సాక్షి, అమరావతి: స్థానిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నేతల అరాచకాలు కొనసాగుతున్నాయని రాష్ట్రాన్ని తగలబెడుతున్నారని వైఎస్సార్సీపీ లీగల్ వ్యవహారాల ప్రధాన కార్యదర్శి మాజీ ఏఐజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏపీ హైకోర్టుకు విన్నవించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు పుంగనూరు, రాయచోటి, ధర్మవరం, తిరుపతి కడపలో టీడీపీ జరిపిన దాడులను కోర్టు వద్ద ప్రస్థావించారు. వైఎస్సార్సీపీ నేతలపై కూటమి నేతల దాడుల నేపథ్యంలో వైఎస్సార్సీపీ కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక ఎన్నికల నిర్వహణపై ఏపీ హైకోర్టులో పిటిషన్ వేసింది.
పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల వద్ద కేంద్రబలగాలను మోహరించాలని పిటిషన్లో పేర్కొంది. రాష్ట్రాన్ని తగలబెడుతున్నారని కచ్చితంగా కేంద్రబలగాలు ఏర్పాటు చేయాల్సిందేనని సుధాకర్ రెడ్డి కోర్టుకు తెలిపారు. పొన్నవోలు వాదనలు విన్న హైకోర్టు.. దాడులకు సంబంధించిన సమాచారం కోరింది. తదుపరి విచారణను సాయంత్రం నాలుగు గంటలకు వాయిదా వేసింది.
ఇదీ చదవండి: వైఎస్ ప్రమీలమ్మ నామినేషన్ దాఖలు


