-
సరికొత్త టాక్ షోకు హోస్ట్‌గా టాలీవుడ్ హీరో.. ఏ ఓటీటీలో తెలుసా!
టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి గురించి పరిచయం అక్కర్లేదు. గతేడాది బాబాయ్ వెంకటేశ్‌తో కలిసి రానా నాయుడు వెబ్ సిరీస్‌లో నటించారు. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాగా.. ఆడియన్స్ నుంచి విశేష ఆదరణ దక్కించుకుంది. ప్రస్తుతం రానా రజినీకాంత్ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. అంతే కాకుండా రానా ప్రధానపాత్రలో హిరణ్య కశ్యప అనే మూవీని కూడా ప్రకటించారు. ఇదిలా ఉండగా.. రానా సరికొత్త టాక్ షోతో ప్రేక్షకులను అలరించనున్నారు. సెలెబ్రిటీలతో రానా ఈ టాక్ షో చేయనున్నారని అమెజాన్ ప్రైమ్ వీడియో తెలిపింది. తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో నిర్వహించిన ఈవెంట్లో ఈ విషయాన్ని వెల్లడించింది. తన ప్రొడక్షన్ హౌస్ స్పిరిట్ మీడియాలో ఈ షోను ప్రొడ్యూస్ చేయనున్నారు. అయితే ఈ టాక్ షో ఎప్పటి నుంచి మొదలవుతుందని మాత్రం రివీల్ చేయలేదు. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. గతంలో నంబర్ వన్ యారీ టాక్ షో టాలీవుడ్ హీరో రానా గతంలో నంబర్ 1 యారీ పేరుతో ఓ టాక్ షో హోస్ట్ చేశారు. తెలుగు ఇండస్ట్రీ సెలెబ్రిటీలతో ఈ టాక్ షో నిర్వహించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో రానున్న టాక్ షో ది రానా కనెక్షన్ అనే పేరును ఖరారు చేశారు. టాలీవుడ్, బాలీవుడ్‌తో పాటు వివిధ ఇండస్ట్రీలకు చెందిన సెలెబ్రిటీలు ఈ టాక్ షోకు ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయి. An exciting and curiosity-piquing talk show hosted by celebrated actor Rana Daggubati, featuring his friends and contemporaries from Indian cinema. #TheRanaConnectionOnPrime #AreYouReady #PrimeVideoPresents pic.twitter.com/Gg7fcqqeNi — prime video IN (@PrimeVideoIN) March 19, 2024 -
వేట్టయాన్ లో ఎంట్రీ
‘వేట్టయాన్ ’ సెట్స్‌లో జాయిన్ అయ్యారు రానా. రజనీకాంత్ హీరోగా ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఫిల్మ్ ఇది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ , ఫాహద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికా సింగ్, దుషార విజయన్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ‘వేట్టయాన్’ లేటెస్ట్ షెడ్యూల్ చిత్రీకరణ ఇటీవల హైదరాబాద్‌లో మొదలైంది. రజనీకాంత్– అమితాబ్ బచ్చన్ ల మధ్య కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. తాజాగా ఈ సినిమా సెట్స్‌లో తొలిసారి సోమవారం రానా జాయిన్ అయ్యారు. రజనీకాంత్–రానా కాంబినేషన్ సీన్స్‌ని ఈ షెడ్యూల్లో ప్లాన్ చేశారట జ్ఞానవేల్. ఈ సినిమాలో రజనీకాంత్ ఓ పోలీసాఫీసర్ పాత్రలో కనిపిస్తారని, బూటకపు ఎన్ కౌంటర్స్ నేపథ్యంలో ఈ మూవీ కథనం సాగుతుందని తెలిసింది. సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. -
కిడ్నీ, కన్ను దానం చేస్తే తప్ప అడగొద్దు: రానా ఆసక్తికర కామెంట్స్!
టాలీవుడ్ మల్టీ టాలెంటెడ్ హీరోల్లో రానా దగ్గుబాటి ఒకరు. ఒకవైపు నటుడిగా వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూనే.. మరోవైపు నిర్మాతగానూ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. అయితే ఇటీవల ఆయన ఖాతాలో ఒక్క హిట్ కూడా పడలేదు. రాజమౌళి చిత్రం బాహుబలి తర్వాత ఆ స్థాయి గుర్తింపు, విజయం మాత్రం రాలేదు. దీంతో మరో హిట్ కొట్టాలనే కసితో తనకు ‘నేనే రాజు నేనే మంత్రి’ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు తేజతో జత కట్టాడు. రానా ప్రస్తుతం రాక్షస రాజా అనే చిత్రంలో నటిస్తున్నారు. కాగా.. ఇటీవలే డైరెక్టర్ నాగ్ అశ్విన్‌తో కలిసి గుర్గావ్లో జరిగిన సినాప్స్ -2024 ఈవెంట్‌కు రానా హాజరయ్యారు. ఈవెంట్‌కు హాజరైన రానా తన ఆరోగ్యంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆయనకు కొన్నేళ్ల క్రితం కిడ్నీ మార్పిడి జరిగిందని తెలిపారు. అంతేకాదు చిన్న వయసులోనే కార్నియా మార్పిడి జరిగినట్లు వెల్లడించారు. ప్రకృతినే అన్నింటికంటే మెరుగైన వైద్యమని రానా పేర్కొన్నారు. గతంలో తీవ్రమైన అనారోగ్యం నుంచి కోలుకోవడానికి తనకు ప్రకృతి సాయం చేసిందని రానా వివరించారు. రానా మాట్లాడుతూ.. 'అన్నీ సౌకర్యాలున్నా ఆసుపత్రిలో అసంతృప్తితో ఉన్నా. అనారోగ్యం కారణంగా యుఎస్‌లోని మాయో క్లినిక్‌లో ఉన్నా. నాకు ఏం జరిగిందో గుర్తించగలిగే ఏకైక ప్రదేశం అదే. మనం ప్రాణాంతక స్థితిలో ఉన్నప్పుడే జీవితాన్ని చాలా భిన్నంగా చూడటం ప్రారంభిస్తాం. అప్పటి నుంచే ఈ ప్రపంచాన్ని చూసే దృక్పథం మారిపోయింది' అని అన్నారు. అన్నింటిలో మనం అనుకుంటున్నట్లుగా జీవితం ఉండదని అర్థమైందని రానా తెలిపారు. హెల్త్ కండీషన్ గురించి మాట్లాడుతూ.. 'బాహుబలి సినిమా కోసమే తాను అలా మారినట్లు అందరూ భావించారు. అనారోగ్యంతో ఉన్నారా? అని కొందరు అడిగారు కూడా. కానీ నేను వారికి సమాధానం చెప్పాలనుకోలేదు. ఆ పరిస్థితుల్లో నగర ప్రజలతో జీవించడం నాకు చాలా కష్టంగా అనిపించింది. ఎవరైనా నా ఆరోగ్యం గురించి అడిగితే.. మీరు కిడ్నీ, కన్ను దానం చేస్తే తప్ప.. దాని గురించి అడగవద్దని చెప్పా. ఆ సమయంలో నేను చేస్తున్నది నాకే నచ్చలేదు.' అని అన్నారు. 'ప్రకృతే గొప్ప వైద్యం' రానా మాట్లాడుతూ.. 'ఒకసారి నా సినిమా కోసం అడవిలో షూట్ చేసే అవకాశం వచ్చింది. దాదాపు ఏడాది పాటు అక్కడే ఉన్నా. అడవిలో ఏనుగులతో షూటింగ్ చేశాం. అక్కడ నన్ను అడిగేవాళ్లు లేరు. కనీసం నేను అనారోగ్యంతో ఉంటే ఎవరూ పట్టించుకోలేదు. ఆ సమయంలో అడవిలో నిశ్శబ్దమే నా జీవితంలో అవసరమనిపించింది. అన్నింటి కంటే ప్రకృతే గొప్ప వైద్యమని తెలిసింది' అంటూ రానా చెప్పుకొచ్చారు. కాగా.. కోలీవుడ్ డైరెక్టర్ ప్రభు సోలమన్ తెరకెక్కించిన తమళ చిత్రం కాదన్ రీమేక్‌లో రానా నటించారు. ఈ సినిమా ఎక్కువగా అడవిలోనే షూట్ చేశారు. ఈ మూవీని తెలుగులో అరణ్య, హిందీలో హాథీ మేరే సాథీ పేర్లతో విడుదలైంది. కాగా.. గతేడాది రానా పుట్టిన రోజు ఈ సందర్భంగా రానా-తేజ కాంబోలో తెరకెక్కుతున్న కొత్త సినిమా పోస్టర్ని రిలీజ్ చేశారు. ఈ సినిమాకు‘రాక్షస రాజా’అనే టైటిల్‌ని ఖరారు చేశారు. పోస్టర్లో రానా గన్ పట్టుకుని వైల్డ్ లుక్ లో కనిపిస్తున్నారు.గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా రాక్షసరాజా మూవీ తెరకెక్కబోతున్నట్లు సమాచారం. ఇందులో రానా పాత్ర నెగెటివ్ షేడ్స్‌తో ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు చేయని కొత్త పాత్రలో అతడు కనిపించబోతున్నట్లు చెబుతున్నారు. పాన్ ఇండియన్ మూవీగా రాక్షసరాజాను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
BoxingBay Fight Nights: హైదరాబాద్‌లో మెగా బాక్సింగ్ ఈవెంట్
దేశవ్యాప్తంగా ప్రొఫెషనల్ బాక్సింగ్‌కు మరింత ప్రాచుర్యం కల్పించాలనే ఉద్దేశంతో రానా దగ్గుబాటి సారథ్యంలో సౌత్‌బే కీలక ముందడుగు వేసింది. ఇండియన్ ప్రొ బాక్సింగ్ లీగ్, ఇండియన్ బాక్సింగ్ కౌన్సిల్‌తో కలిసి ‘బాక్సింగ్ బే’ ఈవెంట్‌కు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్ వేదికగా నాలుగు రోజుల పాటు ‘ఫైట్ నైట్స్’ నిర్వహించనుంది. ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించిన టాప్- 20 ప్రొఫెషనల్ బాక్సర్లు ఇందులో పాల్గొనున్నారు. ఫిబ్రవరి 29, మార్చి 7, 14, 28 తేదీల్లో బాక్సింగ్‌బే ఫైట్ నైట్స్‌కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. -
హీరో వెంకటేష్, రానాలపై కేసు నమోదుకు నాంపల్లి కోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ స్టార్ హీరోలు దగ్గుబాటి వెంకటేష్, రానాలకు నాంపల్లి కోర్టు షాకిచ్చింది. ఫిలింనగర్ డెక్కన్ కిచెన్ కూల్చివేత కేసులో దగ్గుబాటి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దగ్గుబాటి వెంకటేష్, సురేష్, రానా, అభిరామ్లపై కేసు నమోదు చేయాలని పోలీసులకు నాంపల్లి క్రిమినల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా డెక్కన్ కిచెన్ యజమాని నందకుమార్ ఇచ్చిన ఫిర్యాదుపై నాంపల్లి కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించి దగ్గుబాటి ఫ్యామిలీ డెక్కన్ కిచెన్ కూల్చివేతకు పాల్పడ్డారని నంద కుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కోట్ల రూపాయల విలువైన బిల్డింగ్‌ను ధ్వంసం చేసి, ఫర్చిచర్ ఎత్తుకెళ్లారని ఫిర్యాదులో ఆరోపించారు. లీజు విషయంలో తనకు కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అక్రమంగా కూల్చివేశారని పేర్కొన్నారు. 60 మంది ప్రైవేట్ బౌన్సర్లను పెట్టుకుని హోటల్‌ను ధ్వంసం చేశారని అన్నారు. దీనివల్ల తనకు రూ. 20 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. ఈ క్రమంలో వెంకటేష్, ఇతర కుటుంబ సభ్యులపై IPC 448, 452,380, 506,120b కింద కేసులు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. చదవండి: 24 మంది ఎమ్మెల్యేల ఎన్నికపై పిటిషన్లు.. కేటీఆర్, హరీశ్ విజయంపై కూడా
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్‌కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement