లిఫ్ట్‌ ప్రమాదం.. గాయపడిన తిరుమల భక్తుడు | Man Injured In Hotel Lift Accident At Tirumala | Sakshi
Sakshi News home page

అతిథి గృహంలో ప్రమాదం.. గాయపడిన తిరుమల భక్తుడు

Nov 11 2020 3:12 PM | Updated on Nov 11 2020 3:24 PM

Man Injured In Hotel Lift Accident At Tirumala - Sakshi

సాక్షి, చిత్తూరు: తిరుమలలోని ఓ అతిథి గృహంలో ప్రమాదం చోటు చేసుకుంది. అతిధి గృహంలోని లిఫ్ట్‌ బుధవారం ప్రమాదానికి గురవడంతో ఓ భక్తుడు గాయపడిన సంఘటన స్తానికంగా ఆందోళన కలిగించింది. అతిథి గృహంలో కరెంట్‌ నిలిచిపోవడంతో రన్నింగ్‌లో ఉన్న లిఫ్ట్‌ ఆగిపోయింది. దీంతో భక్తులను లిఫ్ట్‌ నుంచి బయటకు దించే క్రమంలో ఓ భక్తుడు ఒక్కసారిగా కింద పడిపోయాడు. దీంతో అతడికి తీవ్ర గాయాలు కావడంతో స్థానిక సిబ్బంది వెంటనే తిరుపతిలోని రూయా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన సదరు భక్తుడిని వెంకటగిరికి చెందిన జయప్రకాశ్‌గా అధికారులు గుర్తించారు. 

Advertisement
 
Advertisement
Advertisement