సీఎం ప్రసంగంతో కాంగ్రెస్‌ ఓటమి ఖాయం | Sakshi
Sakshi News home page

సీఎం ప్రసంగంతో కాంగ్రెస్‌ ఓటమి ఖాయం

Published Tue, Apr 23 2024 8:40 AM

-

● బీజేపీ పార్లమెంటరీ ఇన్‌చార్జి పాయల్‌ శంకర్‌

ఆదిలాబాద్‌టౌన్‌: ఆదిలాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రసంగం చూస్తే రాష్ట్రంలో పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు ఘోరంగా ఒడిపోతున్నట్లు స్పష్టమైందని బీజేపీ పార్లమెంటరీ ఇన్‌చార్జి, ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ ఆరోపించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని రాంనగర్‌లో పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సభలో ప్రజలకు ఉపయోగం లేని ప్రసంగం చేశారన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ కలిసి ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించడం సరికాదన్నారు. ప్రభుత్వాన్ని కూల్చే అవసరం బీజేపీకి లేదన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన సీఎం అమలు చేయడంలో విఫలమయ్యారన్నారు. ఆగస్టు 15న అమలు చేస్తామని పేర్కొనడం హస్యస్పదంగా ఉందన్నారు. ఆదిలాబాద్‌తో పాటు రాష్ట్రంలోని 14 మంది బీజేపీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందుతున్నారని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్‌ మాట్లాడుతూ తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎలాంటి అవినీతి మచ్చలేని తనపై సీఎం రేవంత్‌ తప్పుడు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. తన అవినీతిని నిరుపిస్తే దేనికై నా సిద్ధమని సవాల్‌ విసిరారు. అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే ఇంద్రవెల్లిలో ఆదివాసీలను కాల్చిచంపారని వారే ఇప్పుడు అమరవీరులకు నివాళులర్పించడం విచా రకరమన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వి.ఆదినాథ్‌, నాయకులు నగేష్‌, లాలా మున్నా, రవి, దయాకర్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement