దళిత ద్రోహి లోకేశ్‌ను అరెస్ట్‌ చేయాలి  | Dalit traitor Lokesh should be arrested | Sakshi
Sakshi News home page

దళిత ద్రోహి లోకేశ్‌ను అరెస్ట్‌ చేయాలి 

Jul 30 2023 5:33 AM | Updated on Jul 30 2023 9:07 AM

Dalit traitor Lokesh should be arrested - Sakshi

దళిత నాయకులతో కలిసి నిరసన తెలుపుతున్న మంత్రి మేరుగు నాగార్జున 

తిరుపతి సిటీ: దళిత ద్రోహి నారా లోకేశ్‌ను వెంటనే అరెస్ట్‌ చేసి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున డిమాండ్‌ చేశారు. ‘సాక్షి’ విలేకరి కరుణాకర్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ శనివారం తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట దళిత సంఘాల నాయకులు నల్ల రిబ్బన్‌లు ధరించి నిరసన వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నాగార్జున మాట్లాడుతూ వార్తల కవరేజ్‌ చేస్తున్న దళిత విలేకరిని అతి దారుణంగా లోకేశ్‌ గూండాలు తిట్టడం, కొట్టడం అమానుషమన్నారు. నాయకులు మల్లారపు మధు, నల్లారి బాబు, వెంకటస్వామి, యలమంచిలి ప్రవీణ్, తళారి రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement