breaking news
RailOne
-
రైలు ప్రయాణికులకు అలర్ట్.. అలాంటి టికెట్ చెల్లదు!
డిజిటల్ అన్రిజర్వ్డ్ టికెట్లను ఉపయోగించే ప్రయాణికులకు ఇండియన్ రైల్వే కీలక సూచనలు జారీ చేసింది. రైల్ వన్ (Rail One) యాప్ ద్వారా బుక్ చేసిన అన్రిజర్వ్డ్ టికెట్లను.. టికెట్ తనిఖీ సమయంలో తప్పనిసరిగా అదే యాప్‌లో ఒరిజినల్ రూపంలో చూపించాలని వెల్లడించింది.టికెట్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్, ఫొటో, పీడీఎఫ్ కాపీ లేదా వాట్సాప్‌లో ఫార్వర్డ్ చేసిన కాపీలు చెల్లుబాటు కావని రైల్వే అధికారులు తెలిపారు. డిజిటల్ టికెట్ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.ఇండియన్ రైల్వే ఈ సూచనలు చేయడానికి కారణం ఇటీవల కోర్బా-విశాఖపట్నం లింక్ ఎక్స్‌ప్రెస్ రైలులో చోటు చేసుకున్న ఘటనే. కోర్బా నుంచి రాయ్‌పూర్‌కు ప్రయాణిస్తున్న ఓ మహిళ తన టికెట్‌ను వాట్సాప్‌లో వచ్చిన స్క్రీన్‌షాట్ రూపంలో టికెట్ తనిఖీ అధికారికి చూపించారు. అయితే ఆ టికెట్‌ను ఆమె సోదరుడు రైల్ వన్ యాప్ ద్వారా బుక్ చేసి, స్క్రీన్‌షాట్‌ను ఆమెకు పంపినట్లు తెలిసింది. అయితే.. విచారణలో టికెట్ రైలు బయలుదేరిన తర్వాత బుక్ చేసినట్లు, అలాగే అది ఆమె రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లో లేకపోవడంతో అధికారులు దానిని చెల్లని టికెట్‌గా ప్రకటించి నిబంధనల ప్రకారం జరిమానా విధించారు.రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. డిజిటల్ అన్రిజర్వ్డ్ టికెట్ చెల్లుబాటు కావాలంటే, దానిని బుక్ చేసిన అదే మొబైల్ ఫోన్లో, అదే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్లోని రైల్ వన్ యాప్‌లో అందుబాటులో ఉండాలి. ఇతరులకు పంపిన కాపీలు లేదా స్క్రీన్షాట్లు ప్రయాణానికి పనికిరావు.అంతే కాకుండా.. అన్రిజర్వ్డ్ డిజిటల్ టికెట్‌ను రైలు బయలుదేరే ముందే బుక్ చేయాలని రైల్వేలు స్పష్టం చేశాయి. రైలు స్టేషన్ నుంచి బయలుదేరిన తర్వాత తీసుకున్న టికెట్, యాప్‌లో కనిపించినా కూడా చెల్లదని పేర్కొన్నాయి. కాబట్టి ముందుగా టికెట్ బుక్ చేసుకోవాలి. ప్రయాణికులు టికెట్ బుక్ చేసిన మొబైల్ ఫోన్‌ను ప్రయాణ సమయంలో తమ వెంట ఉంచుకోవాలని, ఫోన్లో తగినంత ఛార్జింగ్ ఉండేలా చూసుకోవాలి. -
రైల్వే సూపర్ యాప్.. పాత యాప్ మధ్య తేడా ఏమిటి?
భారతీయ రైల్వే సాంకేతిక విప్లవంలో మరో అడుగు ముందుకేస్తూ ఇటీవల విడుదల చేసిన సూపర్ యాప్ ‘రైల్‌వన్’ ప్రస్తుతం ప్రయాణికుల్లో ఆదరణ పొందుతోంది. ఇప్పటివరకు సాధారణ రిజర్వేషన్లకు ఒక యాప్, జనరల్ (అన్రిజర్వ్డ్) టికెట్లకు మరో యాప్, ఫిర్యాదులకు వేరొక యాప్ ఉపయోగించాల్సి వచ్చేది. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెడుతూ సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (సీఆర్ఐఎస్) రూపొందించిన ఈ రైల్‌వన్ యాప్.. అసలు గతంలో ఉన్న ఐఆర్సీటీసీ యాప్ కంటే ఏ విధంగా భిన్నంగా ఉంది? రైల్వే శాఖ దీన్ని ఎందుకు ప్రత్యేకంగా తీసుకొచ్చింది? అనే పూర్తి వివరాలపై విశ్లేషణ.అసలు రైల్‌వన్ యాప్‌ను రైల్వే శాఖ ఎందుకు తీసుకొచ్చింది?గతంలో రైల్వే సేవలు వేర్వేరు డిజిటల్ విభాగాల కింద విడిపోయి ఉండేవి. ప్రయాణికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను అధిగమించడానికి మంత్రిత్వ శాఖ ఈ సూపర్ యాప్‌ను ప్రవేశపెట్టింది.రిజర్వేషన్ల కోసం IRCTC Rail Connect, జనరల్ టికెట్ల కోసం UTS, ఫిర్యాదుల కోసం Rail Madad ఇలా ఫోన్ నిండా యాప్‌లను డౌన్లోడ్ చేసుకునే అవసరం లేకుండా ప్రయాణికుడి స్మార్ట్‌ఫోన్ స్పేస్‌ను ఆదా చేయడం దీని ముఖ్య ఉద్దేశం.ప్రయాణికుడు ఒక్కసారి బయోమెట్రిక్ లేదా mPIN తో లాగిన్ అయితే చాలు అన్ని సేవలను ఒకే చోట పొందవచ్చు.రైల్వే వ్యవస్థ డిజిటల్ వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా నిమిషానికి లక్షలాది బుకింగ్స్, ఎంక్వైరీలను తట్టుకునేలా అత్యంత వేగవంతమైన, యాడ్‌ఫ్రీ ఇంటర్ఫేస్ను అందించడం కోసం దీన్ని తీసుకొచ్చారు.ఐఆర్సీటీసీ.. రైల్‌వన్ మధ్య ప్రధాన తేడాలుచాలా మంది ప్రయాణికులు ఈ రెండు యాప్‌లు ఒకటే అని భావిస్తుంటారు. కానీ వీటి పనితీరు, సేవల పరిధిలో స్పష్టమైన వ్యత్యాసాలు ఉన్నాయి.ఫీచర్ఐఆర్సీటీసీ (రైల్ కనెక్ట్)రైల్ వన్నిర్వహణఐఆర్సీటీసీ ప్రభుత్వ అనుబంధ కార్పొరేట్ సంస్థ).క్రిస్ (రైల్వే శాఖ పరిధిలోని ఐటీ విభాగం).టికెట్ల లభ్యతప్రధానంగా రిజర్వ్డ్ రైలు టికెట్లు (కన్ఫర్మ్డ్, తత్కాల్) మాత్రమే.రిజర్వ్డ్, అన్రిజర్వ్డ్, ప్లాట్‌ఫారమ్ టికెట్లు అన్నీ లభిస్తాయి.రిజర్వేషన్ ప్రక్రియఐఆర్సీటీసీ సొంత గేట్‌వే, లాగిన్ ద్వారా బుకింగ్ జరుగుతుంది.ఐఆర్సీటీసీ అథరైజ్డ్ పార్ట్నర్లుగా ఉంటూనే దాని సర్వర్‌ను అనుసంధానించి వేగంగా బుక్ చేస్తుంది.లైవ్ ట్రాకింగ్, రూట్లుకొంత పరిమితంగా ఉంటుంది లేదా వేరే థర్డ్ పార్టీ యాప్‌లపై ఆధారపడాలి.లైవ్ రన్నింగ్ స్టేటస్, కోచ్ పొజిషన్, స్టేషన్ క్యూఆర్ కోడ్స్ ఇన్-బిల్ట్‌గా ఉంటాయి.రైల్ మదద్ఈ యాప్‌లో ఫిర్యాదుల వ్యవస్థ నేరుగా సమగ్రంగా ఉండదు.యాప్‌లోనే ఇన్-బిల్ట్‌గా ఫిర్యాదులు చేయడం, వాటి స్టేటస్ ట్రాక్ చేయడం సాధ్యమవుతుంది.యూజర్ అనుభవంయాప్లో యాడ్స్ ఎక్కువగా రావడం వల్ల కొన్నిసార్లు పేజీ లోడింగ్ నెమ్మదిస్తుంది.యాప్ ఫ్రీ ఇంటర్ఫేస్, బయోమెట్రిక్ లాగిన్ చాలా వేగంగా పనిచేస్తుంది.రైల్‌వన్ యాప్‌లోని టాప్ ఫీచర్లుపేపర్లెస్ అన్రిజర్వ్డ్ టికెటింగ్: రైల్వే స్టేషన్ల్లో ఉండే RailOne QR Codeలను స్కాన్ చేయడం ద్వారా నిమిషాల్లో క్యూలో నిలబడకుండా జనరల్ టికెట్లు పొందవచ్చు. అన్రిజర్వ్డ్, నప్లాట్ఫారమ్ టికెట్లపై కొన్ని సందర్భాల్లో ప్రమోషనల్ డిస్కౌంట్లు (ఉదాహరణకు 3% వరకు) కూడా లభిస్తాయి.ఫుడ్ ఆర్డర్: ప్రయాణంలో ఉన్నప్పుడు ఐఆర్సీటీసీ వెరిఫైడ్ పార్ట్నర్ వెండర్స్ నుంచి నేరుగా మీ సీటుకే భోజనం ఆర్డర్ చేసుకోవచ్చు.ఆర్-వాలెట్: ఆధార్ అనుసంధానిత డిజిటల్ వాలెట్ ద్వారా అత్యంత సురక్షితంగా క్షణాల వ్యవధిలో పేమెంట్లు పూర్తి చేయవచ్చు.మల్టీ ల్యాంగ్వేజీ: ఇంగ్లీష్‌తో పాటు తెలుగు సహా 10కి పైగా ప్రాంతీయ భాషల్లో ఈ యాప్‌ను వాడుకునే సదుపాయం ఉంది.ఇదీ చదవండి: పాపులర్ ఉద్యోగాల వెంటే పడకండి!


