-
చికాగో ఆంధ్ర అసోసియేషన్ సంక్రాంతి సంబరాలు
-
న్యూయార్క్ లో సంక్రాంతి, రిపబ్లిక్ డే వేడుకలు
-
ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ AAA సంక్రాంతి సంబరాలు
-
చికాగోలో ఘనంగా సంక్రాంతి, రిపబ్లిక్ డే వేడుకలు!
అమెరికాలోని చికాగోలో తెలుగువారు సంక్రాంతి, రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ‘ట్రై స్టేట్ తెలుగు అసోసియేషన్’ స్థానిక హిందూ టెంపుల్ ఆఫ్ లేక్ కౌంటీ ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ సంబరాలు అంబరాన్నంటాయి. సంస్థ అధ్యక్షుడు హేమంత్ పప్పు ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇక అందంగా అలంకరించిన వేదిక ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలా నిర్వహించిన సంగీత, నాట్య కార్యక్రమాలు అలరించాయి. సంస్థ ప్రతినిధులు, సభ్యులు, వాలంటీర్లు ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం వినోదాత్మకంగా నడిపించారు. ఈ వేడుకల్లో 300 మందికిపైగా పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి వందల సంఖ్యలో వచ్చిన సభ్యుల నడుమ నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. చిన్నారులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రతిభను చాటారు. ఈ వేడుకలను పురస్కరించుకుని స్థానిక కళాకారులచే ఏర్పాటు చేసిన సంగీత కార్యక్రమాలు ఆహుతులను ఉర్రూతలూగించాయి. ఇక ఈ వేడుకల్లో పాల్గొన్న పార్టిసిపెంట్స్‌కు పలువురు ప్రముఖులు సర్టిఫికెట్లు అందజేసి, ప్రోత్సహించారు. పలు సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని మద్దతు తెలిపారు. ఈ నిర్వహించిన ట్రై స్టేట్ తెలుగు అసోసియేషన్ సభ్యులను పలువురు కొనియాడారు. ఇక ఈ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అవటం పట్ల సంస్థ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. సంస్థకు అండగా ఉంటూ సహాయసహాకారాలు అందిస్తున్న ప్రతిఒక్కరికీ నిర్వహకులు ధన్యవాదాలు తెలిపారు. (చదవండి: ఫ్లోరిడాలో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు) -
సింగపూర్ సంక్రాంతి శోభ
శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ ఆధ్వర్యంలో “సింగపూర్ సంక్రాంతి శోభ” కార్యక్రమం ఆద్యంతం అంతర్జాల వేదికపై అలరించింది. సింగపూర్ వాస్తవ్యులైన పెద్దలు పిల్లలు కలిసి సంక్రాంతి పండుగని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఈ సంబరాల్లో ఆనందంగా పాల్గొన్నారు. తెలుగు సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హర్యానా రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు శ్రీ బండారు దత్తాత్రేయ పాల్గొని సంస్థ యొక్క కార్యక్రమాలను కృషిని అభినందించారు. వారు మాట్లాడుతూ “సంక్రాంతి ప్రకృతి పండుగ అని, స్నేహ సంబంధాలు పెంచి ఆత్మీయతను పంచే పండుగ అని, విదేశాలలో ఈ తరం పిల్లలను కూడా ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలలో కలుపుకుంటూ మన సంప్రదాయక విలువలను వారికి తెలియజేసే విధంగా వివిధ పండుగల వేడుకలను నిర్వహించడం చాలా ఆనందదాయకంగా ఉంది అని తెలియజేశారు. సింగపూర్ లో సంస్కృతీ సంప్రదాయాలు పరిరక్షణ చేసే దిశగా ఈ సంస్థ మరిన్ని కార్యక్రమాలను చెయ్యాలని దీవించారు. ఆత్మీయ అతిథులుగా సీనియర్ బిజెపి నాయకులు, సింగపూర్ తెలుగు సమాజం పూర్వ అధ్యక్షులు శ్రీ వామరాజు సత్యమూర్తి, ప్రముఖ సినీ గేయ రచయిత శ్రీ భువనచంద్ర, వంశీ ఆర్ట్ థియేటర్స్ వ్యవస్థాపకులు డాక్టర్ వంశీ రామరాజు పాల్గొని, శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్‌లో తెలుగు సంస్కృతి కోసం చేస్తున్న సేవలను అభినందించారు. అలాగే సింగపూర్ లో సంగీత సాహిత్యాలలో అపారమైన ప్రతిభ ఉన్నవారు ఉన్నారని వారందరినీ ఈ వేదిక ముఖంగా కలుసుకోవడం ఆనందంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సింగపూర్ కు చెందిన ‘స్వర లయ ఆర్ట్స్’ విద్యార్థులచే ప్రదర్శింపబడిన గొబ్బిళ్ళ పాటలు, సంప్రదాయబద్ధమైన ఆటలు, ముగ్గులు, భోగి పళ్ళు, హరిదాసు వేషధారణ అందరినీ ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. సింగపూర్ లో ఉండే తెలుగు ప్రజలలో మంచి కళా సృజన రసాత్మకత నిండి ఉన్నాయని, వారి యొక్క ప్రతిభను ప్రోత్సహించే విధంగా ఇటువంటి వేదికలు మరిన్ని ఏర్పాటు చేసే దిశగా తమ సంస్థ కృషి చేస్తుందని తమకు బండారు దత్తాత్రేయ గారు మరియు ప్రముఖులైన ఇతర ఆత్మీయ అతిథులు అందించిన అభినందనలు ఆశీస్సులు మరింత స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ మాట్లాడుతూ, అతిథులకు కళాకారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాధిక మంగిపూడి సభా నిర్వహణలో, విద్యాధరి కాపవరపు, సౌభాగ్య లక్ష్మీ తంగిరాల, షర్మిల చిత్రాడ, శేషు కుమారి యడవల్లి, సౌమ్య ఆలూరు, శరజ అన్నదానం, కృష్ణ కాంతి, తదితరగాయనీమణులు చక్కటి సంక్రాంతి పాటలను ఆలపించారు. అలాగే సింగపూర్ సాహితీ ప్రతిభను కూడా నిరూపిస్తూ అపర్ణ గాడేపల్లి, సుబ్బు వి పాలకుర్తి, ఫణీష్ ఆత్మూరి, స్వాతి జంగా, రోజా రమణి ఓరుగంటి, కవిత కుందుర్తి, శైలజ శశి ఇందుర్తి, శాంతి తెల్లదేవరపల్లి తదితరులు సంక్రాంతి పండుగ విశిష్టతను వివరిస్తూ తెలుగు పద్యాలు, సంక్రాంతి కవితలు రచించి వినిపించారు. సంస్థ కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు చామిరాజు, శ్రీధర్ భారద్వాజ్, సుధాకర్ జొన్నాదులు, భాస్కర్ ఊలపల్లి, రాంబాబు పాతూరి తదితరులు కూడా కార్యక్రమంలో పాల్గొని తమ శుభాకాంక్షలు తెలియజేశారు రాధాకృష్ణ గణేశ్న యొక్క సాంకేతిక సారధ్యంలో ఈ కార్యక్రమం శ్రీ సాంస్కృతిక కళాసారథి యూట్యూబ్ & ఫేస్బుక్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేయబడింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. ఫోటోలు వైర్
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్‌కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement