నాడు-నేడు: సీఎం వైఎస్‌ జగన్‌ కీలక ఆదేశాలు | AP CM YS Jagan Review On Education Department | Sakshi
Sakshi News home page

నాడు-నేడు: సీఎం వైఎస్‌ జగన్‌ కీలక ఆదేశాలు

Feb 3 2022 12:02 PM | Updated on Feb 3 2022 5:04 PM

AP CM YS Jagan Review On Education Department - Sakshi

సాక్షి, తాడేపల్లి: విద్యాశాఖపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సమీక్ష సమావేశం నిర్వంచారు. ఈ సమీక్షా సమావేశంలో పాఠశాల విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, పాఠశాల విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ బుడితి రాజశేఖర్, మహిళా,శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్‌ అనురాధ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే.. 

►వచ్చే విద్యాసంవత్సరం (జూన్‌) నాటికి నూతన విద్యావిధానానికి అనుగుణంగా అన్ని సంస్కరణలు పూర్తిగా అమల్లోకి రావాలన్న సీఎం
►విద్యార్థుల సంఖ్యకు తగిన నిష్పత్తిలో టీచర్లు ఉండాలన్న సీఎం
►సబ్జెక్టుల వారీగా టీచర్లు కూడా ఉండాలన్న సీఎం
►నూతన విద్యావిధానంలో ఏర్పాటవుతున్న స్కూల్స్‌ కారణంగా సుమారు 22 వేలమందికిపైగా ఉపాధ్యాయులకు ప్రమోషన్లు వస్తాయన్న సీఎం
►వీరందరికీ ఎస్‌జీటీ నుంచి స్కూల్‌ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు ఇవ్వాలన్న సీఎం
►వీరి సామర్థ్యాలను మెరుగుపరిచేలా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం
►స్కూళ్లలో సరిపడా సిబ్బంది ఉన్నప్పుడే పురోగతి కనిపిస్తుందన్న సీఎం
►ప్రమోషన్లు, బదిలీలు ఇవన్నీకూడా పూర్తిచేసి జూన్‌నాటికి నూతన విద్యావిధానం సంస్కరణలు పూర్తిగా అమల్లోకి రావాలి
►ప్రతి మండలానికి ఒక హైస్కూల్‌ను జూనియర్‌ కాలేజీగా తీర్చిదిద్దుదామని అనుకున్నాం
►ఇప్పుడు ప్రతి మండలానికి రెండు స్కూళ్లను 2 జూనియర్‌ కాలేజీలుగా మార్చండి
►ఒకటి కో – ఎడ్యుకేషన్‌ కోసం అయితే, ఒకటి బాలికలకోసం జూనియర్‌ కళాశాలగా మార్చాలి


►ఎస్‌ఈఆర్‌టీ ఇచ్చిన సిఫార్సులు అన్నీకూడా అమల్లోకి రావాలన్న సీఎం
►మండల రీసోర్స్‌ సెంటర్‌ పేరును మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంగా మార్చేందుకు సీఎం గ్రీన్‌ సిగ్నల్‌
►ఎండీఓ పరిధిలో కాకుండా ఎంఈవోకే నేరుగా డ్రాయింగ్‌ అధికారాలు
►ఇకపై విద్యాసంబంధిత కార్యకలాపాలు ఎంఈవోకే అప్పగిస్తూ ఎస్‌ఈఆర్‌టీ సిఫార్సుకు సీఎం ఆమోదం
►ఎంఈఓ పోస్టుల భర్తీకి సీఎం గ్రీన్‌ సిగ్నల్‌ 
►పలురకాల ఆప్స్‌ కన్నా... రియల్‌టైం డేటా ఉండేలా, డూప్లికేషన్‌ లేకుండా చూడాలన్న ఎస్‌ఈఆర్‌టీ సిఫార్సును అమల్లోకి తీసుకురావాలన్న సీఎం
►అటెండెన్స్‌ను ఫిజికల్‌గా కాకుండా ఆన్‌లైన్‌ పద్ధతుల్లో తీసుకోవాలన్న సిఫార్సునూ అమలు చేయాలన్న సీఎం
►విద్యార్ధుల మార్కులనూ ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేయాలన్న ఎస్‌ఈఆర్‌టీ
►పాఠాలు బోధించే ఉపాధ్యాయులకు నాన్‌ అకడమిక్‌ పనులకు వినియోగించవద్దన్న ఎస్‌ఈఆర్‌టీ 
►హెడ్‌మాస్టర్లను పలు రకాల మీటింగులు కాకుండా సమన్వయంకోసం నెలకు ఒకే సమావేశం ఏర్పాటు చేయాలన్న ఎస్‌ఈఆర్‌టీ.. వీటికి ఆమోదం తెలిసిన సీఎం
►స్కూళ్ల నుంచి ఫిర్యాదుల పరిష్కారంపై వెంటనే చర్యలు తీసుకోవాలన్న సీఎం
►సదుపాయాల లేమి, మౌలిక వసతుల మరమ్మతులు తదితర అంశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలన్న సీఎం
►నాడు నేడులో ఏర్పాటుచేసిన ఏ సదుపాయాల్లో ఎలాంటి సమస్యవచ్చినా వెంటనే చర్యలు తీసుకోవాలన్న సీఎం
►స్కూళ్ల నిర్వహణ, టాయిలెట్స్, తాగునీరు వీటి నిర్వహణపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్న సీఎం
►ప్రభుత్వ పాఠశాలల్లో నాడు – నేడు రెండో విడత పనులపై సీఎం కీలక ఆదేశాలు
►త్వరగా పనులు మొదలుపెట్టాలని సీఎం ఆదేశం
►ఫిబ్రవరి 15 నుంచి పనులు మొదలుపెడుతున్నామన్న అధికారులు
►సెప్టెంబరుకల్లా పనులు పూర్తిచేయడానికి చర్యలు తీసుకుంటామన్న అధికారులు
►జగనన్న విద్యాకానుక, టాయిలెట్ల నిర్వహణ, గోరుముద్ద నాణ్యత, స్కూళ్ల నిర్వహణకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయడానికి 14417 టోల్‌ ఫ్రీ నంబర్‌ ఏర్పాటు
►ఇది సమర్థవంతంగా పనిచేయాలన్న సీఎం
►స్కూళ్లలో కొత్తగా చేరిన విద్యార్ధులకు డిక్షనరీ ఇవ్వాలన్న సీఎం
►ప్రతిరోజూ ఒక పదాన్ని పిల్లలకు నేర్పాలన్న సీఎం
►ఆ పదాన్ని ఎలా ఉపయోగించాలన్నదానిపై పిల్లలకు నేర్పాలని సీఎం ఆదేశం
►పాఠ్యప్రణాళికలో ఇదొక భాగం చేయాలన్న సీఎం
►డిజిటల్‌ లెర్నింగ్‌పైనా కూడా దృష్టిపెట్టాలన్న సీఎం
►8,9,10 తరగతుల్లో డిజిటల్‌ లెర్నింగ్‌ ఉండేలా చూడాలన్న సీఎం
►దీన్నొక సబ్జెక్టుగా కూడా పెట్టే ఆలోచన చేయాలన్న సీఎం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement