'30వ తేదీన ఏముంది?' అంద‌రికీ గుర్తుండేలా ‘స్వీప్‌’ హోర్డింగ్‌లు! | - | Sakshi
Sakshi News home page

'30వ తేదీన ఏముంది?' అంద‌రికీ గుర్తుండేలా ‘స్వీప్‌’ హోర్డింగ్‌లు!

Nov 27 2023 12:16 AM | Updated on Nov 27 2023 9:53 AM

- - Sakshi

కలెక్టరేట్‌ చౌక్‌లో ఏర్పాటు చేసిన హోర్డింగ్‌

సాక్షి, ఆదిలాబాద్‌: ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు వేసే దిశగా ప్రజలను సన్నద్ధం చేసేందు కోసం స్వీప్‌ ఆధ్వర్యంలో జిల్లా అధికార యంత్రాంగం చేపట్టిన వినూత్న ప్రచారం అందరిని ఆలోచింపజేస్తోంది.

అసెంబ్లీ ఎన్నికలు జరిగే తేదీని ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో పట్టణంలోని ప్రధాన కూడళ్లలో 30వ తేదీన ఏముంది.. అనే శీర్షికన స్థానిక కలెక్టర్‌చౌక్‌, ఎన్టీఆర్‌చౌక్‌, రిమ్స్‌ వంటి ప్రధాన కూడళ్లలో అధికార యంత్రాంగం భారీ హోర్డింగ్‌లను ఏర్పాటు చేసింది.

వీటిని చూసిన ప్రతి ఒక్కరూ ఆ తేదీన ఏముందని చర్చించుకుంటూ పోలింగ్‌ తేదీని గుర్తు చేసుకుంటున్నారు. ఆ రోజున తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని భావిస్తుండటంతో ఈ ప్రచారానికి స్పందన లభిస్తోంది.

ఇవి కూడా చదవండి: 'కారు పార్టీ' స్టీరింగ్‌ ఓవైసీల చేతుల్లోనే.. : రాజా సింగ్‌

Advertisement
 
Advertisement
Advertisement