పసిడి పడింది.. ఎట్టకేలకు దిగువకు.. | Gold Rates Today On 2nd February 2025 | Sakshi
Sakshi News home page

పసిడి పడింది.. ఎట్టకేలకు దిగువకు..

Feb 3 2025 12:01 PM | Updated on Feb 3 2025 12:31 PM

Gold Rates Today On 2nd February 2025

దేశంలో బంగారం ధరలు (Gold Prices) ఎట్టకేలకు దిగివచ్చాయి. ఐదు రోజులుగా దూసుకెళ్లిన పసిడి రేట్లు నేడు (February 2) నేల చూపు చూశాయి. గడిచిన ఐదు రోజుల్లో 10 గ్రాముల బంగారంపై రూ.2500 పైగా పెరిగింది. ధరలు కాస్త దిగొస్తే కొందామని ఎదురుచూస్తున్న పసిడి ప్రియులకు తగ్గినరేట్లు ఊరట కల్పిస్తున్నాయి.

ఇది చదివారా? కొత్త రకం క్రెడిట్‌ కార్డు.. ఎఫ్‌డీ, యూపీఐ లింక్‌తో..

బంగారం ధరలు (Gold Rates) ద్రవ్యోల్బణం, గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్‌లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి. నేటి బంగారం ధరలు ఏయే ప్రాంతాల్లో ఎలా ఉన్నాయనేది ఈ కథనంలో తెలుసుకుందాం.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లో ఈరోజు బంగారం 10 గ్రాముల ధరలు రూ.400 (22 క్యారెట్స్), రూ.440 (24 క్యారెట్స్) చొప్పున తగ్గాయి. దీంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 77,050కు, 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 84,050 వద్దకు దిగివచ్చాయి.

ఇతర ప్రాంతాల్లో.. 
దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.84,200 వద్దకు.. 22 క్యారెట్ల పసిడి ధర రూ.77,200 వద్దకు దిగివచ్చాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.440,  రూ.400 చొప్పున తగ్గుదలను నమోదు చేశాయి.

చైన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ 22 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ.400 తగ్గి రూ. 77,050 వద్దకు, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.440 క్షీణించి రూ. 84,050 వద్దకు వచ్చింది. బెంగళూరు, ముంబై ప్రాంతాల్లోనూ ఇవే ధరలు ఉన్నాయి.

వెండి ధరలు
దేశవ్యాప్తంగా వెండి ధరల్లో నేడు ఎలాంటి కదలిక లేదు. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ ధర రూ.1,07,000 వద్ద, ఢిల్లీలో రూ. 99,500 వద్ద నిలకడగా కొనసాగుతున్నాయి.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement