breaking news
jubed
-
ఆస్పత్రిలో అలీ భార్య! వెక్కివెక్కి ఏడ్చిన కమెడియన్
ప్రముఖ నటుడు అలీ సతీమణి జుబేదా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. గుండె సంబంధిత సమస్యలతో ఆస్పత్రిలో చేరిన ఆమెకు వైద్యులు శస్త్రచికిత్స చేశారు. అయితే ఆస్పత్రిలో ఉన్న భార్యను చూసి అలీ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన అభిమానులు భావోద్వేగానికి గురవుతున్నారు.తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు అలీ. బాలనటుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన.. ఆ తర్వాత హీరోగా, హాస్యనటుడిగా వందలాది సినిమాల్లో నటించారు. నటుడిగానే కాకుండా బుల్లితెరపై వ్యాఖ్యాతగానూ తనదైన ముద్ర వేశారుసతీమణి జుబేదా సుపరిచితమేఅయితే అలీ సతీమణి జుబేదా కూడా ప్రేక్షకులకు సుపరిచితమే. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఆమె.. తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా వంటల వీడియోలతో పాటు కుటుంబానికి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంటారు. ఈ క్రమంలోనే తాజాగా తన ఆరోగ్య పరిస్థితి గురించి ఆమె వెల్లడించారు. గుండె సంబంధిత సమస్యల కారణంగా శస్త్రచికిత్స చేయించుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు తన యూట్యుబ్ ఛానెల్లో ప్రత్యేక వీడియో పంచుకుంది. ఈ దృశ్యాలు చూసిన అభిమానులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కాగా, అలీ, జుబేదా దంపతులకు 1994 జనవరి 23న వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఫాతిమా రమీజున్, జువేరియా మీథీతో పాటు ఒక కుమారుడు మహమ్మద్ అబ్దుల్ సుభాన్ ఉన్నారు.(ఇదీ చదవండి: విడాకుల రూమర్స్.. విరోష్ జంటకు అండగా ఫ్యాన్స్..) -
సెల్ఫీ సరదా.. ఇద్దరు విద్యార్థులు మృతి
సెల్ఫీ సరదా రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడలో ఈ ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన 12 మంది విద్యార్థుల బృందం సోమవారం ఉదయం మానసాహిల్స్ సమీపంలోనినీటి గుంతల వద్దకు చేరుకుంది. అందులో ముగ్గురు ఈత కొట్టేందుకు గుంతలోకి దిగారు. సెల్‌ఫోనులో సెల్ఫీ తీసుకునేందుకు యత్నించారు. ఈ ప్రయత్నంలో ముగ్గురూ నీట మునిగారు. దీంతో తోటివారు ఒకరిని రక్షించగలిగారు. జుబేద్, షోయబ్ అనే ఇద్దరు మాత్రం మునిగిపోయారు. స్థానికుల సాయంతో వారి మృతదేహాలను వెలికితీశారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని 8 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు మాత్రం భయంతో పరారయ్యారని చెబుతున్నారు.


