breaking news
Isaiah Lineberry
-
ఆ అమ్మాయికి.. ఈ అబ్బాయి దొరికితే ఒ(ప)ట్టు
-
ఆ అమ్మాయికి.. ఈ అబ్బాయి దొరికితే ఒ(ప)ట్టు
వాషింగ్టన్: అమెరికాలోని ఒహియోలో ఇద్దరు చిన్నారుల మధ్య జరిగిన రెజ్లంగ్ మ్యాచ్ వీడియో వైరల్ అయ్యింది. ఈ వీడియో తమాషాగా, సరదాగా, ఆసక్తికరంగా ఉంది. ఐజయ్య లినెబెర్రీ అనే నాలుగేళ్ల బాలుడు, ఐదేళ్ల అమ్మాయి మధ్య కుస్తీ పోటీ నిర్వహించారు. లినెబెర్రీ రెజ్లింగ్ టోర్నమెంట్లో పాల్గొనడం ఇదే తొలిసారి కాగా.. ఈ మ్యాచ్ రెండోది. ఇద్దరి మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. అక్కడున్నవారు ఆసక్తిగా చూస్తున్నారు. ఆ అమ్మాయి పోరాటానికి సిద్ధం కాగా.. లినెబెర్రీ మాత్రం ఫైటింగ్ చేయకుండా పరిగెత్తాడు. ఆ అమ్మాయి వెంటపడగా.. మ్యాచ్లో చాలాసేపు దొరకకుండా సర్కిల్లో పరుగులు తీశాడు. రెండో రౌండ్లో ఆ అమ్మాయి లినెబెర్రీని ఓ పట్టు పట్టింది. ఇంతలోనే అతను తప్పించుకుని మళ్లీ పరుగులు పెట్టాడు. మ్యాచ్ అనంతరం ఎందుకు పరిగెత్తావు అని ఐజయ్యను తల్లి ప్రశ్నించగా.. 'నాకు తెలియదు మమ్మీ, తమాషాగా ఉంది' అని సమాధానం చెప్పాడు. గతేడాది డిసెంబర్ లో ఈ టోర్నమెంట్ జరగగా, ఈ వీడియోను ఇటీవల ఆన్లైన్లో పోస్ట్ చేశారు.


