నంద్యాలలో భారీ అగ్నిప్రమాదం.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌ | Massive Fire Accident In Nandyal Check Post | Sakshi
Sakshi News home page

నంద్యాలలో భారీ అగ్నిప్రమాదం.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌

Mar 30 2021 10:37 PM | Updated on Mar 31 2021 1:40 AM

Massive Fire Accident In Nandyal Check Post - Sakshi

సాక్షి, కర్నూలు: నంద్యాల చెక్‌పోస్ట్‌ వద్ద భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓ హోటల్‌లో 3 గ్యాస్‌ సిలిండర్లు పేలడంతో భారీ శబ్దాలతో మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో చెక్‌పోస్ట్‌ సర్కిల్‌ పక్కనే ఉన్న గుడిసెలు దగ్ధమవుతున్నాయి. ఈ మంటలు చుట్టుపక్కల ఉన్న హోటల్స్‌, షాప్‌లకు కూడా వ్యాపిస్తున్నాయి. ప్రమాదంపై స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో నంద్యాల, నందికొట్కూరు రహదారిలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement