-
రష్యా ప్రతినిధులతో మెగాస్టార్ భేటి.. ఎందుకంటే?
ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్న మెగాస్టార్ రష్యా ప్రతినిధులతో సమావేశమయ్యారు. మాస్కో నుంచి వచ్చిన రష్యా బృందం నేరుగా హైదరాబాద్‌లోని చిరంజీవికి ఇంటికి వెళ్లి కలిశారు. తెలుగు చిత్ర పరిశ్రమకు సహకారంపై వారితో చర్చించారు. రష్యాలో తెలుగు చిత్రాల షూటింగ్‌తో సహా తదితర అంశాలపై వారితో మాట్లాడారు. రష్యాలో తెలుగు సినిమాల షూటింగ్‌ను ప్రమోట్ చేయడానికి వారు ఆసక్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. భారతీయ, తెలుగు చలనచిత్ర పరిశ్రమ, రష్యా మధ్య సృజనాత్మక సహకారాలపై ప్రతినిధి బృందం చిరంజీవితో మాట్లాడారు. ఈ సమావేశానికి సంబంధించిన ఫోటో, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. మెగాస్టార్‌ను కలిసిన వారిలో మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధి బృందంలోని సినిమా సలహాదారు జూలియా గోలుబెవా, క్రియేటివ్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ సెంటర్ హెడ్ ఎకటెరినా చెర్కెజ్ జాడే, ఫెడరల్ ఏజెన్సీ ఫర్ స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్ మాస్కో, యూనివర్సల్ యూనివర్శిటీ డైరెక్టర్ మరియా సిట్కోవ్స్కాయా ఉన్నారు. కాగా.. భోళాశంకర్ తర్వాత మెగాస్టార్ నటిస్తోన్న సోషియో-ఫాంటసీ చిత్రం విశ్వంభర. బింబిసార డైరెక్టర్ వశిష్ట ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా త్రిష కనిపించనుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం వచ్చేఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10, 2025న విడుదల కానుంది. A high level delegation of the Ministry Of Culture - Moscow has met #Chiranjeevi garu at his residence today Boss @KChiruTweets#MegastarChiranjeevi pic.twitter.com/NPLmjrUo1q — Chiranjeevi Army (@chiranjeeviarmy) April 18, 2024 -
సీఎం జగన్ ను పరామర్శించిన వైఎస్సార్సీపీ నేతలు
-
IPL 2024 SRH Vs MI: ఆరెంజ్ఆర్మీతో సన్‌రైజర్స్.. బెస్ట్ ఫొటోలు
-
కాంగ్రెస్‌లోకి దానం, పసునూరి!
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ సిట్టింగ్ ఎమ్మెల్యే, మరో సిట్టింగ్ ఎంపీ త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమయ్యింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. దానం నాగేందర్ జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో ఆయన్ను కలిశారు. అరగంట సేపు జరిగిన ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ కార్యదర్శులు మన్సూర్ అలీఖాన్, విష్ణునాథ్, రోహిత్‌చౌదరి, ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రోహిణ్‌రెడ్డి పాల్గొన్నారు. రెండు మూడురోజుల్లో మంచి ముహూర్తం చూసుకుని కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ఈ సందర్భంగా నాగేందర్ తెలిపారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దానం రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. ఇక పసునూరి దయాకర్ సచివాలయంలో ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్, పాలకుర్తి కాంగ్రెస్ నాయకురాలు ఝాన్సీరెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారు. కాగా ఇద్దరు నేతలు ఈనెల 18న కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలిసింది. దానం నాగేందర్‌ను సికింద్రాబాద్ ఎంపీగా బరిలో నిలిపే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉందని గాందీభవన్ వర్గాలంటున్నాయి. మరోవైపు పీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఎంఅర్జీ వినోద్‌రెడ్డి శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. తనకు సికింద్రాబాద్ నుంచి పోటీచేసే అవకాశం కల్పించాలని ఆయన కోరినట్లు సమాచారం. -
బీఆర్ఎస్కు బిగ్ షాక్!.. డీకే శివకుమార్‌తో మల్లారెడ్డి మంతనాలు
సాక్షి, బెంగుళూరు: మాజీ మంత్రి మల్లారెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకోవడంతో బీఆర్ఎస్ పార్టీలో కలకలం రేగుతోంది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో మల్లారెడ్డి.. ఆయన అల్లుడు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి భేటీ అయ్యారు. బెంగళూరులోని ఓ హోటల్లో డీకే శివకుమార్‌తో మంతనాలు జరిపారు. రేపు ప్రియాంక గాంధీని కలిసేందుకు మల్లారెడ్డి కుటుంబ సభ్యులు అపాయింట్మెంట్ కోరారు. ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు ఉన్నాయని మర్రి రాజశేఖర్ రెడ్డి కాలేజీకి చెందిన భవనాలను అధికారులు కూల్చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మల్లారెడ్డి కాంగ్రెస్ లో చేరతారనే ప్రచారం జరిగింది. తప్పుడు ప్రచారమంటూ తీవ్రంగా ఖండించిన మల్లారెడ్డి.. తాను కాంగ్రెస్‌లోకి వెళ్లడం లేదంటూ, బీఆర్ఎస్లోనే ఉంటానని స్పష్టం చేశారు. ఇంతలోనే హఠాత్ పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో మల్లారెడ్డి, ఆయన అల్లుడు భేటీ కావడం, మంతనాలు జరపడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ప్రియాంక గాంధీ సమక్షంలో మల్లారెడ్డి కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: పొలిటికల్ హైడ్రామా.. BRSకు షాకిచ్చిన ఆరూరి రమేష్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్‌తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement