breaking news
Shikha Pandey
-
కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో నలుగురు భారత క్రికెటర్లు
మహిళల కరీబియన్ ప్రీమియర్ లీగ్ (WCPL)లో ఈసారి నలుగురు భారత క్రికెటర్లు బరిలోకి దిగనున్నారు. సెప్టెంబర్ 5న ప్రారంభం కానున్న 2026 ఎడిషన్ (ఐదవది) కోసం శుక్రవారం జరిగిన డ్రాఫ్ట్‌లో టీమిండియాకు చెందిన పూజా వస్త్రాకర్, కిరణ్ నవగిరే, శిఖా పాండే, యస్తిక భాటియాను వేర్వేరు ఫ్రాంచైజీలు ఎంపిక చేసుకున్నాయి.డిఫెండింగ్ ఛాంపియన్స్ బార్బడోస్ ట్రైడెంట్స్ పూజా వస్త్రాకర్, కిరణ్ నవగిరేలను తమ విదేశీ ప్లేయర్ల కోటాలో చేర్చుకోగా.. ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ శిఖా పాండే, యస్తిక భాటియాలను ఎంపిక చేసుకుంది. వీరిలో శిఖాకు ఇప్పటికే WCPLలో అనుభవం (2024 నుంచి) ఉండగా.. మిగతా ముగ్గురికి ఇదే తొలి సీజన్ కానుంది.గతంలో జెమీమా రోడ్రిగ్స్ (2024), శ్రేయాంక పాటిల్ (2023-25) వంటి టీమిండియా స్టార్లు కూడా WCPLలో పాల్గొన్నారు. మొత్తంగా WCPL 2026లో నలుగురు భారతీయుల ప్రవేశం అంతర్జాతీయ ఫ్రాంచైజీ క్రికెట్లో భారత మహిళా క్రికెటర్లకు పెరుగుతున్న అవకాశాలకు సంకేతంగా నిలుస్తోంది.కాగా, WCPL 2026 తొలి మ్యాచ్‌లో బార్బడోస్ ట్రైడెంట్స్, ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ తలపడనున్నాయి. అదే రోజు జరిగే మరో మ్యాచ్‌లో జమైకా ఎంప్రెస్, గయానా అమెజాన్ వారియర్స్ పోటీపడతాయి. ఈ సీజన్ సెప్టెంబర్ 17న జరిగే ఫైనల్‌తో ముగుస్తోంది. మరోవైపు ఇదివరకే మొదలైన పురుషుల కరీబియన్ ప్రీమియర్ లీగ్ కీలక దశకు చేరుకుంది. చదవండి: చరిత్ర సృష్టించిన పోలార్డ్ -
WBBL: స్మృతి కంటే జెమీమా, దీప్తి, శిఖాలకే ఎక్కువ ధర!
Womens Big Bash League Draft- మెల్బోర్న్: భారత మహిళల జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన సహా ఆరుగురు భారత క్రికెటర్లు మహిళల బిగ్‌బాష్ టి20 లీగ్ (డబ్ల్యూబీబీఎల్)లో మెరిపించనున్నారు. ఓపెనర్ స్మృతి, ఆల్‌రౌండర్ శిఖా పాండే, టాపార్డర్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్‌లు ఇది వరకే ఈ లీగ్‌లో ఆడారు. అయితే కొత్తగా ఆల్‌రౌండర్ దయాళన్ హేమలత, వికెట్ కీపర్ బ్యాటర్ యస్తిక భాటియాలకు తొలిసారిగా బిగ్‌బాష్ చాన్స్ లభించింది. కానీ భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ను మాత్రం లీగ్ ఫ్రాంచైజీలు పక్కన బెట్టాయి.‘ప్లాటినమ్’ కేటగిరీలో జెమీమా, దీప్తిగతంలో మెల్బోర్న్ రెనిగేడ్స్, సిడ్నీ థండర్లకు ఆడిన అనుభవమున్న సీనియర్ బ్యాటర్‌పై ఎనిమిది ఫ్రాంచైజీల్లో ఏ ఒక్క జట్టు కూడా ఆసక్తి చూపకపోవడం గమనార్హం. హిట్టింగ్తో ఆదరగొట్టే బ్యాటర్ జెమీమాకు బ్రిస్బేన్ హీట్ ‘ప్లాటినమ్’ ఎంపిక ద్వారా పెద్దపీట వేసింది. ఐపీఎల్లో టాప్ 1, 2, 3 రిటెన్షన్ పాలసీలా డబ్ల్యూబీబీఎల్‌లో ప్లాటినమ్, గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ కేటగిరీలుంటాయి.మరో భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మకు మెల్బోర్న్ స్టార్స్ ‘ప్లాటినమ్’ కేటగిరీలో ఎంపిక చేసుకుంది. ఈ కేటగిరీలోకి ఎంపికైన క్రికెటర్లకు రూ. 62.41 లక్షలు (లక్షా 10 వేల ఆసీస్ డాలర్లు) కాంట్రాక్టు మొత్తంగా లభిస్తుంది. శిఖా పాండేకు రూ. 51 లక్షలు‘గోల్డ్’ కేటగిరీలో బ్రిస్బేన్ హీట్‌కు ఎంపికైన శిఖా పాండేకు రూ. 51 లక్షలు (90 వేల ఆసీస్ డాలర్లు), అడిలైడ్ స్ట్రయికర్స్‌కు స్మృతి మంధాన, పెర్త్ స్కార్చర్స్‌కు హేమలత, మెల్బోర్న్ స్టార్స్‌కు యస్తిక భాటియా సిల్వర్ కేటగిరీలో ఎంపికయ్యారు. ఈ ముగ్గురికి రూ. 36.88 లక్షలు (65 వేల ఆసీస్ డాలర్లు) కాంట్రాక్టు ఫీజుగా లభిస్తుంది. ఈ సీజన్ మహిళల బిగ్‌బాష్ లీగ్ వచ్చే నెల 27న అడిలైడ్‌లో మొదలవుతుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ అడిలైడ్ స్ట్రయికర్స్‌తో బ్రిస్బేన్ హీట్ జట్టు తలపడుతుంది. -
జట్టులో నో ఛాన్స్.. ఏడ్చేసిన టీమిండియా స్టార్ క్రికెటర్! వీడియో వైరల్
బంగ్లాదేశ్ పర్యటనకు భారత మహిళల జట్టు అన్ని విధాల సిద్దమవుతోంది. ఈ పర్యటనలో భాగంగా భారత్ మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ అతిథ్య బంగ్లాదేశ్‌తో తలపడనుంది. హర్మాన్ ప్రీత్ సారథ్యంలోని భారత జట్టు జూలై5న బంగ్లాదేశ్‌కు పయనమైంది. అయితే ఈ మల్టీఫార్మాట్ సిరీస్‌కు ప్రకటించిన భారత జట్టులో స్టార్ బౌలర్ శిఖా పాండేకు చోటుదక్కలేదు. ఈ సిరీస్‌కు తనను ఎంపిక చేయకపోవడంపై శిఖా పాండే అసంతృప్తి వ్యక్తం చేసింది. తాజాగా మాజీ కోచ్ డబ్ల్యూవీ రామన్ తో స్పోర్ట్స్‌స్టార్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శిఖా ఏడ్చేసింది. "నేను నిరుత్సాహంగా, కోపంగా లేనని చెబితే నేను అస్సలు మనిషినే కాదు. మనం కష్టపడినదానికి తగిన ఫలితం దక్కకపోతే చాలా బాధగా ఉంటుంది. నన్ను తప్పించడం వెనుక ఎదో పెద్ద కారణం ఉంది. అది ఎంటో నాకు కూడా చెబితో బాగున్ను. కానీ నేను నా హార్డ్‌వర్క్‌నే నమ్ముతా అంటూ శిఖా పాండే కన్నీరు పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా శిఖా పాండే ఇప్పటివరకు 55 వన్డేలు, 56 టీ20ల్లో భారత్ జట్టుకు ప్రాతినిథ్యం వహించింది. అదే విధంగా తొలి మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడిన శిఖా అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. అయినప్పటికీ పాండేకు జాతీయ జట్టులో చోటు దక్కకపోవడం అందరని ఆశ్చర్యపరిచింది. ఆమెతో పాటు బంగ్లాటూర్‌కు రిచా ఘోష్, రేణుకా సింగ్‌కు కూడా చోటు దక్కలేదు. చదవండి: IND vs WI: అతడిని ఎందుకు సెలక్ట్ చేశారు.. ఏం చేశాడని! పాపం రుత్‌రాజ్ 🗣️ Shikha Pandey gets teary-eyed talking about the disappointment of not finding a place in the Indian team. Watch the full interview with @wvraman here ➡️ https://t.co/9H20WnkoZG#WednesdaysWithWV | #WomensCricket pic.twitter.com/d5tJmro6SC — Sportstar (@sportstarweb) July 6, 2023


