సాక్షి,తాడేపల్లి: బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో శరన్నవరాత్రి మహోత్సవాలు నేటి నుంచి అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. నేటి నుంచి తొమ్మిది రోజుల పాటు అమ్మవారు భక్తులకు వివిధ అలంకారాలలో దర్శన మివ్వనున్నారు.
ఈ పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజలకు, భక్తులకు శరన్నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
శ్రీ కనకదుర్గమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు నేటి నుంచి ప్రారంభమవుతున్న సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఆ అమ్మవారి ఆశీస్సులతో ప్రజల కష్టాలన్నీ తొలగిపోయి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని రైతులు, పేదలు సహా అన్ని వర్గాల ప్రజలు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని పేర్కొన్నారు.
శ్రీ కనకదుర్గమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు నేటి నుంచి ప్రారంభమవుతున్న సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఆ అమ్మవారి ఆశీస్సులతో ప్రజల కష్టాలన్నీ తొలగిపోయి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని రైతులు, పేదలు సహా అన్ని వర్గాల ప్రజలు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
— YS Jagan Mohan Reddy (@ysjagan) October 11, 2026


