-
BAN vs SL, 2nd Test: బంగ్లాదేశ్‌ను ఊడ్చేసిన శ్రీలంక.. రెండో టెస్ట్‌లో ఘన విజయం
రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో శ్రీలంక.. బంగ్లాదేశ్‌ను వారి సొంత దేశంలో క్లీన్ స్వీప్ చేసింది. ఇవాళ (ఏప్రిల్ 3) ముగిసిన రెండో టెస్ట్‌లో పర్యాటక జట్టు 192 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌తో పాటు సిరీస్ ఆధ్యాంతం అద్భుతంగా రాణించిన యువ ఆల్‌రౌండర్ కమిందు మెండిస్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుతో పాటు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. కమిందు ఈ సిరీస్‌లో నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 122.33 సగటున రెండు సెంచరీలు, అర్దసెంచరీ సాయంతో 367 పరుగులు చేశాడు. అలాగే మూడు వికెట్లు కూడా పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 531 పరుగులకు ఆలౌటైంది. ఈ ఇన్నింగ్స్‌లో ఏకంగా ఆరుగురు లంక ఆటగాళ్లు అర్దసెంచరీలు చేశారు. ఇన్నింగ్స్‌లో ఒక్క సెంచరీ కూడా నమోదు కాకుండా టెస్ట్‌ల్లో చేసిన అత్యధిక స్కోర్ ఇదే. లంక ఇన్నింగ్స్‌లో నిషన్ మధుష్క (57), కరుణరత్నే (86), కుశాల్ మెండిస్ (93), చండీమల్ (59), ధనంజయ డిసిల్వ (70), కమిందు మెండిస్ (92 నాటౌట్) అర్దసెంచరీలతో రాణించారు. బంగ్లా బౌలర్లలో షకీబ్ 3 వికెట్లు పడగొట్టగా.. హసన్ మెహమూద్ 2, ఖలీద్ అహ్మద్, మెహిది హసన్ మీరజ్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్.. లంక బౌలర్లు విజృంభించడంతో 178 పరుగులకే కుప్పకూలింది. పేసర్లు అసిత ఫెర్నాండో 4, విశ్వ ఫెర్నాండో, లహీరు కుమార తలో 2 వికెట్లు పడగొట్టగా.. స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య 2 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. బంగ్లా ఇన్నింగ్స్‌లో జకీర్ హసన్ (54) టాప్ స్కోరర్‌గా నిలువగా.. మరో నలుగురు అతి కష్టం మీద రెండంకెల స్కోర్లు చేయగలిగారు. భారీ ఆధిక్యంతో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక.. 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసి ప్రత్యర్ది ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. లంక సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఏంజెలో మాథ్యూస్ (56) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బంగ్లా బౌలర్లలో హసన్ మహమూద్ 4 వికెట్లు పడగొట్టగా.. ఖలీద్ అహ్మద్ 2, షకీబ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. భారీ లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లోలా కాకుండా అద్భుతంగా పోరాడింది. బంగ్లా బ్యాటర్లు తలో చేయి వేసినా లక్ష్యం పెద్దది కావడంతో ఓటమి తప్పలేదు. బంగ్లా సెకెండ్ ఇన్నింగ్స్‌లో 318 పరుగులకు ఆలౌటైంది. మొమినుల్ హక్ (50), మెహిది హసన్ మీరజ్ (81 నాటౌట్) అర్దసెంచరీలతో రాణించారు. లంక బౌలర్లలో లహీరు కుమార 4, కమిందు మెండిస్ 3, ప్రభాత్ జయసూర్య 2, విశ్వ ఫెర్నాండో ఓ వికెట్ పడగొట్టారు. ఈ సిరీస్‌లో తొలి టెస్ట్ మ్యాచ్‌లో కూడా శ్రీలంకనే విజయం సాధించింది. -
సర్ఫరాజ్ ఖాన్ తండ్రికి సర్ప్రైజ్ గిఫ్ట్! వీడియో
టీమిండియా తరఫున అరంగేట్రంలోనే అదరగొట్టిన బ్యాటర్లలో ఒకడిగా పేరొందాడు సర్ఫరాజ్ ఖాన్. రంజీల్లో పరుగుల వరద పారించినా.. భారత జట్టులో చోటు కోసం మాత్రం సుదీర్ఘకాలం ఎదురుచూడాల్సి వచ్చింది ఈ ముంబై ప్లేయర్‌కి! అయితేనేం వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సత్తా చాటాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రాజ్‌కోట్‌లో జరిగిన మూడో టెస్టు ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన సర్ఫరాజ్.. మెరుపు అర్ధ శతకం సాధించాడు. తద్వారా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి తానేంటో నిరూపించుకున్నాడు. ఇక సర్ఫరాజ్ ఖాన్‌కు తన తండ్రి నౌషద్ ఖాన్ కోచ్, మెంటార్ అన్న విషయం తెలిసిందే. అరంగేట్రం సందర్భంగా టీమిండియా క్యాప్‌ను ముద్దాడి పుత్రోత్సాహంతో పొంగిపోయాడు నౌషద్. కుమారుడి కోసం తాను చేసిన త్యాగాలు ఫలించినందుకు భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇంత గొప్ప వ్యక్తికి బహుమతిగా ఈ దృశ్యాలు ప్రతి ఒక్కరి మనసును మెలిపెట్టగా.. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర సైతం ఉద్వేగానికి లోనయ్యారు. ‘‘ఎప్పుడూ ధైర్యం కోల్పోకూడదు. కఠిన శ్రమ, ఓపిక ఉండాలి. తండ్రి కంటే తన పిల్లలను ఇంత బాగా ఇన్స్పైర్ చేయగల వ్యక్తి ఎవరు ఉంటారు? అలాంటి గొప్ప వ్యక్తి నౌషద్ ఖాన్.. ఆయన గనుక ఒప్పుకొంటే.. మహీంద్రా థార్‌తో సత్కరించాలనుకుంటున్నా’’ అని బహుమతి ప్రకటించారు. తాజాగా తన మాట నిలబెట్టుకున్నారు ఆనంద్ మహీంద్ర. సర్ఫరాజ్ ఖాన్ టెస్టు అరంగేట్రం సందర్భంగా చెప్పినట్లుగా నౌషద్ ఖాన్‌కు మహీంద్రా కారును అందించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు టీమిండియా తరఫున మూడు టెస్టులు ఆడిన సర్ఫరాజ్ ఖాన్ 200 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక సర్ఫరాజ్ ప్రతిభను గుర్తించిన బీసీసీఐ ఇటీవలే అతడికి సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో చేర్చింది. గ్రేడ్- సీ ప్లేయర్‌గా సర్ఫరాజ్ ఖాన్‌కు అవకాశమిచ్చింది. చదవండి: #Kohli: ఇలాంటి ప్రవర్తన అస్సలు ఊహించలేదు.. నీ స్థాయికి ఇది తగునా కోహ్లి? Anand Mahindra fulfilled his promise and gifted a Mahindra Thar to Sarfaraz Khan's father, Naushad. Mahindra had promised to give the gift following Sarfaraz's Test debut. His father played a key role in Sarfaraz's success and coached him right from childhood. pic.twitter.com/Ktf070Qf5U — Sanjay Kishore (@saintkishore) March 23, 2024 -
నేను 22 ఏళ్లు ఎదురుచూశా.. నువ్వు ఆ మాత్రం వెయిట్ చేయలేవా?
సచిన్ టెండుల్కర్.. ఇరవై నాలుగేళ్ల సుదీర్ఘ కెరీర్లో అరుదైన ఘనతలెన్నో సాధించి క్రికెట్ దేవుడిగా నేటికీ నీరాజనాలు అందుకుంటున్నాడు. నభూతో న భవిష్యతి అన్న రీతిలో అంతర్జాతీయ క్రికెట్లో ఏకంగా వంద సెంచరీలు సాధించి శిఖరాగ్రాన నిలిచాడు. అయితే, సచిన్ వ్యక్తిగతంగా లెక్కకు మిక్కిలి రికార్డులు కొల్లగొట్టినా ఒక్కటంటే ఒక్క వరల్డ్‌కప్ ట్రోఫీని ముద్దాడటానికి 22 ఏళ్లు నిరీక్షించాల్సి వచ్చింది. తాను భాగమైన భారత జట్టు 2011లో వన్డే ప్రపంచకప్ గెలవడంతో సచిన్ టెండుల్కర్ చిరకాల కల నెరవేరింది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ సచిన్ టెండుల్కర్ అప్పట్లో తనలో స్ఫూర్తిని నింపాడంటూ తాజాగా గుర్తుచేసుకున్నాడు.. నాటి అరంగేట్ర, ‘యువ’ బౌలర్. ‘‘ఆరోజు మేము వాంఖడే స్టేడియంలో మ్యాచ్ ఆడుతున్నాం. వికెట్ ఫ్లాట్‌గా ఉంది. వెస్టిండీస్ స్కోరు అప్పటి బహుశా 500/4 అనుకుంటా. నాలో.. వికెట్ తీయలేకపోతున్నాననే అసహనం పెరిగిపోతోంది. అప్పటికి నా వయసు 21 ఏళ్లు. ఇరవై ఒక్క ఓవర్ల పాటు వికెట్ తీయలేకపోవడం అదే మొదటిసారి. ఆ సమయంలో సచిన్ టెండుల్కర్ మిడాఫ్‌లో తన ఫీల్డింగ్ పొజిషన్లో నిలబడి ఉన్నాడు. నన్ను చూసి... ‘ఏమైంది అలా ఉన్నావు? ఎందుకంత నిరాశ?’ అని అడిగాడు. అందుకు బదులిస్తూ.. ‘పాజజీ.. నా బౌలింగ్‌లో ఇప్పటివరకు 21 ఓవర్లు అయినా వికెట్ తీయకపోవడం ఇదే తొలిసారి తెలుసా?.. అలాంటిది అరంగేట్రంలో ఇలా జరుగుతుందని అనుకోలేదు’ అని వాపోయాను. అప్పుడు వెంటనే.. ఓవర్ మధ్యలోనే.. నన్ను తన దగ్గరికి రమ్మని పిలిచి.. ‘నీకు తెలుసా.. నేను తొలి వరల్డ్‌కప్ అందుకోవడానికి 22 ఏళ్ల పాటు ఎదురుచూశాను. మరి నువ్వు నీ తొలి వికెట్ కోసం కనీసం 21 ఓవర్లపాటు వెయిట్ చేయలేవా? అంతగా నిరాశపడొద్దు. గతంలో ఏం జరిగిందన్నది అప్రస్తుతం. ఇప్పుడు ఏం చేయగలవో ఆలోచించు’ అన్నాడు. అవును.. కదా పాజీ చెప్పింది నిజమే కదా అనిపించింది. ఆ మరుసటి బంతికే నేను డారెన్ బ్రావో(166)ను అవుట్ చేసి తొలి వికెట్ అందుకున్నా. ఆ తర్వాత కార్ల్టన్, డారెన్ సామీ వికెట్లు తీశాను. నా అరంగేట్రం అలా ప్రత్యేకంగా మారిపోయింది’’ అని హర్షం వ్యక్తం చేశాడు. ఈ మేరకు.. బీసీసీఐ ఇంటర్వ్యూలో తన మనసులోని భావాలు పంచుకుంటూ.. మన ఆలోచనా విధానాన్ని, అంతకు ముందున్న పరిస్థితులను మార్చడానికి ఒక్క మాట చాలని తనకు ఆరోజు తెలిసిందన్నాడు. సచిన్ టెండుల్కర్ చెప్పిన ఆ స్పూర్తిదాయక మాటలు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటానని పేర్కొన్నాడు. ఇంతకీ ఆ బౌలర్ పేరు చెప్పలేదు కదూ! వరుణ్ ఆరోన్.. జంషెడ్‌పూర్‌కు చెందిన 34 ఏళ్ల రైటార్మ్ పేసర్. 2011లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. 9 టెస్టులు, 9 వన్డేలు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 18, 11 వికెట్లు తీశాడు. చదవండి: IPL 2024: అరంగేట్రంలో అదరగొట్టేందుకు!.. అందరి కళ్లు అతడిపైనే.. -
Ind vs Aus 2024: పెర్త్‌లో తొలి టెస్టు!
మెల్బోర్న్: టెస్టు ఫార్మాట్లో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌లో ఉన్న భారత జట్టు ఈ ఏడాది చివర్లో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) విజేత ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్‌లో పోటీపడనుంది. ఆస్ట్రేలియా వేదికగా ఈ సిరీస్ జరుగుతుంది. నవంబర్‌లో మొదలయ్యే ఈ సిరీస్‌లో ఐదు టెస్టుల వేదికలను క్రికెట్ ఆస్ట్రేలియా ఖరారు చేసినట్లు సమాచారం. ఈ రెండు మేటి జట్ల మధ్య జరిగే తొలి టెస్టుకు పెర్త్ ఆతిథ్యమివ్వనుంది. అనంతరం రెండో టెస్టు అడిలైడ్‌లో... మూడో టెస్టు బ్రిస్బేన్‌లో... నాలుగో టెస్టు మెల్బోర్న్లో... చివరిదైన ఐదో టెస్టు సిడ్నీలో జరగనున్నాయి. అడిలైడ్‌లో జరిగే రెండో టెస్టు డే–నైట్‌గా జరుగుతుంది. ఈ సిరీస్ పూర్తి షెడ్యూల్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా ఈ నెలాఖరులో అధికారికంగా ప్రకటించనుంది. -
రోహిత్ భయ్యా తిడతాడు కానీ... టీమిండియా నయా స్టార్
Seeing Rohit Sharma "Pyaar Sa Aata Hai": ‘‘రోహిత్ భాయ్ కెప్టెన్సీలో ఆడటాన్ని పూర్తిగా ఆస్వాదిస్తాను. చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడుతున్నాను. ఐపీఎల్‌లోనూ తొమ్మిది- పదేళ్ల పాటు ఆడాను. దేశవాళీ క్రికెట్లో ఇప్పటికీ ఆడుతూనే ఉన్నా. అయితే, అన్నింటితో పోలిస్తే రోహిత్ భయ్యా కెప్టెన్సీలో ఆడటం ఎంతో సంతోషంగా ఉంటుంది. ఆయన మంచి కప్టెన్. ఆయన పట్ల నాకు ఆరాధనా భావం ఉంది. జట్టులో అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తాడు. టీమ్ మీటింగ్ జరుగుతున్నపుడు రోహిత్ భయ్యా మాట్లాడటం చూస్తుంటే నాకు ఆమిర్ ఖాన్ సినిమా ‘లగాన్’ గుర్తుకువస్తూ ఉంటుంది’’ అని టీమిండియా నయా బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ అన్నాడు. ఇటీవల స్వదేశంలో ఇంగ్లండ్‌తో ముగిసిన టెస్టు సిరీస్ సందర్భంగా ముంబై స్టార్ సర్ఫరాజ్ భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. రాజ్‌కోట్ మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన ఈ రంజీ వీరుడు.. మెరుపు అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాతి మ్యాచ్‌లలోనూ భాగమై మరో రెండు హాఫ్ సెంచరీలతో సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మతో తన అనుబంధం, నాయకుడిగా అతడు వ్యవహారశైలి గురించి తాజాగా ఆజ్‌తక్‌తో మాట్లాడాడు సర్ఫరాజ్ ఖాన్. ‘‘రోహిత్ భయ్యా మమ్మల్ని మరీ ఎక్కువగా ఏం తిట్టడు. కాకపోతే సరైన సమయంలో సరైన విధంగా ఆడేలా కాస్త గట్టిగానే హెచ్చరిస్తాడు. మాట్లాడటంలో ప్రతి ఒక్కరికి తమదైన స్టైల్ ఉంటుంది. రోహిత్ భయ్యా సరాదాగా అన్న మాటల్ని కూడా కొందరు వేరే విధంగా అనుకుంటారు. నాకైతే ఆయన మమ్మల్ని తిట్టినట్లు అనిపించదు. ముంబైవాళ్లంతా అలాగే మాట్లాడతారు. ఆటగాళ్లతో రోహిత్ భయ్యా ఎంతో కలుపుగోలుగా ఉంటారు. తను సీనియర్, కెప్టెన్ అన్నట్లుగా వ్యవహరించరు’’ అని సర్ఫరాజ్ ఖాన్ చెప్పుకొచ్చాడు. కాగా గత ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన సర్ఫరాజ్‌ను ఆ ఫ్రాంఛైజీ విడిచిపెట్టగా.. వేలంలో అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు. చదవండి: IPL 2024: అభిమానులకు బ్యాడ్‌న్యూస్.. బీసీసీఐ కీలక నిర్ణయం?
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
స్వల్పంగా పెరిగిన పసిడి.. అదే బాటలో వెండి
అమెరికన్ల ఇంటి పేర్లు ఎలా ఉంటాయో తెలుసా..!
ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
కూతురితో కలిసి ప్రముఖ ఆలయాన్ని సందర్శించిన స్టార్ హీరోయిన్!
పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా
పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల
పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు
16 ఏళ్లకే గర్భం ఆపై భర్త మోసం.. ఇప్పుడు స్టార్ హీరోకు అత్తగా..
తప్పక చదవండి
- ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- ప్రవీణ్‌తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- గర్ల్ ఫ్రెండ్‌కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement