన్‌ మాగ్నైట్, రెనో కైగర్‌ మోడళ్లకు ఇది పోటీనిస్తుంది. 1.2 లీటర్‌ ఇంజన్, 5 స్పీడ్‌ మాన్యువల్‌ లేదా ఏఎంటీతో రంగ ప్రవేశం చేయవచ్చని సమాచారం.

దేశీయ ప్యాసింజర్‌ వాహన రంగంలో ఎస్‌యూవీల విభాగం వేగంగా వృద్ధి చెందుతోంది. ప్రస్తుతం భారత్‌లో హ్యుండై వెన్యూ, క్రెటా, ఆల్కజార్, టక్సన్‌ ఎస్‌యూవీలను విక్రయిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement