Sakshi News home page

‘మేము సిద్ధం’ పోస్టర్ల ఆవిష్కరణ

Published Wed, Mar 27 2024 12:50 AM

రాతిదూలం లాగుతున్న వృషభాలు  - Sakshi

అనంతపురం కార్పొరేషన్‌: ఈ నెల 27 నుంచి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో తలపెట్టిన మేము సిద్ధం బస్సు యాత్ర పోస్టర్లను అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి మంగళవారం తన నివాసంలో ఆవిష్కరించారు. బస్సు యాత్ర విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అఖండ విజయమే లక్ష్యంగా సీఎం వైఎస్‌ జగన్‌ బస్సు యాత్ర చేపడుతున్నారన్నారు. ఈ యాత్ర ప్రారంభానికి ముందే ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ బాలాంజినేయులు, వైఎస్సార్‌సీపీ సోషియల్‌ మీడియా అధ్యక్షుడు గోళ్ల శ్రావణ్‌రెడ్డి, జేసీఎస్‌ జిల్లా కో ఆర్డినేటర్‌ వెన్నం శివరామిరెడ్డి, జేసీఎస్‌ కన్వీనర్‌ చింతా సోమశేఖర్‌రెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండ్రెడ్డి ప్రకాష్‌రెడ్డి, నగరాధ్యక్షురాలు కృష్ణవేణి, నాయకులు నవీన్‌, జానీ, కేశవరెడ్డి, నరసింహ, వాసు పాల్గొన్నారు.

హోరాహోరీగా రాష్ట్ర స్థాయి బండ లాగుడు పోటీలు

యాడికి: మండల కేంద్రంలో వెలసిన లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి బండలాగుడు పోటీలు హోరాహోరీగా సాగాయి. ఈ పోటీలకు 4 జతల వృషభాలను రైతులు తీసుకువచ్చారు. పోటీలను వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ బొంబాయి రమేష్‌ నాయుడు ప్రారంభించారు. నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం పీఆర్‌ పల్లికి చెందిన శ్రీరాములు వృషభాలు 931.07 అడుగుల దూరం లాగి ప్రథమ స్థానంలో నిలిచాయి. తాడిపత్రికి చెందిన రమేష్‌బాబు వృషభాలు ద్వితీయ స్థానం, నంద్యాల జిల్లా పీఆర్‌ పల్లికి చెందిన చెందిన నాగయ్య వృషభాలు తృతీయ స్థానం, ఊబిచెర్ల గ్రామానికి చెందిన పుల్ల గోవిందు వృషభాలు నాల్గో స్థానం దక్కించుకున్నాయి. విజేత వృషభాల యజమానులకు నగదు పురస్కారాలతో నిర్వాహకులు సత్కరించారు. కార్యక్రమంలో గోదావరి కన్‌స్ట్రక్షన్స్‌కు చెందిన నాగరాజు, ఉమ్మడి పాల ప్రభాకర్‌ రెడ్డి, యర్రగుడి పెద్దయ్య, వంకం పెద్ద కంబగిరిస్వామి, ఎంపీటీసీ సభ్యుడు వెంకట్రాముడు, ఉపసర్పంచ్‌ కాసా చంద్రమోహన్‌, ఆలయ ధర్మకర్త బొంబాయి రామిరెడ్డి, జేసీ చిన్న నారాయణ రెడ్డి పాల్గొన్నారు.

‘ఉపాధి’ బకాయిలు విడుదల

అనంతపురం టౌన్‌: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా పూర్తి చేసిన పలు పనులకు సంబంధించి బకాయిలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు డ్వామా పీడీ వేణుగోపాల్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మెటీరియల్‌ కాంపోనెంట్‌ కింద గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు చేపట్టారు. వీటికి సంబంధించి రూ.2.15కోట్ల బకాయి నిధులు మంజూరైనట్లు వివరించారు. నిర్మాణాలు పూర్తి చేసి బిల్లుల కోసం నివేదికలను ఇప్పటికే పంపించిన కాంట్రాక్టర్ల ఖాతాల్లో నిధులను జమ చేయనున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement