breaking news
Purify water
-
చెరువులకు బతుకునిచ్చెనమ్మా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సంస్కృతికి ప్రతీకైన బతుకమ్మ పండుగ కేవలం వేడుక మాత్రమే కాదని, దీని వెనుక అద్భుతమైన సైన్స్ ఉందని ‘జర్నల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్’ అధ్యయనం స్పష్టం చేసింది. వర్షాకాలం ముగిసిన తర్వాత చెరువుల్లో నిమజ్జనం చేసే రకరకాల పూలతో కూడిన గుత్తులు బురద, బ్యాక్టీరియాతో నిండిన నీటిని శుద్ధి చేస్తాయని, పర్యావరణం మెరుగు పడుతుందని పరిశోధకులు నిరూపించారు. తంగేడు, గునుగు, సీతజడ, రుద్రాక్ష పూలను పేర్చి బతుకమ్మను తీర్చిదిద్దుతారనే సంగతి తెలిసిందే.నీటి ద్వారా వచ్చే వ్యాధుల నివారణబతుకమ్మ పూలపై కె.సుధీర్‌కుమార్, ఎన్.రవీంద్ర, ఎస్.సీతారామస్వామిల పరిశోధన ‘ట్రెడిషనల్ అండ్ మెడిసినల్ సీక్రెట్స్ ఆఫ్ బతుకమ్మ: ది ఫ్లోరల్ ఫెస్టివల్ ఆఫ్ తెలంగాణ’ పేరిట ఆ పత్రికలో ప్రచురితమయ్యింది. బతుకమ్మ కేవలం ఒక సాంస్కృతిక లేదా ఆధ్యాత్మిక ఆచారం మాత్రమే కాకుండా, ప్రజా ఆరోగ్య పరిరక్షణకు ఉపకరించే ఒక పర్యావరణ హిత చర్య అని ఈ అధ్యయనం స్పష్టం చేసింది.వర్షాకాలం ముగిసే సమయానికి నీటి కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో నిమజ్జనం చేసే పూలు సహజ ఫైటోకెమికల్స్ను విడుదల చేసి, హానికారక బ్యాక్టీరియాను తగ్గించి, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా కాపాడుతాయని పేర్కొంది.తంగేడు: తంగేడు పూలు (కాసియా అరిక్యులేట) ఆయుర్వేదంలో ఓ ఔషధం. ఈ పూలు నీటిలోని కాలుష్యాన్ని తగ్గించి, పీహెచ్ (నీటిలోని హైడ్రోజెన్ అయాన్ల సాంద్రతను దీంతో లెక్కిస్తారు)ను సమతూకం చేస్తాయి. నీటిలో ఉండే టానిన్స్, ఫ్లవనాయిడ్స్.. టైఫాయిడ్ కారక బ్యాక్టీరియాను నిరోధిస్తాయి. ఇది రక్తశుద్ధి, మధుమేహ నివారణ వంటి అంతర్గత ఔషధ గుణాలు కలిగి ఉండటంతో పాటు, నిమజ్జన నీటిలో సహజ బయోమాస్‌గా పనిచేస్తుంది.గునుగు: గునుగు పూలు (సెలోసియా) అగ్ని ఎరుపు లేదా వెండి రంగులో ఉంటాయి. తీవ్రమైన వాపును తగ్గించే గుణం దీనికి ఉంది. విరేచనాలు, కడుపునొప్పి నివారణకు ఉపయోగిస్తారు. గుమ్మడి, వాము పూలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. బంతి, చామంతి: ఇవి సహజ క్రిమిసంహారక, సూక్ష్మజీవ నాశక గుణాలు కలిగి ఉంటాయి. యాంటీసెప్టిక్‌గా ఉపయోగ పడటంతో గాయాలు మానతాయి. చామంతి శరీరంలో వేడిని తగ్గించి చలువ చేసే గుణం కలిగి ఉంటుంది, శరీరంలో వాపును నియంత్రిస్తుంది. ఇక గుమ్మడి పువ్వులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచడానికి, శ్వాసకోశ సమస్యలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది.బతుకమ్మలను బురద గుంటల్లో వేయొద్దుతంగేడు, గునుగు, బంతి తదితర పూలు సమష్టిగా చెరువుల్లోని హానికారక సూక్ష్మ జీవుల ప్రభావాన్ని తగ్గిస్తాయనేది వాస్తవం. అయితే ఇటీవలి కాలంలో ప్లాస్టిక్ పూలు ఉపయోగించి బతుకమ్మలను పేరుస్తున్నారు. వాటినే చెరువుల్లో నిమజ్జనం చేస్తున్నారు. ఇదెంత మాత్రం మంచిది కాదు. ప్లాస్టిక్ నీటిని కలుషితం చేస్తుంది. అలాగే సహజ సిద్ధమైన పూలను కూడా నీరు తక్కువగా ఉండే బురద గుంటల్లో వేయకూడదు. దీనివల్ల పూలు కుళ్లిపోయి మేలు జరగకుండా నష్టం జరుగుతుంది. – డాక్టర్ ఎస్.వెంకట మోహన్ (సీనియర్ సైంటిస్ట్, డైరెక్టర్ సీఎస్ఐఆర్, ఎన్ఈఈఆర్ఐ) -
గంగాజలం ఎఫెక్ట్.. బీజేపీ నేతపై సస్పెన్షన్ వేటు
రాజస్థాన్‌లో వివాదాస్పద నేత జ్ఞానదేవ్ అహూజాపై ఎట్టకేలకు అక్కడి బీజేపీ విభాగం చర్యలు తీసుకుంది. క్రమశిక్షణా చర్యల ఉల్లంఘనకుగానూ షోకాజ్ నోటీసు జారీ చేయడంతో పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఆలయంలో గంగా జలంతో శుద్ధి చేయడమే ఇందుకు కారణం!!.ఆల్వాల్‌లో శ్రీరామ నవమి సందర్భంగా ఓ ఆలయంలో జరిగిన ప్రాణ ప్రతిష్టకు కాంగ్రెస్ నేత తికారాం జల్లీ హాజరయ్యారు. అయితే దళిత నేత అడుగుపెట్టి ఆలయం అపవిత్రం చేశారంటూ మాజీ ఎమ్మెల్యే జ్ఞానదేవ్ అహూజా గంగా జలంతో ఆ ఆలయాన్ని శుద్ధి చేశారు. ఈ పరిణామం దళిత సంఘాలకు ఆగ్రహావేశాలు తెప్పించింది.ఈ చర్య పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేదిగా ఉందని పేర్కొంటూ బీజేపీ ఎంపీ దామోదర్ అగర్వాల్ , అహుజాకు నోటీసులు పంపించారు. మూడు రోజుల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మదన్ రాథోడ్‌కు వివరణ ఇవ్వాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.జ్ఞానదేవ్ అహూజా.. 2013-18 మధ్య రామ్‌ఘడ్ ఎమ్మెల్యేగా పని చేశారు. వివాదాల్లో నిలవడం ఈయనకు కొత్తేం కాదు. 2016లో.. జేఎన్‌యూలో జాతీ వ్యతిరేక నినాదాల వ్యవహారంపై స్పందిస్తూ జ్ఞానదేవ్ తీవ్రవ్యాఖ్యలే చేశారు. జేఎన్‌యూలో నిత్యం 3 వేల కండోమ్స్, 2 వేల లిక్కర్ బాటిల్స్ దొరుకుతాయంటూ కామెంట్లు చేశారు. ఈ వ్యాఖ్యలపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. 2017లో గోవుల అక్రమ రవాణా చేస్తున్నాడని పెహ్లూ ఖాన్ అనే పాడి రైతును మూక దాడిలో చంపడాన్ని కూడా అహూజా సమర్థించారు. -
ప్యూరీ(హై)ఫై
సిద్దిపేట జోన్: మురికివాడలకు ఇది శుభవార్త. స్వచ్ఛమైన తాగునీటి కోసం అల్లాడుతున్న పట్టణ ప్రజల దాహార్తిని తీర్చడానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న మున్సిపాల్టీలో వాటర్ ప్లాంట్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. సేఫ్ వాటర్ పేరిట వినూత్న ప్రక్రియకు నాంది పలికింది. ఆ దిశలోనే జిల్లాలో సిద్దిపేట మున్సిపాల్టీలో ప్యూరీఫై వాటర్‌ను అందించేందుకు మున్సిపల్ అధికారులు అంకురార్పణ చేశారు. రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశాలకనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాలో తొలి విడతగా సిద్దిపేట పట్టణాన్ని స్వచ్ఛంద సంస్థ సహకారాలతో మున్సిపల్ యంత్రాంగం ఎంపిక చేసింది. ఆ దిశగా పట్టణంలోని 17 నిర్దేశిత ప్రాంతాలను గుర్తించిన మున్సిపల్ అధికారులు శనివారం బృందాలుగా పట్టణంలో వాస్తవ వివరాల సేకరణకు సమగ్ర సర్వే నిర్వహించారు. గత కొంత కాలంగా గ్రామీణ ప్రాంతాలకు ఏటీడబ్ల్యూ (ఎనీ టైమ్ వాటర్) పేరిట స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్న బాలవికాస్ సంస్థతో అనుసంధానంగా సిద్దిపేట మున్సిపల్ నీటి సరఫరా విభాగం నామమాత్ర రుసుముతో ప్యూరీఫై వాటర్ పంపిణీకి ప్రణాళిక సిద్ధం చేసింది. సిద్దిపేటలో ప్రయోగాత్మకంగా చేపడుతున్న ఈ ప్రక్రియ సత్ఫలితాలను అందిస్తే భవిష్యత్తులో జిల్లాలోని మిగతా మున్సిపాల్టీలో అమలు చేసేందుకు జిల్లా యంత్రాంగం సమాయత్తం అవుతున్నట్లు సమాచారం. వివరాలు... స్పెషల్ గ్రేడ్ మున్సిపాల్టీగా పేరొందిన సిద్దిపేటలో అధికారిక రికార్డుల ప్రకారం ప్రస్తుతం 1.50 లక్షల జనాభా ఉన్నట్లు సమాచారం. వీరందరికి గత కొంత కాలంగా కరీంనగర్ జిల్లా మానేరు డ్యాం నుంచి తాగునీటిని మున్సిపల్ యంత్రాంగం సరఫరా చేస్తుంది. మరోవైపు సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో గత కొన్ని నెలలుగా బాల వికాస్ నేతృత్వంలో వాటర్ ప్లాంట్ల నిర్వహణ కొనసాగుతుంది. సభ్యత్వ రుసుముతో నామమాత్ర ధరకే శుద్ధి చేసిన మినరల్ వాటర్‌ను అందిస్తున్న ప్రక్రియ పల్లెల్లో సత్ఫలితాలను కలిగిస్తుంది. ఈ క్రమంలో ఇదే విధానాన్ని పట్టణ ప్రాంత ప్రజలకు అందించాలన్న ఆశయంతో రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు ఇటీవల మున్సిపల్ అధికారులతో ప్రణాళికపై సుదీర్ఘం గా చర్చించారు. జల కాలుష్యంతో వివిధ రకాల వ్యాధుల బారిన పడకుండా పట్టణ ప్రజలకు శుద్ధి చేసిన నీటిని అందించాలనే లక్ష్యంతో మున్సిపల్ యంత్రాంగం భవిష్యత్ ప్రణాళికను రూపొందించింది. ఆ దిశగా పట్టణంలోని ఆయా ప్రాంతాల్లో ఉన్న 132 చేతి పంపులు, 123 పవర్ బోర్ల ద్వారా అందుతున్న తాగునీటిని సేకరించిన అధికారులు సంబంధిత పరీక్షలను నిర్వహించారు. ప్యూరీఫైకి సానుకూలంగా జల వనరులు ఉండడంతో సిద్దిపేట పట్టణంలో తొలి ప్రక్రియగా వాటర్ ప్లాంట్ నిర్మాణానికి మున్సిపల్ నీటి సరఫరా విభాగం ముందుకొచ్చింది. అందులో భాగంగానే పట్టణంలోని 34 వార్డుల పరిధిలోని ప్రజలతో పాటు ముఖ్యంగా మురికివాడల్లో నివసించే వారికి మినరల్ వాటర్‌ను అందించాలని నిర్ణయించింది. ఆ దిశగా నెహ్రూ పార్క్, బారాయిమామ్, బాలాజీ థియేటర్, భారత్‌నగర్, ఖాదర్పురా, సాజీత్పురా, హనుమాన్ నగర్, హౌజింగ్ బోర్డ్, కేసీఆర్ నగర్, ఎఫ్‌సీఐ గోదాం, వడ్డెర కాలనీ, సుభాష్‌నగర్, ఎన్సాన్పల్లి రోడ్‌తో పాటు మరో రెండు ప్రాంతాల్లో మొత్తంగా 17 పాయింట్లను మున్సిపల్ నీటి సరఫరా విభాగం గుర్తించింది. ఆయా ప్రాంతాల్లోని చేతి పంపులు, పవర్ బోర్ల స్థితిగతులను, అక్కడ ప్రభుత్వ భవనాలైన అంగన్వాడీలు, కమ్యూనిటీ హాళ్లు, ప్రభుత్వ పాఠశాలలను గుర్తించే ప్రక్రియను శనివారం చేపట్టింది. ఆ దిశగా మున్సిపాలిటీలోని ప్రత్యేక బృందాన్ని మూకుమ్మడి సర్వేకు ఆదేశించిన మున్సిపల్ అధికారులు ఆయా మురికివాడల్లో వాటర్ ప్లాంట్ల భవన నిర్మాణానికి అనుకూలమైన పరిస్థితులపై నివేదికను తయారు చేయడంలో నిమఘ్నమయ్యారు. బాలవికాస్ స్వచ్ఛంద సంస్థ అందించే నీటి శుద్ధికరణ యంత్రాల ద్వారా పట్టణంలోని ప్రజలకు స్వచ్ఛమైన మినరల్ వాటర్‌ను నామమాత్ర రుసుముతో అం దించేందుకు మున్సిపాలిటీ చర్యలు చేపడుతుం ది. ఈ ప్రక్రియకు అవసరమైన వాహన సౌకర్యం, వాటర్ క్యాన్ల సదుపాయాన్ని మంత్రి హరీష్‌రావు సమకూర్చగా, బోర్లు, విద్యుత్ బిల్లుల చెల్లింపు, భవన నిర్మాణాల ప్రక్రియను మున్సిపాలిటీ పర్యవేక్షించనుంది. మరోపక్షం రోజుల్లో తొలి విడతగా జిల్లాల్లో సిద్దిపేటలో ఈ ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించి అన్ని వర్గాల ప్రజలకు నామమాత్ర రుసుముతో తా గునీటి అందించేందుకు సమాయత్తం అవుతోంది. ప్రయోగాత్మకంగా సిద్దిపేటలో చేపడుతున్న మినరల్ వాటర్ ప్లాంట్ల నిర్మాణ ప్రక్రియ సత్ఫలితాలు కలిగితే జిల్లాలోని మిగతా మున్సిపాల్టీలో, నగర పంచాయతీల్లో అమలు చేసేం దుకు జిల్లా అధికారులు భవిష్యత్తు ప్రణాళికను రూపొందించినట్లు సమాచారం. ఏదేమైనా ఎనీటైం మనీ తరహాలో ప్రస్తుతం పల్లెల్లో ఎనీటైం వాటర్ ప్రక్రియ భవిష్యత్తులో పట్టణ వాసుల ముంగిట్లోకి రానున్నట్లు సమాచారం.


