‘ఓపెన్‌’ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి | Sakshi
Sakshi News home page

‘ఓపెన్‌’ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

Published Tue, Apr 23 2024 8:45 AM

-

ఆదిలాబాద్‌టౌన్‌: ఓపెన్‌ స్కూల్‌ పదో తరగతి, ఇంటర్మీడియెట్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని డీఈవో టి.ప్రణీత అన్నారు. ఈ నెల 25 నుంచి మే2 వరకు కొనసాగనున్న పరీక్షల నిర్వహణపై తన చాంబర్‌లో సీఎస్‌, డీవోలతో సోమవారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పరీక్షలు ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు కొనసాగుతాయని అ న్నారు. జిల్లాలో పది పరీక్షలకు 792 మంది, ఇంటర్‌ పరీక్షలకు 463 మంది అభ్యాసకులు హాజరుకానున్నట్లుగా పేర్కొన్నారు. అభ్యాసకులకు ఇబ్బందులు తలెత్తకుండా పరీక్ష కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలని సూచించారు. పది పరీక్షల కోసం 3, ఇంటర్‌ పరీక్షల కోసం రెండు కేంద్రాలను ఆదిలాబాద్‌లో ఏర్పా టు చేసినట్లుగా తెలిపారు. అభ్యాసకులు గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవా లన్నారు. సీఎస్‌, డీవో, ఇన్విజిలేటర్స్‌ కూడా పరీక్ష కేంద్రానికి సెల్‌ ఫోన్లు తీసుకురావద్దని తెలిపారు. హాల్‌ టికెట్లను అధ్యయన కేంద్రాల ద్వారా పొందవచ్చన్నారు. సమావేశంలో ఓపెన్‌ స్కూల్‌ కో ఆర్డినేటర్‌ ఎన్‌.అశోక్‌, పరీక్షల విభాగం అసిస్టెంట్‌ కమిషనర్‌ వేణుగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement