ఆ నిబంధన ప్రకారం రోజూ 4 షోలకే అనుమతి | Perni Nani Hot Comments On Vakeel Saab Movie | Sakshi
Sakshi News home page

‘పవన్‌ సినిమా కోసం ప్రత్యేకంగా నిబంధనలు మార్చరు’ 

Apr 9 2021 5:54 PM | Updated on Apr 9 2021 7:03 PM

Perni Nani Hot Comments On Vakeel Saab Movie - Sakshi

తిరుపతి: వకీల్‌సాబ్‌ సినిమాకు, ఎన్నికలకు సంబంధం ఏంటని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. సినిమాటోగ్రఫీ యాక్ట్‌ ప్రకారం రోజు 4 షోలకే అనుమతుందని తెలిపారు. టికెట్‌ రేట్లు పెంచి జనం జేబులు కొట్టాలా.. పవన్‌ సినిమా కోసం ప్రత్యేకంగా నిబంధనలు మార్చరని కుండ బద్దలు కొట్టారు. ఈ విషయంలో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న బీజేపీ అసలు ఏపీ ప్రజలకు ఏం చేసిందో తెలపాలని సూటిగా ప్రశ్నించారు.

ఆంధ్రకు ప్రత్యేక హోదా, రైల్వేజోన్‌ ఇస్తామని చెప్పి ప్రజల్ని మోసం చేశారని బీజేపీ మీద మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం పాచిపోయిన లడ్డూలు పెట్టిందని పవన్‌ గతంలో చేసిన ఆరోపణలను మంత్రి గుర్తుచేశారు. బీజేపీ నేతలు చెప్పిన అచ్చేదిన్‌ ఎక్కడ వచ్చిందో చెప్పాలని పేర్నినాని ప్రశ్నించారు.

14ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సభలో మాట్లాడాలంటే వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తనకు తానే భజన చేసుకుంటున్నాడని, కానీ ఇప్పటికే  ప్రజలు అతడిని తరిమికొట్టారని విమర్శించారు. తిరుపతి ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని పేర్నినాని ధీమా వ్యక్తం అన్నారు.  

చదవండి: ‘రుణమాఫి పేరుతో చంద్రబాబు రైతులను దోచుకున్నాడు’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement