ఏబీవీ.. ఎనీటైం బాబు వెంటే | Sakshi
Sakshi News home page

ఏబీవీ.. ఎనీటైం బాబు వెంటే

Published Tue, Apr 30 2024 5:12 AM

IPS officer in TDP Political Service

టీడీపీ పొలిటికల్‌ సర్విసులో ఐపీఎస్‌ అధికారి

సదా చంద్రబాబు, ఆ పార్టీ సేవలోనే 

గతంలో డేటాచోరీ స్కెచ్‌కు సూత్రధారి 

సస్పెన్షన్‌లో ఉన్నా పచ్చపార్టీ సేవలో తరిస్తున్న అధికారి  

టీడీపీ రెబల్స్‌కు బెదిరింపులు 

బీజేపీ, జనసేన అసంతృప్త నేతలకు వారి్నంగులు 

రాష్ట్రంలో ఓ వివాదాస్పద ఐపీఎస్‌ అధికారి తీరు ఇదీ

సాక్షి, అమరావతి: ఆయనో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి. ‘ఎనీటైమ్‌ బాబు వెంటే’ (ఏబీవీ)గా పేరు తెచ్చుకున్న ఆయన ఐపీఎస్‌ అధికారిగా కంటే.. టీపీఎస్‌ (టీడీపీ పొలిటికల్‌ సర్విస్‌) అధికారిగా పనిచేయడానికే ఎక్కడలేని ఆసక్తి చూపుతారు. చంద్రబాబు సీఎంగా ఉండగా 2014–19 వరకు ఆయన అడ్డగోలుగా చెలరేగిపోయారు. ఇష్టారాజ్యంగా అక్రమాలు, అవినీతికి పాల్పడ్డారు. బంధువులు, బినామీల పేరిట అమరావతిలో భూదోపిడీకీ తెగబడ్డారు.

ప్రభుత్వ అధికారిక విధుల కంటే టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసమే పనిచేశారు. ముఖ్యంగా.. 2014లో వైఎస్సార్‌సీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేల్లో 23 మందిని ప్రలోభాలకు గురిచేసి టీడీపీలో చేరి్పంచడంలో ఆయనదే కీలకపాత్ర. కేంద్ర భద్రతా చట్టాలను ఉల్లంఘించి మరీ డేటాచోరీకి పాల్పడటం జాతీయ స్థాయిలో సంచలనంగా మా­రింది. కొన్నేళ్లుగా సస్పెన్షన్‌లో ఉన్న ఆ అధికారి ప్రస్తుతం ఎన్నికల్లో మరోసారి టీడీపీ రాజకీయ లబ్ధికోసం సివిల్‌ సర్విస్‌ నిబంధనలకు విరుద్ధంగా బరితెగిస్తున్నారు. 

తెలుగుదేశం తరఫున రెబల్స్‌గా బరిలో ఉన్న వారిని బెదిరిస్తూ.. టీడీపీ ఏకపక్ష వైఖరితో విసిగిపోయి కినుక వహించిన జనసేన, బీజేపీ నేతల భరతంపడుతున్నారు. ఎన్నికల ప్రవర్తనా ని­యమావళికి విరుద్ధంగా టీడీపీ ప్రతినిధిగా వ్యవ­హ­రిస్తున్న ఆ అధికారి బరితెగింపు ఎలాగుందంటే.. 

టీడీపీ రెబల్స్‌కు బెదిరింపులు.. 
పార్టీ కోసం పనిచేసిన నేతలకు కాకుండా లోకేశ్‌కు ముడుపులు చెల్లించుకున్న బడా బాబులకే ఈ ఎన్నికల్లో చంద్రబాబు టికెట్లు కేటాయించడంతో ఆ పారీ్టలో అసమ్మతి భగ్గుమంది. దాంతో పలువురు టీడీపీ రెబల్‌ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. మరోవైపు.. బీజేపీ, జనసేన పారీ్టలకు టీడీపీ అరకొరగా సీట్లు కేటాయించడంపట్ల ఆ రెండు పారీ్టల్లో తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. కొన్ని నియోజకవర్గాల్లో ఆ రెండు పార్టీల అభ్యర్థులు ఇండిపెండెంట్లుగా పోటీచేస్తున్నారు. 

చాలా నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉండిపోయారు. ఈ పరిణామాలు టీడీపీ విజయావకాశాలు దెబ్బతీయడం ఖాయమని స్పష్టమైంది. దీంతో బెంబేలెత్తిన చంద్రబాబు తన నమ్మినబంటు అయిన ఆ వివాదాస్పద ఐపీఎస్‌ అధికారిని రంగంలోకి దించారు. ఇంకేముంది.. ఆ అధికారి టీడీపీ రెబల్స్‌గా బరిలో ఉన్న నేతలే లక్ష్యంగా బెదిరింపుల పర్వానికి దిగారు. ఉదా.. 
 

∗ నూజివీడులో టీడీపీ రెబల్‌ అభ్యరి్థగా నామి­నేషన్‌ వేసిన ముద్దరబోయిన వెంకటేశ్వరరావు తాజాగా వెనక్కి తగ్గడం వెనుక ఆ అధికారి బెదిరింపులే కారణం. సదరు అధికారి కూడా నూజివీడు నియోజకవర్గానికే చెందిన వ్యక్తే. ఈయన ముద్దరబోయిన వెంకటేశ్వరరావుతో ఇటీవల రెండు మూడుసార్లు భేటీ అయ్యారు. నామినేషన్‌ ఉపసంహరించుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే ముద్దరబోయిన తన నామినేషన్‌ను వెనక్కి తీసుకోవడం గమనార్హం.  

∗ అలాగే, శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నుంచి టీడీపీ రెబల్‌ అభ్యర్థిగా పోటీచేసి తీరుతానని మాజీ ఎమ్మెల్యే కలమట వెంకట రమణ ప్రకటించారు. ఆ మేరకు ఆ నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో ర్యాలీలు కూడా నిర్వహించి చంద్రబాబు, అచ్చెన్నాయుడుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీంతో ఆయనకు టీడీపీ అధిష్టానం నుంచి పిలుపు వచి్చంది. చంద్రబాబు పిలిపించారని భావించిన రమణకు విజయవాడ వచ్చాక ఝలక్‌ తగిలింది.

టీడీపీ తరఫున ఆ ఐపీఎస్‌ అధికారే రమణతో మాట్లాడినట్లు సమాచారం. నిజానికి.. 2014లో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేగా గెలిచిన కలమట వెంకట రమణను అప్పట్లో ప్రలోభాలకు గురిచేసి టీడీపీలో చేరేలా వ్యవహారం నడిపింది ఈ అధికారే. అందుకే ఇప్పుడు కూడా ఆయనకే చంద్రబాబు బాధ్యత అప్పగించారు. రెబల్‌గా పోటీ చేయకూడదని, పోటీచేస్తే ఆయన ఆరి్థక మూలాలు దెబ్బతీస్తామని.. గతంలో ఎక్కడెక్కడ నల్లధనాన్ని పెట్టుబడిగా పెట్టిందీ ఆధారాలతో బయటకుతీస్తానని స్పష్టంచేశారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే కలమట వెంకటరమణ పోటీచేయాలన్న ఆలోచనను విరమించుకున్నట్లు తెలుస్తోంది.  

∗ జగ్గయ్యపేట, గన్నవరం, జగ్గంపేట, ఎస్‌.కోట, విజయనగరం తదితర నియోజకవర్గాల్లో బరిలో ఉన్న టీడీపీ, బీజేపీ, జనసేన రెబల్‌ అభ్యర్థుల వద్దకూ తన అనుచరులను పంపించి బెదిరిస్తున్నట్లుగా తెలుస్తోంది. తన మనుషులను వారి వద్దకు పంపించి మరీ వారి్నంగులు 
ఇప్పిస్తున్నారని సమాచారం. ఆ అధికారి తీరుపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది.  

∗ ఇక విజయవాడ పశి్చమ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరికి అనుకూలంగా ఆ అధికారి రంగంలోకి దిగారు. టీడీపీ అసంతృప్త నేత, మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ను తనదైన శైలిలో బెదిరించినట్లు సమాచారం. 2014లో  వైఎస్సార్‌సీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన టీడీపీలో చేరడం వెనుక ఈ వివాదాస్పద అధికారే క్రియాశీలక పాత్ర పోషించారు. సుజనాచౌదరికి అనుకూలంగా ముస్లింలతో సమా­వేశం నిర్వహించకపోతే తీవ్ర పరిణా­మాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హె­చ్చ­రించినట్లు సమాచారం. 

ఈ నేపథ్యంలో కొందరు ముస్లింలతో ఓ సమావేశం నిర్వహించి సుజనాకు ఓటు వేయాలని చెప్పాల్సి వచి్చందని జలీల్‌­ఖాన్‌ సన్నిహితులే చెబుతున్నారు.  కానీ, సుజనాచౌదరికి ముస్లింలు ఓటు వేసేదేలేదని కూడా వారు స్పష్టంచేస్తున్నారు. ఇదిలా ఉంటే.. టీడీపీ నుంచి వచి్చన సుజనాకు టికెట్‌ కేటాయించడం సంప్రదాయ బీజేపీవాదులకు తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. దీంతో ఆ నేతలు ప్రచారానికి దూరంగా ఉండిపోయారు. దీన్ని గుర్తించిన ఆ అధికారి అసంతృప్త బీజేపీ నేతల­తో తన స్టైల్లో మాట్లాడారు. వన్‌టౌన్‌లో దశాబ్దాలుగా వారు నిర్వహిస్తున్న వ్యాపా­ర సంస్థలను దెబ్బతీస్తామని హెచ్చరించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement