-
స్టార్‌బక్స్ సీఈవో లక్ష్మణ్ నరసింహన్ జీతం ఎంతంటే?
సాక్షి,ముంబై: గ్లోబల్ కాఫీ చైన్ స్టార్‌బక్స్ కొత్త సీఈఓగా భారత సంతతికి చెందిన లక్ష్మణ్ నరసింహన్ ఎంపిక కావడం విశేషంగా నిలిచింది. దీనిపై ఆనంద్ మహీంద్రా లాంటి పలువురు వ్యాపార దిగ్గజాలు భారతీయ బిజినెస్ లీడర్స్ సురక్షితమైన, ప్రతిభావంతమైన వారుగా పాపులర్ అతున్నారని వ్యాఖ్యానించారు. ఇది చదవండి : Laxman Narasimhan:స్టార్‌బక్స్ సీఈవో ఇన్స్పైరింగ్ జర్నీ..ఫిదా అవ్వాల్సిందే! 2023 ఏప్రిల్ నుంచి సీఈవోగా పూర్తి బాధ్యతలను స్వీకరించనున్న లక్ష్మణ్ నరసింహన్ వార్షిక మూల వేతనంగా 1.3 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 10 కోట్లు) తీసుకుంటారని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో స్టార్‌బక్స్ పేర్కొంది. అలాగే సుమారు 12 కోట్ల రూపాయల బోనస్‌తో పాటు 9.25 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 73 కోట్లు) విలువైన ఈక్విటీ గ్రాంట్‌ను కూడా అందుకుంటారు. 2023 ఆర్థిక సంవత్సరం నుండి, 13.6 మిలియన్ డాలర్లకు (రూ. 107 కోట్లకు పైగా) సమానమైన వార్షిక ఈక్విటీ అవార్డును పొందనున్నారు. కాఫీతో మనం కనెక్ట్ అయ్యే విధానాన్ని మార్చివేసిన సాటిలేని మేటి కంపెనీ ఎదిగిన స్టార్‌బక్స్‌లో చేరడం సంతోసంగా ఉందని నరసింహన్ ప్రకటించారు. నిబద్ధతతో సేవలందిస్తూ ప్రపంచవ్యాప్తంగా మెచ్చుకునే బ్రాండ్ స్టార్‌బక్స్ అని పేర్కొన్నారు. అలాగే ప్రస్తుతం ఎదుర్కొంటున్న, మారుతున్న, డిమాండ్స్ తీర్చడానికి మరింత బలమైన భవిష్యత్తు పెట్టుబడులు పెడుతున్న కీలక సమయంలో దిగ్గజ కంపెనీ స్టార్‌బక్స్‌లో చేరడం గౌరవంగా భావిస్తానన్నారు. -
స్టార్‌బక్స్ కొత్త సీఈవో నరసింహన్ ఇన్స్పైరింగ్ జర్నీ.. ఫిదా అవ్వాల్సిందే!
ప్రపంచ కాఫీ తయారీ దిగ్గజం స్టార్‌బక్స్‌కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఎంపికైన లక్ష్మణ్ నరసింహన్ చాలా చిన్నస్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి. అమ్మే స్ఫూర్తి. రాక్-కర్ణాటక మ్యూజిక్ వరకూ అన్నీ తెలుసు. చాలా చురుకైన ప్రతిభావంతుడు. ఎపుడూ సరదాగా, జోక్లేస్తూ ఉండటం అలవాటు. చదవడం, ముఖ్యంగా బిజినెస్ బుక్స్ చదవడం అంటే చాలా ఇష్టం. చిన్నపుడు ఫుట్‌బాల్ గేమ్‌లో గోల్ కీపర్‌గా ఉండటమే కాదు, ఎదిగిన తరువాత వ్యావార రంగంలో ఉన్నత పదవులకు వన్నె తెచ్చిన రాక్‌స్టార్. ముఖ్యంగా "మనం ఎక్కడి నుండి వచ్చామో అసలు మర్చిపోవద్దు" అనే జీవిత సత్యాన్ని ఎరిగిన వారు నరసింహన్. స్టార్‌బక్స్‌కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా లక్ష్మణ్ నరసింహన్ ఎంపికతో గ్లోబల్ బ్రాండ్ బిజినెస్ లీడర్స్‌గా సత్తా చాటుతున్న భారతీయ సంతతికి చెందిన సీఈవో జాబితా పెరుగుతోంది. స్టార్‌బక్స్ సీఈవోగా లక్ష్మణ్ నరసింహన్ అక్టోబర్ 1, 2022న కంపెనీ బాధ్యతలు స్వీకరిస్తారు. స్టార్‌బక్స్ సీఈవోగా, గ్లోబల్‌లీడర్‌గా ఎదిగిన లక్ష్మణ్ నరసింహన్ 30 సంవత్సరాల అనుభవం, వివిధ హోదాల్లో పనిచేసిన ట్రాక్ రికార్డ్ ఆయన్ని మరింత ఉన్నత స్థానంలో నిలబెట్టింది. ఈ క్రమంలో లక్ష్మణ్ విద్య కరియర్, అలవాట్లు, హాబీలపై ఒక లుక్కేద్దాం. లక్ష్మణ్ నరసింహన్ ఏప్రిల్ 15, 1967న పూణేలో జన్మించారు. కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ పూణే, సావిత్రిబాయి ఫూలే పూణే విశ్వవిద్యాలయం నుండి మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీని పొందారు. తరువాత యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలోని ది లాడర్ ఇన్స్టిట్యూట్, ఇంటర్నేషనల్ స్టడీస్‌లో ఎంఏ, ది వార్టన్ స్కూల్ ఆఫ్ పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం ద్వారా ఫైనాన్స్‌లో ఎంబీఏ పట్టా పొందారు. మెకిన్సేలో ఉద్యోగిగా కరియర్‌ను ప్రారంభించారు. 2012 వరకు 19 సంవత్సరాలు అక్కడ పనిచేశారు. కంపెనీలో తన పని చేస్తున్న సమయంలో, న్యూఢిల్లీ కార్యాలయానికి డైరెక్టర్, లొకేషన్ మేనేజర్‌గా పదోన్నతి పొందారు. 2012లో నరసింహన్ పెప్సికో గ్లోబల్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్‌గా మరో మెట్టుఎక్కారు. కంపెనీ దీర్ఘకాలిక వ్యూహం, డిజిటల్ సామర్థ్యాలకు నాయకత్వం వహించి, కంపెనీని లాభాల బాటపట్టించారు. అనంతరం లాటిన్ అమెరికా, యూరప్, సబ్-సహారా ఆఫ్రికా కార్యకలాపాలకు సీఈవోగా కూడా పనిచేశారు. నరసింహన్ బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూషన్కు ట్రస్టీ కూడా, కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ సభ్యుడు, యూఏ ప్రైమ్ మినిస్టర్స్ బిల్డ్ బ్యాక్ బెటర్ కౌన్సిల్ సభ్యుడిగానూ, వెరిజోన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో సభ్యుడుగాను పనిచేశారు. సెప్టెంబరు 2019లో సీఈవోగా రెకిట్‌లో చేరారు. లైసోల్, డ్యూరెక్స్ కండోమ్‌లు, ఎన్‌ఫామిల్ బేబీ ఫార్ములా, మ్యూసినెక్స్ కోల్డ్ సిరప్లఅమ్మకాల్లో రికార్డు సృష్టించారు. కంపెనీ కీలక ఎగ్జిక్యూటివ్‌గా ప్రధాన వ్యూహాత్మక పరివర్తన, స్థిరమైన వృద్ధికితో కంపెనీని లాభాల బాటపట్టించారు. అమ్మే స్ఫూర్తి, రోజుకు పూటే భోజనం ఇటీవలి కాలంలో ఆన్లైన్ గ్లోబల్ మీటింగ్ 'ఫైర్‌సైడ్ చాట్'లో తన జీవిత విశేషాలను పంచుకున్నారు లక్ష్మణ్ నరసింహన్. పూణేలో ఒక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేసిన తల్లి తనకు ఎంతగానో స్ఫూర్తినిచ్చిందని చెప్పారు. అలాగే వార్టన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో చదువు, వీసా ఇతర ఖర్చుల కోసం ఇంట్లోని వస్తువులను అమ్మి మరీ డబ్బు కూడగట్టుకోవాల్సి వచ్చిందని తెలిపారు. అంతేకాదు జర్మనీలో సమ్మర్ స్కూల్లో విద్య నభ్యసించేటపుడు చేతిలో డబ్బుల్లేక రోజుకు ఒక పూట మాత్రమే భోజనం చేసేవాడట. అందుకే ఏకంగా 10 కిలోల బరువు తగ్గానని, ఇదే తాను జీవితంలో మరింత పట్టుదలగా ఎదడగానికి దోహదం చేసిందంటూ తన అనుభవాలను గుర్తు చేసుకుంటారు నరసింహన్. అంతేకాదు లాటిన్ అమెరికాలో ఒక కంపెనీ నడుపుతున్నప్పుడు తాను వారాంతంలో స్పానిష్ నేర్చుకున్నారట. నిరంతరం మనం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలని తన ఉద్యోగులకు సలహా ఇచ్చేవారట. ముఖ్యంగా "మనం ఎక్కడి నుండి వచ్చామో అసలు మర్చిపోవద్దు" అని కూడా సూచించారట. స్నేహితుల సంబరం నరసింహన్ క్లాస్మేట్ పారిశ్రామికవేత్త నితిన్ జోషి ప్రకారం తన స్నేహితులందర్నీ ఇప్పటికీ చాలా ప్రేయగా ఆప్యాయంగా పలకరించే బెస్ట్ ఫ్రెండ్. అన్నట్టు వీరికి కూడా పూర్వ విద్యార్థులతో ఒక వాట్సాప్ గ్రూపు కూడా ఉందట. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా 1982 లయోలా హై స్కూల్ గ్రూపులో తన ఫోటోలు, ఎపుడూ అప్డేట్లను పోస్ట్ చేస్తూ ఉంటారట. అయితే ఎప్పుడూ గ్రూప్‌లో యాక్టివ్‌గా ఉండే ఆయన సడన్‌గా ఈ మధ్య బిజీ అయిపోయారట. కట్ చేస్తే స్టార్బక్స్గా సీఈవోగా ఎంపికైన వార్త తెలిసందంటూ జోషి చాలా సంతోషం వ్యక్తం చేశారు. కష్టాలను అధిగమించి, ప్రపంచం నలు మూలలా కష్టపడి పనిచేసి ఈ రోజు గ్లోబల్‌లీడర్‌గా ఎదిగాడని ఆయన ప్రశసించారు. తండ్రి మార్గదర్శకత్వంలో లక్ష్మణ్ ఫుట్‌బాల్ ఆడేవారనీ, ముఖ్యంగా స్కూలు స్థాయిలో జట్టు గోల్ కీపర్‌గా ఉండేవారని విన్సెంట్స్ బాయ్స్ అసోసియేషన్, వ్యాపారవేత్త ముర్తుజా పూనావాలా చెప్పారు. నరసింహన్ తమ అకాడమీకే గౌరవాన్ని, గుర్తింపును తెచ్చారని.. ఇందుకు తాము గర్వపడుతున్నామని CoEP యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ సీఈఓ ముకుల్ సుతాన్ తెలిపారు. నరసింహన్ బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ సహచరుడని కూడా ఆయన గుర్తుచేశారు. -
స్టార్‌బక్స్ సీఈవోగా భారత సంతతికి చెందిన లక్ష్మణ్ నరసింహన్
న్యూఢిల్లీ: ప్రపంచ అతిపెద్ద కాఫీ చైన్ స్టార్‌బక్స్ సీఈఓగా భారత సంతతికి చెందిన లక్ష్మణ్ నరసింహన్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని స్టార్‌బక్స్ కార్ప్ గురువారం ప్రకటించింది. గ్లోబల్‌గా మరో ప్రముఖ కంపెనీకి సీఈవోగా ప్రవాస భారతీయుడు లక్ష్మణ్ నరసింహన్ ఎంపిక కావడం విశేషం. ప్రస్తుతం స్టార్‌బక్స్ సీఈఓగా ఉన్న హోవర్డ్ షుల్ట్జ్ స్థానంలో లక్ష్మణ్ నరసింహన్‌నుఎంపిక చేసింది. అయితే రానున్న అక్టోబర్‌లో కంపెనీ చేరనున్న నరసింహన్ ఏప్రిల్1న 2023లో పూర్తి బాధ్యతలను స్వీకరిస్తారని కంపెనీ ప్రకటించింది. ఇటీవల కాలంలో సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సంస్థ ‘‘రీఇన్వెన్షన్" ప్లాన్ గురించి కొన్ని నెలలు తీవ్ర కసరత్తు చేయనున్నారు. ముఖ్యంగా బారిస్టాలకు మెరుగైన వేతనాలు, ఉద్యోగుల సంక్షేమం, కస్టమర్ అనుభవాన్ని మెరుగు పర్చడం, స్టోర్లను తీర్చిదిద్దడంలాంటివి ఉన్నాయి. మేనేజ్మెంట్ టీమ్‌తో చర్చలు, బరిస్టాగా సమగ్ర పరిశీలన ఉద్యోగులను కలవడంతోపాటు, తయారీప్లాంట్లు, కాఫీ ఫామ్‌లను సందర్శిస్తారని స్టార్‌బక్స్ తెలిపింది. అప్పటి వరకూ తాత్కాలిక సీఈఓగా ఉండాలని హోవర్డ్‌ను కోరినట్టు తెలిపింది. ఇప్పటిదాకా డ్యూరెక్స్ కండోమ్‌లు, ఎన్‌ఫామిల్ బేబీ ఫార్ములా, మ్యూసినెక్స్ కోల్డ్ సిరప్‌లను తయారు చేసే రెకిట్ సంస్థకు నరసింహన్ సీఈవోగా ఉన్నారు. అయితే ఈ పదవినుంచి వైదొలగుతున్నట్టు స్టార్‌బక్స్ ప్రకటనకు ముందు రోజు ప్రకటించారు. దీంతో FTSE-లిస్టెడ్ రెకిట్ షేర్లు 4శాతం పడిపోయాయి. నరసింహన్ సెప్టెంబరు 2019లో రెకిట్‌లో చేరిన నరసింహన్ కోవిడ్‌కాలంలో కూడా కంపెనీని విజయపథంలో నడిపి మార్కెట్ వర్గాల ప్రశంసలందుకున్నారు. 1999లో రెకిట్‌ను ఏర్పాటు చేసినప్పటి నుండి దానిలో అధికారం చేపట్టిన తొలి ప్రవాస భారతీయుడు కూడా. అలాగే గతంలో పెప్సికోలో గ్లోబల్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్‌గా పనిచేసిన నరసొంహన్ అమ్మకాలు క్షీణించిన సందర్బంలో కంపెనీని పునరుద్ధరించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలోనే కాఫీ దిగ్గజం నరసింహన్‌ను తమ కీలక అధికారిగా నియమించుకుంది. ముఖ్యంగా ఈ దశాబ్దం చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా 20 వేలకు పైగా స్టార్‌బక్స్ ఔట్లెట్స్ తెరవాలన్న టార్గెట్‌ను చేరుకునేందుకు సరియైన వ్యక్తిగా నరసింహన్‌ను ఎంపిక చేసింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్‌కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement