దేశ, విదేశాల్లో ఘనంగా జగనన్న జన్మదిన వేడుకలు.. | YS Jagan Birthday Celebrations In Other Countries, Photos And Videos Goes Viral | Sakshi
Sakshi News home page

దేశ, విదేశాల్లో ఘనంగా జగనన్న జన్మదిన వేడుకలు..

Dec 22 2024 8:09 AM | Updated on Dec 22 2024 7:15 PM

YS Jagan Birthday Celebrations In Other Countries

‘ఎక్స్‌’ ద్వారా విషెస్‌ తెలిపిన 37 లక్షల మందికిపైగా పార్టీ శ్రేణులు, అభిమానులు

గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్, సీఎం చంద్రబాబు సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షలు

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు శనివారం దేశ, విదేశాల్లో ఘనంగా జరిగాయి. పార్టీ శ్రేణులు, అభిమా­నులు, ప్రజలు ఎక్కడికక్కడ ఈ కార్యక్రమాన్ని అత్యంత వేడుకగా నిర్వహించారు. 

అమెరికా నార్త్‌ కరోలినా, సెయింట్‌ లూయిస్, కెనడా, ఆస్ట్రేలి­యాలోని మెల్‌బోర్న్, బ్రిస్బేన్, సిడ్నీ, ఖతార్‌లోని దోహా, కువైట్, న్యూజిలాండ్‌ దేశాల్లో అభిమా­నులు కేక్‌లు కట్‌ చేసి, సామాజిక మాధ్యమాల్లో ఫొటోలను షేర్‌ చేస్తూ తమ అభిమానాన్ని చాటు­కు­న్నారు. కాగా, వైఎస్‌ జగన్‌ పుట్టిన రోజును పురస్కరించుకొని సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ (ట్విటర్‌)లో ‘హ్యాపీ బర్త్‌డే వైఎస్‌ జగన్‌’ హ్యాష్‌ ట్యాగ్‌ ట్రెండింగ్‌లో రికార్డు సృష్టించింది. 

డిసెంబర్‌ 20వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి ఇండియా టాప్‌ ట్రెండింగ్‌లో మొదటి స్థానంలో నిలిచింది. మొత్తం 24 గంటల్లో 18 గంటలకుపైగా టాప్‌ వన్‌ పొజిషన్‌లో నిలిచింది. ఎక్స్‌ వేదికగా వైఎస్‌ జగన్‌కు ఏకంగా 37 లక్షల మందికిపైగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోపాటు పలు­వురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజే­శారు. ‘వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి హృదయపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు. దేవుడు మీకు మంచి ఆరోగ్యం, సంతోషం, దీర్ఘాయుష్షు ఇవ్వాలి. ప్రజా సేవలో సుదీర్ఘకాలం ఉండాలి’ అంటూ ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేశారు. 

 

Advertisement
 
Advertisement
Advertisement