breaking news
South Indian Stars
-
షావుకారు జానకి మృతి పట్ల ప్రముఖుల నివాళి
షావుకారు జానకి మృతి పట్ల పలువురు దక్షిణాది స్టార్స్ తమ సంతాపం వ్యక్తం చేశారు.→ షావుకారు జానకిగారు నాకు తల్లిగా ఎన్నో చిత్రాల్లో నటించారు. కొన్ని దశాబ్దాల పాటు మేం ఎన్నో సినిమాల్లో కలిసి పని చేశాం. ఆనాటి హీరోలందరితోనూ నటించిన ఘనత జానకిగారిది. నా గురువు కె. బాలచందర్‌కు ఆమె అంటే ఎంతో గౌరవం. ఆమెకు నా కన్నీటి వీడ్కోలు. – కమల్‌హాసన్→ లెజండరీ నటి షావుకారు జానకిగారితో కలిసి ‘సూర్య మానసం’ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నాను. ఆ సినిమా సమయంలోని జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసుకుంటున్నాను. – మమ్ముట్టి→ తెలుగు, భారతీయ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన షావుకారు జానకిగారి మరణవార్త నాకు ఎంతో బాధ కలిగించింది. జానకిగారి సినీ ప్రయాణం, ఆమె పోషించిన పాత్రలు ఎప్పటికీ మన జ్ఞాపకాల్లో నిలిచిపోతాయి. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. – ఎన్టీఆర్→ ‘షావుకారు’ చిత్రంతో మొదలైన జానకిగారి సుదీర్ఘ సినీ ప్రస్థానం తెలుగు, తమిళంతో పాటు పలు భాషల్లో దాదాపు ఏడు దశాబ్దాలపాటు కొనసాగింది. వైవిధ్యమైన పాత్రలకు తన సహజమైన నటనతో ప్రాణం పోసి, ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న గొప్ప నటి ఆమె..– చిరంజీవి→ మన దేశంలో 75 ఏళ్ళ సుదీర్ఘ నటప్రస్థానం చూసిన ఆర్టిస్ట్ షావుకారు జానకిగారు ఒక్కరే అనుకుంటున్నాను. మా నాన్నగారు హీరోగా నటించిన ‘షావుకారు’తోనే ఆమె షావుకారు జానకిగా సుప్రసిద్ధులయ్యారు. మా బ్యానర్లో పలు చిత్రాల్లో నటించారు. ‘రామ్ – రహీమ్, వేములవాడ భీమకవి’ చిత్రాల్లో షావుకారు జానకిగారితో నటించే అదృష్టం నాకు దక్కింది. – బాలకృష్ణ→ సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న నటి శ్రీమతి జానకిగారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సుమారు 400 చిత్రాల్లో నటించారు. కథానాయికగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్న పాత్రలు పోషించారు. – పవన్ కళ్యాణ్→ దిగ్గజ నటి షావుకారు జానకిగారి మరణం ఎంతో బాధాకరం. ఆమె హుందాతనం, గౌరవప్రదమైన వ్యక్తిత్వం, అద్భుతమైన నట ప్రస్థానం తరతరాలకూ నిలిచిపోతాయి. ఆమెది ఎంత గొప్ప వ్యక్తిత్వమో నేటి యువత తప్పకుండా తెలుసుకోవాలి. – మంచు విష్ణు → జానకమ్మగారితో కలిసి పని చేసే అవకాశం నాకు లభించడం నా అదృష్టం. బలమైన భావాలున్న మనిషి. జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె ఓ లెజెండ్. – రాధిక→ దశాబ్దాల పాటు తన అద్భుతమైన నటనతో కన్నడ, తమిళ, తెలుగు పరిశ్రమలలో ప్రేక్షకులను అలరించి, అందరి హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నారు జానకిగారు. ఆమె నిష్క్రమణతో సినిమా రంగంలో ఒక సువర్ణాధ్యాయం ముగిసింది. – సుమలత అంబరీష్→ ఇండియన్ సినిమా గ్రాండ్ ఓల్డ్ లేడీ.. అత్యంత వృత్తి నైపుణ్యంగల కళాకారిణి అయిన జానకి గారితో కలిసి పని చేయడం నా అదృష్టం. ఆమె తన మాటల్లో ఎంతటి స్పష్టత, పరిపూర్ణతను ప్రదర్శించేవారో, తన పనులను కూడా అంతే అద్భుతంగా చేస్తూనే మాకు కథలు చెప్పేవారు, వంట చేసి వడ్డించేవారు. çముక్కుసూటిగా మాట్లాడేవారు. అమ్మా, మీ ప్రయాణంలో ఒక చిన్న భాగాన్ని పంచుకునే భాగ్యం మాకు కలిగింది. వీడ్కోలు. – నందినీ రెడ్డి– సినిమా డెస్క్ -
ట్విట్టర్ ఇండియా టాప్ 10 జాబితా
స్టార్స్ తాజా చిత్రాల అప్డేట్స్, హాలిడేస్, ఇంకా ఇతర విశేషాల గురించి తెలుసుకోవాలని అభిమానులు అనుకుంటారు. అందుకే ఏదైనా అప్డేట్ దొరుకుతుందేమోనని సోషల్ మీడియాలో వెతుకుతారు. ఎంత బాగా వెతికితే ట్విట్టర్లో అంత ట్రెండ్ అవుతుంటారు స్టార్స్. అలాగే ఎవరి గురించి అయితే ఎక్కువగా ట్వీట్స్ పడతాయనేదాన్ని బట్టి ట్విట్టర్లో వారి స్థానం ఉంటుంది. ‘2020లో ఎక్కువగా ట్వీట్ చేయబడిన దక్షిణ భారత స్టార్స్ వీరే అంటూ ‘ట్విట్టర్ ఇండియా’ టాప్ 10 జాబితాను విడుదల చేసింది. దక్షిణాదిన ఎక్కువగా ట్వీట్ చేయబడిన స్టార్‌గా మహేశ్‌బాబు నంబర్ వన్ స్థానంలో నిలిచారు. మహేశ్ తాజా సినిమాల అప్డేట్స్, భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితారలతో హాలిడే ట్రిప్స్ విశేషాలకు చాలా క్రేజ్ ఉంటుంది. ఇవే మహేశ్ నంబర్ వన్ స్థానానికి కారణం అని చెప్పొచ్చు. ఆ తర్వాతి స్థానం పవన్ కల్యాణ్‌ది. కొంత గ్యాప్ తర్వాత పవన్ చేస్తున్న చిత్రం ‘వకీల్ సాబ్’. ఈ సినిమా విశేషాల కోసం అభిమానులు భారీగానే ట్వీట్స్ చేశారు. ఇక తమిళ మాస్ హీరో విజయ్‌కి సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పైగా విజయ్ రాజకీయ రంగప్రవేశం గురించిన వార్తలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటాయి. సౌత్‌లో మూడో స్థానం విజయ్‌ది. ప్రతిష్టాత్మక ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం చేస్తున్న ఎన్టీఆర్ నాలుగో స్థానం దక్కించుకున్నారు. ఇటీవల సూర్య నటించిన ‘ఆకాశమే నీ హద్దురా’కి లభించిన ఆదరణ, ఆ క్రమంలో ప్రముఖులు చేసిన ట్వీట్లు సూర్యని ఐదో ప్లేస్‌లో నిలబెట్టాయి. ‘పుష్ప’లో డిఫరెంట్ లుక్‌లో కనిపించబోతున్న అల్లు అర్జున్ ఆరవ స్థానంలో, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో నటించడంతో పాటు ‘ఆచార్య’లో కీలక పాత్ర చేస్తున్న రామ్‌చరణ్ ఏడో స్థానంలో, ‘వై దిస్ కొలవెరి..’, ‘రౌడీ బేబీ’ వంటి పాటలతో పాటు మంచి మాస్ క్యారెక్టర్స్‌తో దూసుకెళుతున్న ధనుశ్ ఎనిమిదో స్థానంలో, మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ తొమ్మిది, తెలుగు మెగాస్టార్ చిరంజీవి పదో స్థానంలో నిలిచారు. కథానాయికల్లో అగ్రస్థానం ‘మహానటి’ కీర్తీ సురేశ్‌ది. లాక్డౌన్లో కీర్తీ సురేశ్వి ‘పెంగ్విన్’, ‘మిస్ ఇండియా’ సినిమాలు విడుదలయ్యాయి. అలాగే తాను చేస్తున్న సినిమాల అప్డేట్స్తో ట్రెండ్ అయ్యారు. రెండో స్థానంలో కాజల్ అగర్వాల్ నిలవడం పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదు. కాజల్ పెళ్లి సందడి ట్విట్టర్లో హల్చల్ చేసింది. అలాగే తన భర్త గౌతమ్‌తో మాల్దీవులకు వెళ్లి, ఆ ఫొటోలను షేర్ చేయడం కాజల్‌ని ట్రెండింగ్‌లో ఉంచింది. సమంత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఆమె ఫాలోయర్స్ కూడా అంతే. ఈ బ్యూటీది మూడో స్థానం. రష్మికా మందన్నా నాలుగు, పూజా హెగ్డే ఐదు, తాప్సీ ఆరు, తమన్నా ఏడు, రకుల్ ప్రీత్‌సింగ్ ఎనిమిది, శ్రుతీహాసన్ తొమ్మిది, త్రిష పదో స్థానం దక్కించుకున్నారు. -
చైనాలో చిరు సందడి
80లలో టాప్ స్టార్లుగా వెలిగిన సీనియర్లు ప్రతీ ఏడాది ఓ గెట్టు గెదర్ పార్టీలో కలుస్తుంటారు. ఇప్పటి వరకు చెన్నై, హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాల్లో ఈ పార్టీని ఏర్పాటు చేశారు. కానీ తొలిసారిగా విదేశాల్లో సీనియర్లందరూ కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ పార్టీ కోసం ఇప్పటికే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో పాటు హీరోయిన్స్ ఖుష్బూ, సుహాసినీ, రాధికా, దర్శకుడు భాగ్యరాజ చైనా చేరుకున్నారు. ఇక్కడ తమ ఫాలోయింగ్ కారణంగా బయట ప్రశాంతంగా తిరగలేని మన తారలు చైనా వీదుల్లో చక్కర కొడుతున్నారు. అక్కడి పర్యాటక ప్రదేశాల్లో ఫోటోలు, సెల్పీలు దిగుతూ సందడి చేస్తున్నారు. తాజాగా బీజింగ్ లో మెగాస్టార్ దిగిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. రైల్వే స్టేషన్ తో పాట, బీజింగ్ నేషనల్ స్టేడియం ముందు మన సీనియర్ స్టార్స్ దిగిన ఫోటోలు ఆన్ లైన్ లో వైరల్ అవుతున్నాయి.


