breaking news
Khammam student
-
‘విక్రమ్–1’లో మన వినయ్!
శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) నుంచి తొలిసారి ప్రయోగించిన భారతీయ ప్రైవేట్ రాకెట్ విక్రమ్–1(ఆగమన్) ప్రయోగం ఇటీవల విజయవంతమైంది. హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ కంపెనీ ఈ రాకెట్‌ను రూపొందించగా.. ఈ బృందంలో ఖమ్మం జిల్లా యువకుడు వినయ్‌కుమార్ ఇంజనీర్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు.వ్యవసాయం కుటుంబం..జిల్లాలోని రఘునాథపాలెం మండల కేంద్రానికి చెందిన వ్యవసాయ కుటుంబంలో వినయ్‌కుమార్ జన్మించాడు. పదో తరగతి తర్వాత పాలిటెక్నిక్ మూడేళ్లు, ఆతర్వాత లేటరల్ ఎంట్రీగా ఇంజనీరింగ్ మూడేళ్లు పూర్తిచేశాడు. ఖమ్మం రూరల్ మండలం పొన్నేకల్‌లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజీలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తిచేసిన ఆయన ఆతర్వాత ప్రయోగాలపై ఆసక్తి పెంచుకున్నాడు. ఈక్రమాన స్కైరూట్ ఏరోస్పేస్ కంపెనీలో చేరాడు.ఇందులో భాగంగానే విక్రమ్–1 ప్రయోగంలో పాలుపంచుకోగా విజయవంతం కావడంపై పలువురు అభినందిస్తున్నారు. కాగా, శ్రీచైతన్య కాలేజీ చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్ మాట్లాడుతూ తమ కాలేజీ పూర్వ విద్యార్థి వినయ్‌కుమార్ తొలి ప్రైవేట్ రాకెట్ తయారీ, ప్రయోగంలో పాలుపంచుకోవడం గర్వకారణమని తెలిపారు. ఆయనను శ్రీధర్‌తో పాటు డైరెక్టర్ మల్లెంపాటి శ్రీవిద్య, ప్రిన్సిపాల్ ఎస్.లక్ష్మీనారాయణ, ఎగ్జిక్యూటివ్ డీన్ డాక్టర్ వి.సుదర్శన్, వివి విభాగాల అధిపతులు వైశాలి, డాక్టర్ చార్యులు, కుమార్ తదితరులు అభినందించారు. -
జాతీయస్థాయి బాస్కెట్‌బాల్‌కు ఖమ్మం విద్యార్థిని
రఘునాధపాలెం, న్యూస్‌లైన్: జాతీయస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు రఘునాధపాలెంలోని వీవీసీ పాఠశాల విద్యార్థిని బుడిగం లిఖిత ఎంపికైంది. ఇటీవల వరంగల్ జిల్లా కేసముద్రంలో జరిగిన రాష్ట్రస్థాయి అండర్-17 పోటీలలో ప్రతిభ ప్రదర్శించి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైంది. లిఖితను పాఠశాల కరస్పాండెంట్ రేఖల భాస్కర్, ప్రిన్సిపాల్ విద్యుల్లత, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, పీడీలు డి.శ్రీనివాస్, జ్శైవాసరావు తదితరులు అభినందించారు.


