జియో నేచురల్ చేతికి సంగీత ఆహార్
బెంగళూరు: ఆహార ఉత్పత్తుల డెలివరీ కం పెనీ సంగీత ఆహార్ను జియో నేచురల్ కంపె నీ కొనుగోలు చేసింది. సంగీత ఆహార్ విలీనం కారణంగా తమ ఆదాయం 30 శాతం మేర పెరగగలదని జియో నేచురల్ అంచనా వేస్తోంది. సంగీత ఆహార్ కొనుగోలు వల్ల రోజుకు 6వేలకు పైగా భోజనాలను అందించగలమని జియో నేచురల్ ఎండీ, జయాస్ దామోదరన్ చెప్పారు. వచ్చే క్వార్టర్ నుంచి రెడీ-టు-కుక్, పర్సనలైడ్డ్ మీల్స్ వంటివి ఆఫర్ చేయనున్నామని ఆయన పేర్కొన్నారు. 2014లో ప్రారంభమైన జియో నేచురల్ కంపెనీ పోషకాలు పుష్కలంగా ఉన్న, రసాయనాలు లేని, పోషకాలపరంగా సమతూకమైన ఆహారాన్ని వినియోగదారులకు అందిస్తోంది.