-
కోతి... కొబ్బరి కాయ!
కోతి చేష్టలన్న మాట మీరెప్పుడైనా విన్నారా? అర్థం పర్థం లేని పనులు చేస్తూంటే వాడతారిలా! కానీ మీరోసారి థాయ్‌లాండ్, మరీ ముఖ్యంగా... దేశం దక్షిణం వైపున ఉన్న కొబ్బరి తోటలకు వెళ్లి చూడండి... మీ అభిప్రాయం తప్పకుండా మార్చుకుంటారు. ఏముంది అక్కడ అని ఆలోచిస్తూంటే కథనాన్ని పూర్తిగా చదివేయండి!! విషయం ఏమిటంటే... థాయ్‌ల్యాండ్‌లో కోతులు కొబ్బరికాయలు కోసే పని చేస్తున్నాయట కొబ్బరికాయలు తెంపడం అంత సులువైన పనేమీ కాదండోయ్. నిట్ట నిలువుగా 30-40 అడుగులున్న కొబ్బరి చెట్లు ఎక్కడం ఒక సవాలైతే.. బ్యాలెన్స్ చేసుకుంటూ కాయలు తెంపడమూ ఓ కళ... నైపుణ్యమే. అయితే ఈ నైపుణ్యం ఉన్న వారు రాను రాను తగ్గిపోతున్నారని కొబ్బరి తోటల పెంపకం దారులు తరచూ వాపోతూంటారు. కూలీలు దొరక్క ఇబ్బందులు పడటమూ మనం చూస్తూంటాం. థాయ్‌ల్యాండ్ రైతులు పరిష్కారం కనుక్కున్నట్టు కనిపిస్తోంది. ఇక్కడ కోతులకు కొబ్బరి కాయలు తెంపడంలో శిక్షణ ఇచ్చి వాటి సేవలను వాడుకుంటున్నారు మరి! కానీ విశేషం ఏమిటంటే... కోతులు ఆ పనులు చాలా చక్కగా పద్ధతిగా చేస్తూండటం. ఎంత పద్ధతిగా చేస్తున్నాయంటే.. మగ కోతులు చెట్లు ఎక్కి కాయలు తెంపుతూంటే... ఆడ కోతులు కిందపడ్డ వాటిని రైతుల వాహనాల్లోకి చేర్చడం వంటివి చేస్తున్నాయి. నాణేనికి మరోవైపు... కొబ్బరి కాయలు తెంపేందుకు కోతుల వాడకం బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నా.. నాణేనికి ఇంకో పార్శ్వమూ ఉన్నట్లు దీనిపై కొన్ని అభ్యంతరాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు, కథనాలను బట్టి చూస్తే థాయ్‌లాండ్ రైతులు ఈ కోతులను కూలీలుగా వాడుకుంటున్నా.. అందుకు తగ్గ ప్రతిఫలమూ వాటికి అందిస్తున్నారు. వాటి ఆకలిదప్పులు తీర్చడం మాత్రమే కాకుండా.. ఇంటి మనిషిగానూ చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఈ కోతుల పట్ల కొంతమంది అమానుషంగా ప్రవర్తిస్తున్నారని, పనులు చేయనప్పుడు చైన్లతో కట్టిపడేస్తున్నారన్నది జంతు ప్రేమికుల ఆరోపణ. పైగా కాయలు తెంపే కోతులను అడవిలోంచి వేటాడి పట్టుకొస్తున్నారని, చిన్న వయసులోనే అక్రమంగా పట్టుకొచ్చి శిక్షణ ఇచ్చి పని చేయించుకుంటున్నారని పెటా (పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ అనిమల్స్) వంటి సంస్థలు విమర్శిస్తున్నాయి. శిక్షణ సందర్భంగానూ కోతులపట్ల సరిగా వ్యవహరించడం లేదని చెబుతున్నారు. దాడులు చేసినా ఇబ్బంది లేకుండా ఉండేందుకు కోతుల పళ్లు తీసేస్తున్నారని తెలుస్తోంది. ఎగుమతులకు పెట్టింది పేరు... థాయ్‌లాండ్ కొబ్బరి ఎగుమతులకు పెట్టింది పేరు. స్థానికంగానూ కొబ్బరి పాలకు డిమాండ్ ఎక్కువ. పశువుల నుంచి సేకరించే పాలకు బదులుగా ఇక్కడ పచ్చి కొబ్బరి పాలను ఉపయోగిస్తూంటారు. అయితే ఇటీవలి కాలంలో కోతులతో కాయలు తెంపిస్తున్నారన్న వార్తలు ప్రబలడంతో నైతికాంశాల రీత్యా కొంతమంది కొబ్బరి పాల వాడకాన్ని తగ్గించినట్లు తెలుస్తోంది. కొన్ని బహుళజాతి కంపెనీలు కూడా కోతులను కూలీలుగా వాడుతున్న వారి ఉత్పత్తులను కొనరాదని తీర్మానించాయి. ఇదీ థాయ్‌లాండ్ కోతుల చేష్టలు! మీరేమంటారు? కోతులను మనం కూలీలుగా వాడుకోవచ్చా? లేక వాటి మానాన వాటిని వదిలేయాలా? -
ఫండే: 'వానర జలక్రీడ'! మీరు విన్నది నిజమే!!
వానరాలు(కోతులు) చెట్లపైనుంచి దూకడం, గంతులేయడం, కీచుమంటూ అరవడంలాంటివి మనం ఎన్నో చూసుంటాం. అవి చేసే తమాషా చేష్టలకి మనం ఆశ్చర్యపోతుంటాం. కానీ వానరాలు ఎప్పుడైనా ఈత కొట్టడం చూశారా! చెరువులో కాదు, బావిలో కాదు, ఏకంగా సముద్రంలో.. నమ్మలేకున్నారు కదూ..! అయితే ఈ దృశ్యం చూడండి.. వానరాలు ఈతకొడుతూ కనిపించడం చాలా అరుదు. మకాక్ జాతికి చెందిన ఈ మగ వానరం సముద్రంలో హాయిగా మునకీత కొడుతున్న అరుదైన దృశ్యం కెమెరాకు చిక్కింది. థాయ్‌లాండ్‌లోని ఫై ఫై దీవి తీరం వద్ద కనిపించిన ఈ దృశ్యాన్ని కువైట్‌కు చెందిన ఫొటోగ్రాఫర్ సులేమాన్ అలాతికి తన కెమెరాలో బంధించాడు. ఈ ఫొటో ఇటీవల ‘అండర్ వాటర్ ఫొటోగ్రఫీ–2024’ పోటీలో బహుమతి దక్కించుకుంది. ఇవి చదవండి: ఈ ఖనిజం ధరెంతో మీకు తెలుసా! -
కోతిని తప్పించబోయి ఆటో బోల్తా
వేములవాడ రూరల్: వ్యవసాయ కూలీలు ప్రయాణిస్తున్న ఆటో బోల్తాపడి ఇద్దరు మృతిచెందిన సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మరో 11 మంది గాయపడ్డారు. వేములవాడ అర్బన్ మండలం చింతల్‌ఠాణా మిడ్‌మానేరు ముంపు గ్రామం కావడంతో ఇక్కడ పనులు లేక కూలీలు ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన 13 మంది వ్యవసాయ మహిళా కూలీలు మంగళవారం ఉదయం ఆటోలో చందుర్తి మండలం మర్రిగడ్డకు వరినాట్ల పనులకు వెళ్లారు. పనులు ముగించుకుని సాయంత్రం తిరిగి వస్తుండగా వేములవాడ రూరల్ మండలం నాగాయపల్లి వద్ద ఆటోకు ఎదురుగా కోతి వచ్చింది. డ్రైవర్ కోతిని తప్పించబోగా ఆటోకింద ఇరుక్కోవడంతో బోల్తాపడింది. ఈ ఘటనలో జాతరకొండ మల్లవ్వ (51) అక్కడికక్కడే మృతిచెందగా, తీవ్రంగా గాయపడ్డ కుర్ర బాలవ్వ (65) కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. మిగతా 11 మంది కూలీలు వేములవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వేములవాడ రూరల్ ఎస్సై మారుతి కేసు నమోదుచేసి, మృతదేహాలను సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
మంకీ డ్యాన్స్ చాలెంజ్
ఎప్పటికప్పుడు కొత్త కొత్త డ్యాన్స్‌లు వస్తూ ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి. ఈ సందడి ఇంటర్నెట్కే పరిమితం కావడం లేదు. బయట రకరకాల ఫంక్షన్లలో నృత్యాభిమానులు ఈ ట్రెండింగ్ డ్యాన్స్‌లను ఫాలో అవుతున్నారు. ‘గాంగ్నమ్’ డ్యాన్స్ తరువాత రకరకాల డ్యాన్సులు వచ్చాయి. తాజాగా ‘మంకీ డ్యాన్స్ చాలెంజ్’ ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండింగ్‌గా మారింది. బాలీవుడ్ హీరోయిన్ ఫాతిమ సనా షేక్ ‘నేను సైతం’ అంటూ ఈ చాలెంజ్‌ను స్వీకరించింది. పింక్ శారీలో మెరిసిపోతూ తన బృందంతో కలిసి చేసిన మంకీ డ్యాన్స్ వీడియో వైరల్ అయింది. ‘దిస్ ఈజ్ అమేజింగ్’లాంటి కామెంట్స్‌తో కామెంట్ సెక్షన్ నిండిపోయింది. కొత్త స్టైల్లో డ్యాన్స్ ట్రై చేయాలనుకుంటున్నావారికి ఈ వీడియో బెస్ట్ ఛాయిస్. -
పులితో పెట్టుకున్న కోతి.. మరి ఏది గెలిచింది?
సోషల్ మీడియాలో వన్యప్రాణులకు సంబంధించిన వీడియోలు తెగ అలరిస్తుంటాయి. ఇలాంటి కొన్ని వీడియోలు మనకు ఒకపట్టాన నమ్మశక్యం కాదు. తాజాగా ఇటువంటి వింత వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన తర్వాత ‘ఇదేందిది’ అనకుండా ఉండలేరు. అలాగే నవ్వకుండానూ ఉండలేరు. మరి.. అంత వినోదం ఉంది ఈ వీడియోలో.. మనం కోతులకు సంబంధించిన వీడియోలను చూసేవుంటాం. అయితే ఇప్పుడు మనం చూడబోతున్న వీడియోలో ఈ కోతి చేష్టలు తారాస్థాయికి చేరాయనిపిస్తుంది. ఈ వీడియోను చూసిన చాలా మంది.. కోతులకు నిజంగా ఇంత ధైర్యం ఎక్కడినుంచి వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. ఈ వైరల్ వీడియోలో ముందుగా పులులు అడవిలో విశ్రాంతి తీసుకుంటున్న దృశ్యం కనిపిస్తుంది. అయితే అక్కడే చెట్టుపై నుంచి వేలాడున్న ఒక కోతి కిందినున్న పులిని తెగ ఆటపట్టిస్తుంటుంది. ఆ కోతి ఒకసారి పులి తోకను , మరోమారు దాని చెవిని పట్టుకుని లాగుతుంది. ఈ చేష్టలను పులి అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. అయినా ఫలితం లేకపోతుంది. ఈ కోతి చేష్టలు ఆ పులిని తెగ చికాకు పెడతాయి. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో షేర్ చేశారు. ఆ వీడియోను చూసిన యూజర్స్ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఒక యూజర్ ఆ కోతి నిజంగానే పులితో ఒక ఆట ఆడుకున్నదని, ఇకపై ఆ పులులు కోతికి దూరంగా ఉంటాయంటూ కామెంట్ చేశారు. ఇది కూడా చదవండి: ‘టీమిండియా గెలిచేవరకూ మెతుకు ముట్టం’ Gibbons like to live dangerously pic.twitter.com/kNHbYI0TDd — Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) November 16, 2023
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
స్వల్పంగా పెరిగిన పసిడి.. అదే బాటలో వెండి
అమెరికన్ల ఇంటి పేర్లు ఎలా ఉంటాయో తెలుసా..!
ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
కూతురితో కలిసి ప్రముఖ ఆలయాన్ని సందర్శించిన స్టార్ హీరోయిన్!
పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా
పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల
పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు
16 ఏళ్లకే గర్భం ఆపై భర్త మోసం.. ఇప్పుడు స్టార్ హీరోకు అత్తగా..
తప్పక చదవండి
- ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- ప్రవీణ్‌తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- గర్ల్ ఫ్రెండ్‌కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement