-
సరిగ్గా 22 ఏళ్ల క్రితం.. మెగాస్టార్ ట్వీట్ వైరల్!
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. బింబిసార ఫేమ్ వశిష్ఠ డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన త్రిష నటిస్తోంది. అయితే ఇవాళ మేడే సందర్భంగా మెగాస్టార్ చేసిన ట్వీట్ నెట్టింట వైరలవుతోంది.సరిగ్గా 22 ఏళ్ల క్రితం అంతర్జాతీయ కార్మిక సంస్థ చేసిన వీడియోను పోస్ట్ చేశారు. పసి పిల్లలను పనివాళ్లుగా చేయొద్దని ఆ వీడియోను రూపొందించారు. ఇవాళ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం కావడంతో మెగాస్టార్ వీడియోను పంచుకున్నారు. ఈ రోజుకీ సంబంధించిన వీడియో కావడంతో షేర్ చేస్తున్నాను అంటూ మెగాస్టార్ ట్విటర్లో రాసుకొచ్చారు. సే నో టూ చైల్డ్ లేబర్.. హ్యాపీ మే డే టూ ఆల్ అంటూ పోస్ట్ చేశారు. 22 సంవత్సరాల క్రితం ... పసి పిల్లలని పని పిల్లలుగా చేయొద్దని International Labour Organisation, ILO కోసం చేసిన "చిన్ని చేతులు" campaign. ఈ రోజుకీ relevant అనిపించి share చేస్తున్నాను. Say NO to Child Labour.Happy May Day to all !International #LaborDay #MayDay pic.twitter.com/q5EqvxeoY6— Chiranjeevi Konidela (@KChiruTweets) May 1, 2024 -
టీమిండియా కెప్టెన్‌కు టాలీవుడ్ స్టార్ హీరో విషెస్..!
టాలీవుడ్ హీరో వెంకటేశ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బర్త్ డే సందర్భంగా స్పెషల్ విషెస్ తెలిపారు. ఆయనతో దిగిన ఫోటోను ట్విటర్లో పంచుకున్నారు. ఇది చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా హీరో వెంకటేశ్‌కు క్రికెట్ అంటే విపరీతమైన అభిమానం. టీమిండియా మ్యాచ్ ఉందంటే చాలు స్టేడియంలో అలా వాలిపోతారు. ఐపీఎల్‌లోనూ సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌కు మద్దతుగా ఉంటారు. కాగా.. వెంకటేశ్ కొత్త ఏడాదిలో సైంధవ్ మూవీతో ప్రేక్షకులను పలకరించారు. సంక్రాంతికి రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. గుంటూరు కారం, హనుమాన్, నా సామిరంగ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడింది. Happy Birthday Hitman @ImRo45! Have an amazing one 🤗 pic.twitter.com/TF7Kv2qfwR— Venkatesh Daggubati (@VenkyMama) April 30, 2024 -
అలా చెప్పే ధైర్యం నీకుందా చంద్రబాబు?.. సీఎం జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేందుకు.. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు మరోసారి చారిత్రక విజయంతో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మలివిడత ఎన్నికల ప్రచార భేరి మోగించారు.ఇక సిద్ధం సభలు గ్రాండ్ సక్సెస్ కావడం.. బస్సు యాత్ర చరిత్ర సృష్టించడంతో వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు, సానుభూతిపరులు రెట్టించిన ఉత్సాహంతో కదం తొక్కుతున్నారు. ఈ క్రమంలో అనంతపురం జిల్లా తాడిపత్రి, తిరుపతి లోక్‌సభ స్థానం పరిధిలోని వెంకటగిరిలోని త్రిభువని సర్కిల్, నెల్లూరు లోక్‌సభ స్థానం పరిధిలోని కందుకూరు కేఎంసీ సర్కిల్లో ఆదివారం జరిగిన సభల్లో సీఎం జగన్ ప్రసంగించారు. మరోవైపు, ఎక్స్ (ట్విటర్) వేదికగా చంద్రబాబు మోసాలను సీఎం జగన్ ఎండగట్టారు.‘‘అయ్యా చంద్రబాబూ.. 2014-19 మధ్య నీ పాలనలో జన్మభూమి కమిటీలను పెట్టావు 2019లో మేము అధికారంలోకి రాగానే వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చాం మరి నువ్వు పెట్టిన జన్మభూమి కమిటీల మీద నమ్మకం, విశ్వాసం ఉంటే మళ్లీ అధికారంలోకి రాగానే జన్మభూమి కమిటీలను తెస్తానని చెప్పే ధైర్యం నీకుందా చంద్రబాబు...? వచ్చే ఎన్నికల్లో మన వైసీపి అభ్యర్థులను ఆశీర్వదించి, ఫ్యాను గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నాను’’ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. అయ్యా చంద్రబాబు.. 2014-19 మధ్య నీ పాలనలో జన్మభూమి కమిటీలను పెట్టావు. 2019లో మేము అధికారంలోకి రాగానే వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చాం. మరి నువ్వు పెట్టిన జన్మభూమి కమిటీల మీద నమ్మకం, విశ్వాసం ఉంటే మళ్లీ అధికారంలోకి రాగానే జన్మభూమి కమిటీలను తెస్తానని చెప్పే ధైర్యం నీకుందా… pic.twitter.com/lSAAuOO7zw— YS Jagan Mohan Reddy (@ysjagan) April 28, 2024 -
ఆగిపోయిన సోనూ సూద్ వాట్సాప్.. కేవలం 61 గంటల్లోనే!
అల్లు అర్జున్ మూవీ జులాయితో ప్రేక్షకులను అలరించిన నటుడు సోనూ సూద్. అరుంధతి చిత్రంతో పశుపతిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం దక్కించుకున్నారు. ప్రస్తుతం బాలీవుడ్లో ఫతే మూవీలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో త్వరలోనే రిలీజ్ కానుంది. అయితే తాజాగా సోనూ సూద్ వాట్సాప్ ఒక్కసారిగా నిలిచిపోయింది. దీంతో వెంటనే ట్విటర్ ద్వారా తన సమస్యను ప్రస్తావించారు.సోనూ సూద్ విజ్ఞప్తిని పరిశీలించిన వాట్సాప్ యాజమాన్యం అతని ఖాతాను పునరుద్ధరించింది. అయిదే దాదాపు 61 గంటల తర్వాత వాట్సాప్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ విషయాన్ని సోనూ ట్విటర్ ద్వారా పంచుకున్నారు. ఫైనల్‌గా నా వాట్సాప్ తిరిగి పనిచేస్తోంది.. కేవలం 61 గంటల వ్యవధిలోనే 9,483 సందేశాలు వచ్చాయి అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరవుతోంది. కాగా.. సోనూ సూద్ నటిస్తోన్న ఫతే చిత్రంలో జాక్వెలీన్ ఫెర్నాండెజ్ కూడా ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రం ద్వారా సోనూ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శక్తి సాగర్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం సైబర్ క్రైమ్ నేపథ్యంలో తెరకెక్కించారు. ఈ చిత్రం ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. -
'ఆ ఒక్క పదం తెచ్చిన తంటా'.. వాళ్లిద్దరిపై మండిపడ్డ హీరోయిన్!
ఇటీవల డార్లింగ్ అనే పదంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. టాలీవుడ్ నటుడు ప్రియదర్శి, హీరోయిన్ నభా నటేశ్ మధ్య ట్వీట్ వార్ కొనసాగిన సంగతి తెలిసిందే. పరిచయం లేని మహిళలను డార్లింగ్ అని పిలిస్తే వేధింపులకు కిందకు వస్తుందని నభా పోస్ట్ చేసింది. ప్రియదర్శి సైతం లైట్ తీస్కో డార్లింగ్ అంటూ రిప్లై కూడా ఇచ్చారు. తాజాగా వీరిద్దర మధ్య జరిగిన ఇంటరాక్షన్‌లో మరో హీరోయిన్ ఎంటరైంది. అదేంటో ఓ లుక్కేద్దాం. ప్రియదర్శి, నటి నభానటేశ్ గొడవలోకి నటి రీతూవర్మ ఎంట్రీ ఇచ్చింది. నా కామెంట్స్ సెక్షన్లో మీ పంచాయతీ ఏంటి? అని ఆమె ఇద్దరిని ప్రశ్నించింది. అసలేం జరిగిందంటే.. ఇటీవల కొద్ది రోజుల క్రితం హీరోయిన్ రీతూవర్మ ఓ ఫొటోషూట్‌కు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఆ పోటోలు చూసిన ప్రియదర్శి స్పందించారు. 'వావ్ రీతూ డార్లింగ్.. ఎంత అందంగా ఉన్నావో. నీ అందానికి ముగ్ధుడనయ్యా. మాటలు రావడం లేదు' అని కామెంట్ చేశారు. అయితే ఇది చూసిన నభా నటేశ్ మళ్లీ స్పందించింది. ఇతను మళ్లీ మొదలుపెట్టాడు.. ఆడవాళ్ల కామెంట్ సెక్షన్‌పై ఉన్నట్టుండి ఆసక్తి చూపిస్తున్నాడు. ప్రతి ఒక్కరనీ డార్లింగ్ అని పిలవడమేంటని అసహనం వ్యక్తం చేసింది. నేను ఎవరినైనా డార్లింగ్ అని పిలిస్తే నీకేంటని ప్రియదర్శి బదులిచ్చారు. తాజా సంభాషణపై రీతూవర్మ కూడా రియాక్ట్ కావాల్సి వచ్చింది. నా కామెంట్ సెక్షన్లో మీ ఇద్దరి గొడవ ఏంటని నిలదీసింది. ప్రస్తుతం వీరి గొడవ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మొత్తానికి నెటిజన్స్‌కు ఫుల్ ఎంటర్టైనింగ్ ఉన్నప్పటికీ ఇందతా సినిమా ప్రమోషన్స్ కోసమేనని చర్చించుకుంటున్నారు. View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) Ahaa! Do not cross the line! Chuskundham.. https://t.co/8mwOpLC0di — Nabha Natesh (@NabhaNatesh) April 17, 2024
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
ఎమ్మెల్యే కనకయ్యకు మంత్రి పరామర్శ
వడదెబ్బతో ముగ్గురు మృతి
భార్య హత్య కేసులో భర్తకు జీవితఖైదు
చికిత్స పొందుతున్న వ్యక్తి...
బీజేపీతోనే సుస్థిర పాలన
మద్యం స్వాధీనం
గిరిజనుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి
మిత్రపక్ష పార్టీల కోఆర్డినేటర్లు వీరే...
హైదరాబాద్‌కు సుప్రీం బెంచ్ తెస్తాం
తప్పక చదవండి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
Advertisement