స్థిరంగా కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం | Rains in many areas in the next 48 hours | Sakshi
Sakshi News home page

స్థిరంగా కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం

Dec 19 2024 5:00 AM | Updated on Dec 19 2024 7:18 AM

Rains in many areas in the next 48 hours

రానున్న 48 గంటల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు 

మహారాణిపేట: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. రానున్న 24 గంటల్లో ఇది వాయవ్యంగా ఉత్తర తమిళనాడు, దక్షణ ఆంధ్రా దిశగా ఏపీ తీరానికి ఆనుకుని ప్రయాణిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావం వల్ల బుధవారం కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. 

చాలా ప్రాంతాల్లో శీతల వాతావరణం నెలకొంది. గురువారం కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో సాధారణ వర్షాలు, అనకాపల్లి, కాకినాడ, విశాఖ, అల్లూరి జిల్లా, విజయనగరంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement