Daily Horoscope: ఈ రాశివారికి చిరకాల సమస్యలు పరిష్కారం | Sakshi
Sakshi News home page

Today Telugu Horoscope: ఈ రాశివారికి చిరకాల సమస్యలు పరిష్కారం

Published Fri, May 3 2024 4:41 AM

Daily Horoscope: Rasi Phalalu On 03-05-2024 In Telugu

శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్ర మాసం, తిథి: బ.దశమి రా.8.25 వరకు, తదుపరి ఏకాదశి, నక్షత్రం: శతభిషం  రా.9.32 వరకు, తదుపరి పూర్వాభాద్ర, వర్జ్యం: ఉ.5.51 నుండి 7.19 వరకు, తదుపరి రా.3.30 నుండి 4.58 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.08 నుండి 8.56 వరకు, తదుపరి ప.12.23 నుండి 1.11 వరకు, అమృతఘడియలు: ప.3.24 నుండి 4.56 వరకు. 

మేషం: కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. చిరకాల సమస్య పరిష్కారం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు రాగల అవకాశం.

వృషభం: ఆకస్మిక ధనలబ్ధి. ముఖ్యసమాచారం ఊరట కలిగిస్తుంది. కొత్త కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. నూతన పరిచయాలు. కొత్త వ్యాపార ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు.

మిథునం: కుటుంబంలో కలహాలు. ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితి. ఆరోగ్యపరమైన చికాకులు. దేవాలయాలు సందర్శిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. వ్యాపార లావాదేవీలు  నిరాశ కలిగించవచ్చు. ఉద్యోగులకు పని ఒత్తిడులు.

కర్కాటకం: కార్యక్రమాలలో  ఆటంకాలు చికాకు పరుస్తాయి. బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబ సమస్యలు వేధిస్తాయి. వ్యాపార లావాదేవీలలోఆటుపోట్లు. ఉద్యోగులకు నిరుత్సాహం.

సింహం: కొత్త కార్యక్రమాలు చేపడతారు. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. దూరప్రాంతాల నుంచి శుభవర్తమానాలు. భాగస్వామ్య వ్యాపారాలు  లాభిస్తాయి. ఉద్యోగాలలో లక్షా్యలు సాధిస్తారు.

కన్య: ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కొత్త వ్యక్తుల పరిచయమై సహకరిస్తారు. వ్యాపారాలు సజావుగానే సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు దక్కే అవకాశం.

తుల: కొత్తగా రుణాలు చేస్తారు. దూరప్రయాణాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా చికాకులు.కుటుంబ సమస్యలు వేధిస్తాయి. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు అధికారుల నుంచి ఒత్తిడులు.

వృశ్చికం: ఆకస్మిక ప్రయాణాలు. కార్యక్రమాలలో ప్రతిబంధకాలు. ఇంటాబయటా సమస్యలు. బంధువులు,మిత్రులతో విభేదాలు. రావలసిన సొమ్ము సకాలంలో అందదు. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు.

ధనుస్సు: సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. అందరిలోనూ గుర్తింపు రాగలదు. అదనపు రాబడి ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో ఉత్సాహం.

మకరం: ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. కార్యక్రమాలలో అవాంతరాలు. బంధువులు, మిత్రులతో కలహాలు. వాహనాలు, ఆరోగ్యం విషయాలలో శ్రద్ధ చూపండి. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు. ఉద్యోగులకు విధుల్లో మార్పులు.

కుంభం: ఆదాయం తగ్గి అప్పులు చేస్తారు. వివాదాలు చికాకు పరుస్తాయి. సన్నిహితులతో తగాదాలు.  వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. లాభాలు కనిపించవు. ఉద్యోగాలలో ఒత్తిడులు ఎదుర్కొంటారు.

మీనం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. సన్నిహితులతో వివాదాలు తొలగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. విలువైన వస్తువులు సేకరిస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఉన్నతస్థితి లభిస్తుంది.

Advertisement
Advertisement