రూ.72.90 లక్షల కొత్త బీఎండబ్ల్యూ కారు - వివరాలు | BMW 5 Series LWB Launched In India | Sakshi
Sakshi News home page

రూ.72.90 లక్షల కొత్త బీఎండబ్ల్యూ కారు - వివరాలు

Jul 24 2024 6:37 PM | Updated on Jul 24 2024 6:51 PM

BMW 5 Series LWB Launched In India

బీఎండబ్ల్యూ కంపెనీ సరికొత్త 5 సిరీస్ కారు ఎల్‌డబ్ల్యుబీ లాంచ్ చేసింది. ఇది 530ఎల్ఐ అనే సింగిల్ వేరియంట్లో మాత్రమే లభిస్తుంది. దీని ధర రూ. 72.90 లక్షలు (ఎక్స్ షోరూమ్).

కొత్త బీఎండబ్ల్యూ 530ఎల్ఐ వేరియంట్ 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో 48వోల్ట్స్ మైల్డ్ హైబ్రిడ్ అసిస్ట్ పొందుతుంది.ఇది 8 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ద్వారా వెనుక చక్రాలను పవర్ డెలివరీ చేస్తుంది. ఇది 6.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ లగ్జరీ కారు టాప్ స్పీడ్ 250 కిమీ/గం.

కొత్త డిజైన్ కలిగిన బీఎండబ్ల్యూ 5 సిరీస్.. పరిమాణంలో దాని మునుపటి మోడల్స్ కంటే కూడా కొంత పెద్దగా ఉంటుంది. ఇందులో కిడ్నీ గ్రిల్, 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, స్పోర్టియర్ ఫ్రంట్, రియర్ బంపర్‌లు ఉన్నాయి. లోపల 12.3 ఇంచెస్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 14.9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్‌ మొదలైనవి ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement