ఎస్సై నిర్వాకం: ప్రేమించి, పెళ్లి చేసుకుని.. నా జీవితాన్ని నాశనం చేశాడు

SI Vinod Kumar Cheats his WIfe Roja Rani in Guntur District - Sakshi

సాక్షి, గుంటూరు: ఒంగోలు పీటీసీలో ఎస్సైగా పనిచేస్తున్న వినోద్‌ కుమార్‌ అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని అతని భార్య మంగళగిరి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ప్రేమించి, పెళ్లి చేసుకుని రెండేళ్ల తర్వాత నడిరోడ్డుపై వదిలేశాడంటూ రోజారాణి ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్సై వినోద్‌కుమార్‌పై మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. వినోద్‌‌ కుమార్‌కు వేరే మహిళతో సంబంధం ఉన్న విషయం తెలుసుకుని ప్రశ్నించినందుకే తనను వదిలేశాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. పోలీసులు కౌన్సిలింగ్‌కు పిలిచినా రాకుండా, తన జీవితాన్ని నాశనం చేశాడంటూ బాధితురాలు కన్నీటి పర్యంతమవుతోంది.

చదవండి: (విధి వైపరీత్యం అంటే ఇదేనేమో.. కళ్ల ముందే నలుగురు కొడుకులు)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top