మాడుగుల టీడీపీలో గందగోళం | Sakshi
Sakshi News home page

మాడుగుల టీడీపీలో గందగోళం

Published Sat, Apr 20 2024 2:05 AM

మాడుగులలో నామినేషన్‌ దాఖలు చేస్తున్న   పైలా ప్రసాద్‌రావు   - Sakshi

● అభ్యర్థిగా బండారు సత్యనారాయణ మూర్తి పేరు తెరపైకి ● శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేసిన పైలా ప్రసాదరావు ● నిన్నమొన్నటి వరకు మూడు గ్రూపులు ● ఇప్పుడు నాలుగో వ్యక్తి తెరమీదకు ● ఎటువెళ్లాలో తెలియక తలలు పట్టుకుంటున్న కార్యకర్తలు

మాడుగుల: మాడుగుల టీడీపీలో గందరగోళ పరిస్థితి నెలకొంది చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు విసిగిపోతున్నారు. ఇప్పటికీ అభ్యర్థి విషయంలో స్పష్టత లేకపోవడంతో అయోమయ పరిస్థితి ఏర్పడింది. ఇంతవరకు మూడు గ్రూపులుగా ఉన్న మాడుగుల టీడీపీలో తాజాగా నాలుగో వ్యక్తి తెరమీదకు రావడంతో నేతలకు పాలుపోవడం లేదు. నియోజకవర్గ ఇన్‌చార్జి పీవీజీ కుమార్‌, మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడులతో కలిసి మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి గురువారం మాడుగుల వచ్చి తనను మాడుగుల టీడీపీ అభ్యర్థిగా ప్రకటించారని తెలిపారు. మరో వైపు తానే టీడీపీ అభ్యర్థిని అని పేర్కొంటూ పైలా ప్రసాదరావు అట్టహాసంగా శుక్రవారం నామినేషన్‌ దాఖలుచేశా రు. ఇప్పటికే ముగ్గురు నాయకులు మధ్య వర్గపోరుతో నలిగిపోతున్న పార్టీ కార్యకర్తలు ఇప్పుడు నాలుగో వ్యక్తి తెరమీదకు రావడంతో ఎవరి వెనుక తిరగాలి, ఎవరికి పార్టీ అధినాయకత్వం బిఫారం ఇస్తుందో తెలియక జుత్తు పీక్కుంటున్నారు. మాడుగుల అసెంబ్లీ టీడీపీ టికెట్‌ను పైలా ప్రసాదరావు, పీవీజీ కుమార్‌, మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు ఆశించారు. వీరిలో పైలా ప్రసాదరావును మాడుగుల అభ్యర్థిగా గత నెల 14న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దీంతో నెల రోజులుగా ఆయన ప్రచారం చేస్తున్నారు. అయితే తాజా బండారు తెరమీదకు వచ్చింది.

బిఫారం నాకే వస్తుంది : పైలా ప్రసాదరావు

నామినేషన్‌ అనంతరం పైలా ప్రసాదరావు విలేకరులతో మాట్లాడుతూ కచ్చితంగా టీడీపీ బిఫారం తనకే వస్తుందని చెప్పారు. ప్యాకేజీ స్టార్‌గా అవతారమెత్తి తనపై కుట్రలు చేయడం మాజీ ఎమ్మెల్యే రామానాయుడుకు తగదని హితవుపలికారు. నిన్నటి మొన్నటి వరకు నాన్‌లోకల్‌ వద్దు, లోకలే ముద్దు అని ప్రచారం చేసిన వ్యక్తులు ఇప్పుడు నాన్‌లోకల్‌ అయిన బండారు సత్యనారాయణ మూర్తికి ఎలా మద్దతు తెలుపుతున్నారని ప్రశ్నించారు.పార్టీ ఎవరికి టికెట్‌ ఇచ్చినా పనిచేస్తామని దేవుడి ఎదుట చెప్పిన పీవీజీ, రామానాయుడులు ఇప్పుడు తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారన్నారు. మాట తప్పిన వారికి కార్యకర్తలతో పాటు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. బండారుకు టికెట్‌ ప్రకటించారని చెబుతున్నారు, మీకు బిఫారం రాకపోతే ఏంచేస్తారని విలేకరులు ప్రశ్నించగా బి ఫారం రానప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతానని పైలా సమాధానమిచ్చారు. చంద్రబాబు ఆశీస్సులతో మాడుగుల ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్‌ వేయడం చాలా ఆనందంగా ఉందన్నారు.

Advertisement
Advertisement