breaking news
kerala former chief minister
-
మాజీ సీఎం విజయన్‌కు సమన్లు
తిరువనంతపురం: కొచ్చి మినరల్, రుటైల్ లిమిటెడ్ కంపెనీ(సీఎంఆర్ఎల్)కి సంబంధించిన ముడుపుల కేసులో కేరళం మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత విపక్ష నేత పినరయి విజయన్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శనివారం సమన్లు జారీచేసింది. రాష్ట్ర పోలీసులు నమోదుచేసిన ఒక ఎఫ్ఐఆర్ ఆధారంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం శుక్రవారం విజయన్‌కు ఈడీ సమన్లు జారీచేసింది. సంబంధిత సమన్ల కాపీని తిరువనంతపురంలోని బేకరీ జంక్షన్‌లోని విజయన్ ఇంటి గోడకు శనివారం అధికారులు అతికించారు. 23వ తేదీన తమ ముందు హాజరుకావాలని అందులో సూచించారు. విషయం తెల్సి సీనియర్ సీపీఎం నేత వి.శివన్కుట్టి వెంటనే ఆ ఇంటికికొచ్చి ఈడీ అధికారుల తీరును తప్పుబట్టారు. ‘‘పారిపోయిన వ్యక్తుల విషయంలోనే ఇలా సమన్ల కాపీని గోడకు అంటిస్తారు. విజయన్ ఏమీ కన్పించకుండాపోయిన వ్యక్తి కాదు. కానూర్‌లో పార్టీ సమావేశంలో ఉన్నారు. ఆయన లేని సమయంలో ఇంటికొచ్చి సమన్లు అతికించడంలో ఉద్దేశమేంటి? సీఎంగా సేవలందించిన నేత విషయంలో ఇలాంటి వైఖరి మంచిది కాదు’’ అని ఆయన అసహనం వ్యక్తంచేశారు. సీఎంఆర్ఎల్ ఉదంతంలో విజయన్, కుమార్తె టి.వీణ, అల్లుడు, మాజీ మంత్రి పీఏ మొహమ్మద్ రియాస్‌లపై అక్టోబర్ 12న కేరళం విజిలెన్స్, ఏసీబీ రెండు ఎఫ్ఐఆర్లు నమోదుచేయడం తెల్సిందే. -
93 ఏళ్ల వయసులో చకచకా అసెంబ్లీకి
సాధారణంగా 70 ఏళ్ల వయసు వచ్చిందంటేనే కృష్ణా రామా అంటూ ఇంట్లో కూర్చుంటారు. అదే 90 ఏళ్లు దాటితే.. ఇక వాళ్లను ఇంట్లోవాళ్లు గాజుబొమ్మల కంటే జాగ్రత్తగా చూసుకుంటారు. కానీ, కేరళలోని సీపీఎం కురువృద్ధుడు వీఎస్ అచ్యుతానందన్ మాత్రం 93 ఏళ్ల వయసులో కూడా చకచకా అసెంబ్లీకి వెళ్తున్నారు. అవును.. అచ్యుతానందన్‌కు 93 ఏళ్లు వచ్చాయి. పుట్టినరోజు నాడు కూడా ఆయన అసెంబ్లీకి యథావిధిగా వచ్చేశారు. తన ట్రేడ్ మార్కు తెల్ల చొక్కా, పంచె ధరించి ఆయన రాగానే పలవురు యువ ఎమ్మెల్యేలు పరుగున వెళ్లి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీ స్పీకర్ పి. శ్రీరామకృష్ణన్ సభ తరఫున ఆయనకు అభినందనల చెప్పారు. ''సభలోనే అత్యంత సీనియర్ సభ్యుడైన అచ్చుతానందన్ 93వ పుట్టినరోజు సందర్భంగా ఈ సభ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతోంది'' అని ఆయన ప్రకటించగానే.. ప్రతిపక్ష, విపక్ష సభ్యులంతా చప్పట్లతో అసెంబ్లీని హోరెత్తించారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీడబ్ల్యుసీ సీనియర్ సభ్యుడు ఏకే ఆంటోనీ తదితరులు ఫోన్ చేసి అచ్యుతానందన్‌ను అభినందించారు. పాలనా సంస్కరణల కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న వీఎస్.. రాష్ట్రంలో ఐటీ రంగ ఉద్యోగుల సమస్యలను ప్రస్తావించారు. రాష్ట్రంలోని ఐటీ ఉద్యోగులను దోచుకుంటున్నారని ఆయన అన్నారు. వెలిక్కత్ శంకరన్ అచ్యుతానందన్ 1923 అక్టోబర్ 20వ తేదీన అళప్పుళ జిల్లాలోని ఉన్నప్ర గ్రామంలో ఓ కార్మిక కుటుంబంలో పుట్టారు. 1964లో సీపీఐ నుంచి సీపీఎం విడిపోయినప్పటికే ఆయన పార్టీ సభ్యుడు. 2006-11 సంవత్సరాల మధ్య ఆయన కేరళ సీఎంగా వ్యవహరించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన ప్రతిపక్ష నేత. ఈసారి మళ్లీ వామపక్షం గెలిచినప్పుడు కూడా ఆయనను సీఎం చేస్తారని అనుకున్నా, ఆయన వయసు.. శారీరక పరిమితుల దృష్ట్యా ఆయన్ను కాదని పినరయి విజయన్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు.


