వీఆర్వోలకు మేలు చేసేలా జీవోలు | Beneficial GO for VROs In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

వీఆర్వోలకు మేలు చేసేలా జీవోలు

Nov 6 2023 5:13 AM | Updated on Nov 8 2023 6:46 PM

Beneficial GO for VROs In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: వీఆర్వోలకు మేలు జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం 154, 64, 6538, 166, 31 జీవోలు జారీ చేసిందని ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం (వీఆర్వో అసోసియేషన్‌) అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్రరాజు పేర్కొ­న్నారు. సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వానికి కృతజ్ఞత తెలిపేందుకు త్వరలో రాష్ట్రస్థాయిలో విజయోత్సవ సభ నిర్వహించనున్నట్టు తెలిపారు.

ఆదివారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన ఏపీ విలేజ్‌ రెవెన్యూ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ సమావేశంలో రవీంద్రరాజు మాట్లాడుతూ.. రెవెన్యూ విభాగంలో సీనియర్‌ అసిస్టెంట్‌ పదోన్నతులలో వీఆర్వోలకు ప్రస్తుతం ఉన్న కోటా 40 శాతం నుంచి 70 శాతానికి పెంచాలని, ఖాళీగా ఉన్న సీనియర్‌ సహాయకుల పోస్టులలో వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ ప్రకారం 70 శాతం పదోన్నతులను వీఆర్వో­లతో భర్తీ చేయాలని కోరారు.

సర్వే సప్లిమెంటరీ పరీక్షలు రాసిన గ్రేడ్‌–2 వీఆర్వోల ఫలి­తాలు వెంటనే విడుదల చేయాలని కోరారు. ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘాన్ని గుర్తింపు సంఘంగా ఎంపిక చేయాలని ప్రభు­త్వాన్ని కోరినట్టు తెలిపారు. సమావేశంలో సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అప్పల­నాయుడు, నాయకులు బాలాజీరెడ్డి, మౌళి భాష, లక్ష్మీనారాయణ, బాపూజీ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement