-
ఇయర్ రౌండప్ 2022: హిట్ బొమ్మలివే...
దాదాపు 275 (స్ట్రెయిట్, డబ్బింగ్) చిత్రాలు... 20 శాతం హిట్స్‌తో 2022 ముగియనుంది. గత ఏడాది కరోనా లాక్డౌన్ ఎఫెక్ట్ పడింది. ఈ ఏడాది థియేటర్స్‌కి లాక్ పడలేదు. అయితే కరోనా తర్వాత ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా? అనే సందేహం నడుమ సినిమాలు విడుదల అయ్యాయి. కానీ ప్రేక్షకులు సినిమా పట్ల తమకు ఉన్న ప్రేమను నిరూపించుకున్నారు. కానీ విజయాల శాతం మాత్రం ఇరవైకి అటూ ఇటూగానే ఉంది. కాగా స్ట్రెయిట్ చిత్రాలే కాదు.. అనువాద చిత్రాలూ మంచి వసూళ్లు రాబట్టాయి. భారీ అంచనాల నడుమ రిలీజైన కొన్ని చిత్రాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. 2022 ‘హిట్ బొమ్మ’ (చిత్రాలు)లను చూద్దాం. బంగార్రాజుల సందడి వాసివాడి తస్సాదియ్యా... అంటూ సంక్రాంతికి పెద్ద బంగార్రాజు (నాగార్జున), చిన్న బంగార్రాజు (నాగచైతన్య) జనవరి 14న ఫెస్టివల్ ట్రీట్ ఇచ్చారు. కల్యాణŠ కృష్ణ దర్శకత్వంలో దాదాపు రూ. 25 కోట్ల బడ్జెట్‌తో నాగార్జున నిర్మించిన ఈ చిత్రం 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇక ఈ నెల దాదాపు 17 చిత్రాలు వచ్చాయి. టిల్లుగాడు.. దంచి కొట్టాడు ఫిబ్రవరిలో ఇరవై చిత్రాలు విడుదలైతే విజయం శాతం రెండు అనే చెప్పాలి. దాదాపు రూ. 5 కోట్లతో రూపొంది, 30 కోట్ల వరకూ వసూళ్లను దంచి కొట్టాడు ‘డీజే టిల్లు’. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా విమల్‌కృష్ణ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఇదే నిర్మాత దాదాపు రూ. 80 కోట్లతో పవన్ కల్యాణ్, రానా హీరోలుగా సాగర్ Mð.. చంద్ర దర్శకత్వంలో నిర్మించిన ‘భీమ్లా నాయక్’ 150 కోట్లకు పైగా రాబట్టింది. ఇంకా రవితేజ ‘కిలాడి’, మోహన్‌బాబు ‘సన్ ఆఫ్ ఇండియా’తో పాటు మరికొన్ని చిత్రాలొచ్చాయి. ఆర్ఆర్ఆర్... రికార్డ్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘ఆర్ఆర్ఆర్’ మార్చి 25న వచ్చింది. దాదాపు రూ. 550 కోట్లతో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా సుమారు 1150 కోట్ల వసూళ్ల రికార్డుని సాధించింది. ఇదే నెలలో ప్రభాస్ హీరోగా నటించిన ‘రాధేశ్యామ్’తో పాటు మరో పది చిత్రాల వరకూ రిలీజయ్యాయి. నిరాశతో ఆరంభమైన వేసవి ఏప్రిల్‌లో దాదాపు 15 సినిమాలు విడుదలైతే ప్రేక్షకుల మెప్పు పొందిన చిత్రాలు పెద్దగా లేవు. అలా వేసవి నిరాశతో ఆరంభమైంది. వరుణ్ తేజ్ ‘గని’, తండ్రీకొడుకులు చిరంజీవి– రామ్‌చరణ్ కలిసి నటించిన ‘ఆచార్య’ చిత్రాలు భారీ అంచనాల మధ్య విడుదలయ్యాయి. సర్కారుకీ.. ఫన్‌కీ విజయం మహేశ్‌బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన సర్కారువారి పాట’ మే 12న విడుదలైంది. దాదాపు రూ. 60 కోట్లతో మహేశ్‌బాబు, అనిల్ సుంకర, నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం సుమారు 200 కోట్లు వసూ లు చేసింది. ఇక వినోద ప్రధానంగా వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా రూపొందిన ‘ఎఫ్ 3’ మే 27న రిలీజైంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దాదాపు రూ. 70 కోట్లతో ‘దిల్’ రాజు నిర్మించిన ఈ సినిమా సుమారు 130 కోట్లు రాబట్టింది. మేలో మరో 7 చిత్రాలు రిలీజయ్యాయి. ‘మేజర్’ హిట్‌తో.. ఒక్క ‘మేజర్’ హిట్‌తో జూన్ సరిపెట్టుకుంది. హీరో అడివి శేష్ టైటిల్ రోల్లో శశికిరణ్ తిక్క దర్శకత్వంలో తెలుగు, హిందీ భాషల్లో మహేశ్‌బాబు ఓ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం జూన్ 3న విడుదలైంది. దాదాపు రూ. 30 కోట్లతో రూపొంది, 65 కోట్ల వసూళ్లు రాబట్టింది. జూన్‌లో దాదాపు 20 చిత్రాలు రిలీజయ్యాయి. హిట్ లేని నెల జూలైలో గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’, నాగచైతన్య ‘థ్యాంక్యూ’, రామ్ ‘వారియర్’, రవితేజ ‘రామారావు: ఆన్ డ్యూటీ’... ఇలా దాదాపు 20 సినిమాలు విడుదలైనా ప్రేక్షకులు హిట్ చేసిన సినిమాలు ఏవీ లేకుండా పోయాయి. . అదిరింది ఆగస్ట్ ఆగస్టులో వచ్చిన ‘బింబిసార’, ‘సీతారామం’, ‘కార్తికేయ 2’ బంపర్హిట్స్గా నిలిచాయి. కల్యాణ్‌రామ్ హీరోగా నటించగా, ‘బింబిసార’తో వశిష్ఠ దర్శకుడిగా పరిచయమయ్యారు. దాదాపు రూ. 40 కోట్ల బడ్జెట్‌తో నందమూరి కల్యాణ్‌రామ్, కె. హరికృష్ణ నిర్మించిన ఈ చిత్రం 70 కోట్ల వరకూ వసూళ్లను రాబట్టింది. దాదాపు రూ. 30 కోట్లతో రూపొందిన పీరియాడికల్ ప్రేమకథా చిత్రం ‘సీతారామం’ 100 కోట్ల వసూళ్లకు చేరువలో నిలిచింది. దుల్కర్ సల్మాన్, మృణాళ్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా హను రాఘవపూడి దర్శకత్వంలో సి. అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక నిఖిల్ హీరోగా, చందు మొండేటి దర్శకత్వంలో దాదాపు రూ. 20 కోట్ల బడ్జెట్‌తో అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ‘కార్తికేయ 2’ 120 కోట్లు రాబట్టింది. ఒక్క హిందీ భాషలోనే ఈ చిత్రం సుమారు 50 కోట్ల వసూళ్లు రాబట్టడం విశేషం. ఇదే నెలలో విడుదలైన నితిన్ ‘మాచర్ల నియోజకగర్గం’, విజయ్ దేవరకొండ ‘లైగర్’ చిత్రాల వసూళ్లు తడబడ్డాయి. ఒకే ఒక్క విజయం... ఇక సెప్టెంబరులో విడుదలై ప్రేక్షకుల మనసు గెలుచుకున్న చిత్రం ‘ఒకే ఒక జీవితం’. శర్వానంద్ హీరోగా శ్రీ కార్తీక్ దర్శకత్వంలో దాదాపు రూ. 15 కోట్ల బడ్జెట్‌తో ఎస్ఆర్. ప్రభు, ఎస్ఆర్ ప్రకాష్‌బాబు నిర్మించిన ఈ చిత్రం 25 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిందన్నది ట్రేడ్ వర్గాల మాట. ఇంకా ఈ నెలలో దాదాపు పాతిక చిత్రాలు రిలీజయ్యాయి. స్వాతిముత్యానికి విజయం అక్టోబర్ నెలలో వచ్చిన ‘స్వాతిముత్యం’ హిట్‌గా నిలిచింది. దాదాపు రూ. 8 కోట్లతో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా 25 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. బెల్లంకొండ గణేష్ హీరోగా, లక్ష్మణ్ కె కృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం అక్టోబరు 5న విడుదలైంది. ఇదే నెలలో రిలీజైన చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ ఫర్వాలేదనిపించింది. నాగార్జున ‘ది ఘోస్ట్’ కూడా ఇదే నెల వచ్చింది. ఇదే నెల 21న విడుదలైన మంచు విష్ణు ‘జిన్నా’, విశ్వక్సేన్ ‘ఓరి..దేవుడా..’ మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్ లెక్కల్లో తడబడ్డాయి. చిన్న సినిమాకి పెద్ద విజయం సమంత టైటిల్ రోల్ చేసిన ‘యశోద’ నవంబరు 11న విడుదలైంది. హరి–హరీష్ దర్శకత్వంలో దాదాపు రూ. 30 కోట్ల బడ్జెట్‌తో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమా 35 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇక చిన్న సినిమా ‘మసూద’ రూ. 10 కోట్ల బడ్జెట్లోపు రూపొంది, 20 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. సంగీత, తిరువీర్ ముఖ్య తారలుగా సాయికిరణ్ దర్శకత్వంలో రాహుల్ యాదవ్ నక్కా ఈ చిత్రాన్ని నిర్మించారు. నవంబరులో విడుదలైన దాదాపు 20 సినిమాల్లో అల్లు శిరీష్ ‘ఊర్వశివో రాక్షసివో..’, అల్లరి నరేశ్ చేసిన ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీ కం’లకు ప్రేక్షకులు పాస్ మార్కులు వేశారు. ‘హిట్’కి హిట్ జూన్‌లో ‘మేజర్’ హిట్ అందుకున్న అడివి శేష్‌కు డిసెంబరులో ‘హిట్ 2’ రూపంలో మరో హిట్ లభించింది. శైలేష్ కొలను దర్శకత్వంలో దాదాపు రూ. 12 కోట్లతో నాని నిర్మించిన ఈ చిత్రం 30 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక ‘రామారావు: ఆన్ డ్యూటీ’, ‘ఖిలాడి’ చిత్రాల తర్వాత ఈ ఏడాది రవితేజ హీరోగా నటించిన ‘ధమాకా’ ఈ నెల 23న విడుదలైంది. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. అలాగే ‘కార్తికేయ 2’తో హిట్ అందుకున్న నిఖిల్ హీరోగా నటించిన మరో చిత్రం ‘18 పేజెస్’ డిసెంబరు 23నే విడుదలైంది. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం వసూళ్ల లెక్క రానున్న రోజుల్లో తెలుస్తుంది. ఇంకా నెలాఖరున ఆది సాయికుమార్ ‘టాప్ గేర్’తో పాటు మరికొన్ని చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అనువాదం అదిరింది ఈ ఏడాది డబ్బింగ్ చిత్రాల జోరు కనిపించింది. ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి వసూళ్లు సాధించిన ఆ చిత్రాల విశేషాల్లోకి వెళితే... వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి ముఖ్య తారలుగా సుమారు రూ. 20 కోట్లతో రూపొందిన ‘ది కశ్మీరీ ఫైల్స్’ అన్ని భాషల్లో దాదాపు 350 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టిందని టాక్. యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో దాదాపు రూ. 100 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ‘కేజీఎఫ్ 2’ ప్రపంచ వ్యాప్తంగా సుమారు 1000 కోట్లు సాధించిందని టాక్. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో సీనియర్ నటుడు కమల్‌హాసన్ నటించిన ‘విక్రమ్’ సుమారు 100 కోట్లతో రూపొంది, దాదాపు 450 కోట్లు వసూలు చేసిందని భోగట్టా. అలాగే కె. కిరణ్ రాజ్ దర్శకత్వంలో రూ. 20 కోట్లతో రూపొంది, 100 కోట్లకుౖ పెగా వసూళ్లు సాధించింది ‘777 చార్లి’. రిషబ్ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ‘కాంతార’ రూ. 16 కోట్లతో రూపొంది, 450 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. ఇవన్నీ ప్రపంచవ్యాప్త లెక్కలు కాగా తెలుగులో లాభాలిచ్చిన చిత్రాలుగా నిలిచాయి. (వసూళ్ల వివరాలన్నీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం) -
చిన్న సినిమాలతో పోటీ పడుతున్న సమంత
-
ఈ దీపావళికి థియేటర్లో సందడి చేయబోతున్న చిత్రాలివే
ప్రతి సంవత్సరం దీపావళి సందర్భంగా సినిమాలు రిలీజ్ కావడం కామన్. ఈ నెల 24న దీపావళి పండగ. కానీ కొత్త సినిమాల రిలీజ్‌లతో మూడు రోజులు ముందుగానే టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ దీపావళి వెలుగులతో మెరవనుంది. యాక్షన్ టపాసులు, ప్రేమ కాకరపువ్వొత్తులు, నవ్వుల చిచ్చుబుడ్డులు ఆడియన్స్ కోసం సిద్ధం అవుతున్నాయి. ఇక పండగ సందర్భంగా వస్తున్న సినిమాల వివరాల్లోకి ఓసారి వెళదాం. దీపావళికి యాక్షన్ ‘జిన్నా’గా వస్తున్నారు మంచు విష్ణు. ఈషాన్ సూర్య దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్, సన్నీ లియోన్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలో ఓ టెంట్ హౌస్‌ను రన్ చేసే జిన్నా అనే యువకుడి పాత్రలో కనిపించనున్నారు మంచు విష్ణు. తన వాళ్ల కోసం జిన్నా ఎలాంటి రిస్క్‌లు తీసుకున్నాడు? ఎవరి రాక కారణంగా జిన్నా లైఫ్ టర్న్ అయ్యింది? అనేది సినిమా కథ. డా. మోహన్ బాబు ఆశీస్సులతో అవ ఎంటర్టైన్ మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై రూపొందిన ఈ సినిమా ఈ నెల 21న రిలీజ్ కానుంది. మరోవైపు ‘ఓరి దేవుడా..!’ అంటూ ప్రేక్షకులను నవ్వించడానికి రెడీ అవుతున్నారు విశ్వక్ సేన్. ఈ సినిమాలో దేవుడి పాత్రలో వెంకటేశ్ నటించారు. తమిళ దర్శకుడు అశ్వత్ మారిముత్తు తెలుగుకి పరిచయమవుతున్న చిత్రం ఇది. ‘వైఫ్లో ఫ్రెండ్‌ను చూడొచ్చు సార్.. కానీ ఫ్రెండే వైఫ్‌లా వచ్చిందా..!’ అనే డైలాగ్ ‘ఓరి దేవుడా..!’ ట్రైలర్లో ఉంది. సో.. పెళ్లి చేసుకున్న తర్వాత ఓ యువకుడి జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? అనే అంశం ఆధారంగా ఈ సినిమా కథనం ఉంటుందన్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరోయిన్లుగా నటించారు. ప్రసాద్ వి. పొట్లూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న రిలీజ్ కానుంది. ఇక తెలుగులో మంచి పాపులారిటీ సంపాదించుకున్న తమిళ హీరో కార్తీ ‘సర్దార్’గా రానున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా రాశీ ఖన్నా చేయగా, కీలక పాత్రలో లైలా నటించారు. ఓ గూఢచారి చేసే పోరాటం నేపథ్యంలో ‘సర్దార్’ సాగుతుంది. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో ఎస్. లక్ష్మణ్‌కుమార్ నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సినిమాను ప్రముఖ హీరో, నిర్మాత అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ‘జిన్నా’, ఓరి దేవుడా..!’, ‘సర్దార్’ చిత్రాలు రిలీజ్ అవుతున్న రోజునే ‘ప్రిన్స్’ కూడా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. శివ కార్తికేయన్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమాకు ‘జాతి రత్నాలు’ ఫేమ్ కేవీ అనుదీప్ దర్శకుడు. ఉక్రెయిన్ బ్యూటీ మరియా ర్యాబోషప్క హీరోయిన్గా చేశారు. ఇండియన్ కుర్రాడికి, బ్రిటిష్ అమ్మాయికి మధ్య సాగే ప్రేమకథగా ఈ చిత్రం ఉంటుంది. సునీల్ నారంగ్, డి. సురేబాబు, పి. రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను విజయ్ దేవరకొండ ఆదివారం సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతానికి ఈ నాలుగు సినిమాలు దీపావళికి కన్ఫార్మ్ అయ్యాయి. మరికొన్ని చిత్రాలు పండగ రేసులో నిలిచే అవకాశం ఉంది. -
వినాయక చవితికి థియేటర్లో సందడి చేసే భారీ చిత్రాలివే!
కరోనా ప్రభావం సినీ పరిశ్రమపై ఎంతగా పడిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతేడాది మార్చిలో విధించిన లాక్డౌన్ కారణంగా 9 నెలల పాటు సినీ పరిశ్రమతో పాటు థియేటర్లు మూత పడ్డాయి. ఆ తర్వాత పాక్షికంగా థియేటర్లు తెరుచుకున్నప్పటికీ ప్రజలు బిగ్స్క్రిన్పై సినిమా చూసేందుకు భయపడ్డారు. అప్పటి నుంచి ఇప్పటికి ప్రతి పండగలసందర్భంగా విడుదలయ్యే సినిమాల సందడి లేకుండా పోయింది. దీంతో ఓటీటీలోనే సినిమాలు చూడ్సాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కరోనా ఉధృతి తగ్గి ఇప్పుడిప్పుడే థియేటర్లు మెల్లిగా తెరుచుకుంటున్నాయి. వరసగా సినిమాలు థియేటర్లో విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏడాది తర్వాత మళ్లీ పండగ కళ తెచ్చేందుకు పెద్ద సినిమాలు రెడీ అవుతున్నాయి. నాని టక్ జగదీష్, నాగ చైతన్య లవ్ స్టోరీ, రానా విరాట పర్వం, సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్, నాగశౌర్య వరుడు కావలెను, గోపిచంద్ సీటీమార్ వంటి సినిమాలు వినాయక చవితి కానుకగా విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అక్టోబర్‌లో ఆర్ఆర్ఆర్ వంటి భారీ బడ్జెట్ చిత్రం ఉన్న నేపథ్యంలో ఆ లోపే ఈ హీరోలు తమ సినిమాలను విడుదల చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని సమాచారం. కాగా ఇటీవల టక్ జగదీశ్, సీటీమార్, లవ్‌స్టోరీతో పాటు మరిన్ని చిత్రాలు ఓటీటీలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో ప్రేక్షకులు అయోమంలో పడ్డారు. ఈ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలన్ని కూడా థియేటర్లోనే విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే జూలై 30న విడుదలైన తిమ్మరసు చిత్రం మంచి విజయం సాధించగా, రీసెంట్గా విడుదలైన ఎస్ఆర్ కల్యాణ మండపం సినిమా మంచి వసూళ్లు సాధించింది. కరోనా నిబంధనల మేరకు 50 శాతం ఆక్యూపెన్సీతో ప్రస్తుతం థియేటర్లు ఓపెన్ కాగా, వినాయక చవితికి వంద శాతం ఆక్యుపెన్సీతో కళకళలాడనున్నాయి. ఈ క్రమంలో వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ నెలలో పెద్ద సినిమాలు థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. -
ఊరిస్తున్న ఐస్‌క్రీమ్-2
హైదరాబాద్: రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ఐస్‌క్రీమ్-2 సినిమా శుక్రవారం(నవంబర్ 21) ప్రేక్షకుల ముందుకురానుంది. ఐస్‌క్రీమ్ సినిమాను ఒకే ఇంట్లో రూపొందించిన వర్మ సీక్వెల్ లో ఎక్కువ శాతం అవుట్ డోర్ లో తెరకెక్కించారు. మొదటి 'ఐస్‌క్రీమ్' కంటే, ఈ రెండో 'ఐస్‌క్రీమ్' ఇంకా బాగుంటుందని వర్మ ఊరించారు. ఐస్‌క్రీమ్-2తో పాటు రౌడీ ఫెలో, నా బంగారు తల్లి, రాజ్యాధికారం, 33 ప్రేమకథలు ఈ వారం విడుదలవుతున్నాయి. హ్యాపీ ఎండింగ్ హిందీ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఐస్‌క్రీమ్- 2(హార్రర్) తారాగణం: జేడీ చక్రవర్తి, నందు, నవీన, భూపాల్, సిద్దు, ధన్‌రాజ్ దర్శకత్వం: రాంగోపాల్ వర్మ నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ ప్రొడక్షన్: భీమవరం టాకీస్ రౌడీ ఫెలో(యాక్షన్-రొమాంటిక్) తారాగణం: నారా రోహిత్, విశాఖసింగ్, రావు రమేష్, పోసాని, పరుచూరి వెంకటేశ్వరరావు, తాళ్లూరి రామేశ్వరి దర్శకత్వం: కృష్ణచైతన్య నిర్మాత: ప్రకాశ్‌రెడ్డి సంగీతం: సన్నీ ప్రొడక్షన్: మూవీ మిల్స్ అండ్ సినిమా 5 రాజ్యాధికారం తారాగణం: ఆర్. నారాయణమూర్తి, తనికెళ్ల భరణి, ఎల్బీ శ్రీరామ్ కథ, కథనం, మాటలు, ఫొటోగ్రఫీ, సంగీతం, దర్శకత్వం, నిర్మాత: ఆర్. నారాయణమూర్తి ప్రొడక్షన్: స్నేహచిత్ర పతాకం నా బంగారు తల్లి తారాగణం: సిద్ధిఖీ, అంజలీ పాటిల్, లక్ష్మీ మీనన్ దర్శకత్వం: రాజేశ్ టచ్‌రివర్ నిర్మాతలు: ఎంఎస్ రాజేశ్, సునీతా కృష్ణన్ సంగీతం: శాంతనూ మొయిత్రా 33 ప్రేమకథలు(రొమాన్స్) తారాగణం: వివేక్, సునీత మరసీయర్, శ్రావణి, నూకారపు సూర్యప్రకాశరావు, పూర్ణిమ, కృష్ణుడు దర్శకత్వం: శివగణేష్ నిర్మాత: ఫణిచంద్ర సంగీతం: అజయ్ పట్నాయక్ ప్రొడక్షన్: యువన్ టూరింగ్ టాకీస్ హ్యేపీ ఎండింగ్(హిందీ) తారాగణం: గోవిందా, సైఫ్ అలీఖాన్, ఇలియానా, రణ్వీర్ శోరే, కల్కీ కోయ్చ్లిన్ దర్శకత్వం: డీకే కృష్ణ, రాజ్ నిడిమోరు నిర్మాతలు: సైఫ్ అలీఖా, దినేష్ విజాన్, సునీల్ లుల్లా ప్రొడక్షన్: ఎల్లుమినాటి ఫిల్మ్స్
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్‌కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్‌ను ఆశీర్వదించండి
- అక్రమాలు కో‘కొల్లు’లు
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement