-
మన్‌ప్రీత్ సింగ్‌కూ ‘ఖేల్ రత్న’
ఈ ఏడాది జాతీయ క్రీడా పురస్కారాల్లో ‘ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న’ అందుకోనున్న ఆటగాళ్ల సంఖ్య 12కు చేరింది. ఇటీవల 11 మందికి ‘ఖేల్ రత్న’ ప్రకటించగా... తాజాగా ఈ జాబితాలో భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ పేరును కూడా చేర్చారు. ఈ ఏడాది 35 మందికి ‘అర్జున’... పది మందికి ‘ద్రోణాచార్య’ అవార్డు... ఐదుగురికి ‘ధ్యాన్‌చంద్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్’ అవార్డు ఇవ్వనున్నారు. ఈనెల 13న రాష్ట్రపతి భవన్లో 2021 జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం జరుగుతుంది. -
మన్‌ప్రీత్ పెళ్లిపై వివాదం
కొటాబహరు (మలేసియా): భారత హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ పెళ్లికి సంబంధించి అనూహ్య వివాదం తెరపైకి వచ్చింది. తన చిరకాల స్నేహితురాలు, మలేసియా దేశానికి చెందిన ఇలి నజ్వా సిద్దీఖీని గత బుధవారం జలంధర్‌లో మన్‌ప్రీత్ పెళ్లి చేసుకున్నాడు. పంజాబీ సంప్రదాయ పద్ధతిలో ఈ వివాహం జరిగింది. అయితే దీనిపైనే మలేసియా దేశంలో తీవ్ర చర్చ జరుగుతోంది. ముస్లిం మహిళ అయిన నజ్వా ఇలా పెళ్లి చేసుకోవడం ఏమిటని, ఆమె మతం మార్చుకుందా అంటూ ప్రశ్నలు వచ్చాయి. చివరకు ఇందులో మలేసియా ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. కరోనా కారణంగా విమాన రాకపోకల్లో ఆంక్షలు ఉన్న నేపథ్యంలో పెళ్లి కోసమంటూ నజ్వా ప్రత్యేక అనుమతి తీసుకొని భారత్‌కు వచ్చినట్లు సమాచారం. అయితే మలేసియా ఉప ప్రధాని (మత వ్యవహారాలు) అహ్మద్ మర్జుక్ మాత్రం తమకు ఈ విషయంలో ఎలాంటి సమాచారం లేదని...నజ్వా స్వదేశానికి తిరిగొచ్చి అన్ని అంశాలపై స్పష్టతనివ్వాల్సి ఉందని చెప్పారు. ‘ఇలి నజ్వా సొంత రాష్ట్రం జొహర్ ప్రభుత్వ అధికారుల నుంచి మరిన్ని వివరాలు కోరాం. ప్రస్తుతానికి మా వద్ద ఉన్న సమాచారం ప్రకారం ఆమె ముస్లిం. ఇంకా మతం మారలేదు. విదేశంలో పెళ్లి చేసుకుంటున్నట్లు కూడా ఆమె ప్రభుత్వానికి ఎలాంటి దరఖాస్తు పంపించలేదు. ఆమె ముస్లింగానే ఉంటూ పంజాబీ తరహా పెళ్లి చేసుకుంటే మాత్రం తప్పు చేసినట్లుగానే భావిస్తాం’ అని మర్జుక్ అన్నారు. తాజా వివాదంపై అధికారికంగా నజ్వా కానీ మన్‌ప్రీత్ సింగ్ కానీ ఇంకా స్పందించలేదు. -
‘ఫేస్బుక్’ కలిపింది ఇద్దరిని..!
ఫేస్బుక్... సప్త సముద్రాల ఆవల ఉన్న వారినీ ఏకం చేస్తున్న సామాజిక నెట్వర్క్. దీనిద్వారా అనేకమంది చాటింగ్ మొదలుపెట్టి పెళ్లి దాకా వెళ్లారు. ఈ జాబితాలోనే చేరాడు భారత హాకీ జట్టు కెప్టెన్ సర్దార్ సింగ్. ఇంగ్లండ్ హాకీ జట్టు యువ క్రీడాకారిణి అశ్‌పాల్ కౌర్ భోగల్తో రెండేళ్ల క్రితం ఫేస్బుక్ చాటింగ్ ద్వారా మొదలైన పరిచయం ప్రేమగా మారింది. వచ్చే ఏడాది వీరు వివాహం చేసుకోబోతున్నారు. భారత హాకీ కెప్టెన్ సర్దార్ సింగ్ ప్రేమాయణం న్యూఢిల్లీ: ప్రముఖ క్రీడాకారుల ప్రేమాయణాల ప్రస్తావన వస్తే ముందుగా క్రికెటర్లు, ఫుట్‌బాలర్లు, టెన్నిస్ స్టార్స్ వస్తారు. అయితే ఓ హాకీ క్రీడాకారుడు కూడా ఈ జాబితాలో చేరాడు. అతనెవరో కాదు... మైదానంలో మెరుపు కదలికలతో సహచరులకు పాస్‌లు ఇస్తూ, గోల్స్ చేసేందుకు అవకాశాలు సృష్టించడంలో దిట్ట అయిన భారత హాకీ కెప్టెన్, స్టార్ మిడ్‌ఫీల్డర్ సర్దార్ సింగ్. రెండేళ్ల క్రితం లండన్ ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు వెళ్లిన భారత హాకీ జట్టు ఎలాంటి పతకం లేకుండా రిక్తహస్తాలతో తిరిగి వచ్చినా... కెప్టెన్ సర్దార్ సింగ్‌కు మాత్రం జోడి దొరికింది. ‘ఒకరోజు నా ఫేస్బుక్ అకౌంట్ ఇన్‌బాక్స్‌లో వచ్చిన సందేశాన్ని చూసుకున్నాను. అశ్‌పాల్ కౌర్ అనే అమ్మాయి నుంచి ఈ సందేశం వచ్చింది. తొలుత తేలిగ్గా తీసుకున్నాను. ఆ తర్వాత వరుసగా నా గురించి ఎన్నో విషయాలు రాయడంతో ఆసక్తి పెరిగింది. ఎవరీ అమ్మాయి. ఒకసారి కలిస్తే బావుంటుంది అనుకున్నాను. లండన్ ఒలింపిక్స్ (2012)లో మా మ్యాచ్‌ను తిలకించేందుకు రావాలని ఆహ్వానించాను. కానీ ఆమె రాలేదు’ అని ప్రేమ చిగురించిన క్షణాలను సర్దార్ సింగ్ గుర్తు చేసుకున్నాడు. ‘లండన్ ఒలింపిక్స్ తర్వాత స్వదేశానికి వచ్చాను. కానీ మా మధ్య ఎస్ఎంఎస్లు, ఈ-మెయిల్స్, ఫోన్స్ కాల్స్‌తో మాటల పరంపర కొనసాగింది. అయినా ఈ మాటలు మా మధ్య ఉన్న దూరాన్ని తగ్గించలేకపోయాయి. మూడు నెలల గడిచాయి. సస్పెన్స్‌కు తెరదించాలనుకున్నాను. లండన్ వెళ్లి అశ్పాల్ను, ఆమె తల్లిదండ్రులను కలవాలని నిర్ణయించుకున్నాను. వారితో కలిశాక నా ఆనందం రెట్టింపైంది. ఈ సంబంధం గురించి నా తల్లిదండ్రులవద్ద ప్రస్తావించాను. నేను ఎలా ఫీలవుతున్నానో చెప్పాను. కానీ వారు మాత్రం ఆ అమ్మాయి ‘నామ్ధారి’ వర్గీయురాలేనా అని ప్రశ్నించడంతో నేను కొంచెం కంగారు పడ్డాను. కానీ అంతా మంచే జరిగింది. నామ్ధారి వర్గం పెద్ద.. ఠాకూర్ ఉదయ్ సింగ్ నుంచి ఆమోదం లభించాక ఇంట్లో వారూ ఈ సంబంధానికి సరే అన్నారు’ అని ప్రస్తుతం హర్యానా పోలీసు డిపార్ట్మెంట్లో డిప్యూటీ సూపరిటెండెంట్‌గా పనిచేస్తోన్న 28 ఏళ్ల సర్దార్ సింగ్ వివరించాడు. ‘ఈ ఏడాది మే 22న నెదర్లాండ్స్‌లో ప్రపంచ కప్ సమయంలో అశ్పాల్కు పెళ్లి ప్రతిపాదన చేశాను. ఆమె అంగీకరించింది. ఇప్పటికైతే నిశ్చితార్థం జరిగింది. ఇంట్లో వాళ్లు తొందరగా పెళ్లి చేసుకోవాలని కోరుతున్నారు. కానీ 2016 రియో ఒలింపిక్స్ వరకు ఆగితే బావుంటుందని నా అభిప్రాయం తెలిపాను. ఈ ఏడాది మా ఇద్దరికీ బిజీ షెడ్యూల్ ఉంది. నేను ఆసియా క్రీడల్లో, చాంపియన్స్ ట్రోఫీలో ఆడాలి. అశ్‌పాల్ ఇంగ్లండ్ జాతీయ జట్టుకు సేవలు అందించాల్సి ఉంది. అంతా అనుకూలిస్తే వచ్చే ఏడాది పెళ్లి జరిగే అవకాశముంది’ అని సర్దార్ సింగ్ తెలిపాడు. వచ్చే నెలలో 20 ఏళ్లు పూర్తి చేసుకోనున్న అశ్‌పాల్ తమ పరిచయాన్ని ‘లవ్ ఎట్ ఫస్ట్‌సైట్’ అని చెబుతోంది. ఆరేళ్ల వయస్సులోనే హాకీ స్టిక్ పట్టుకున్న అశ్‌పాల్ ఇంగ్లండ్ అండర్-19 జట్టులో ఎంపికై ఈ ఘనత సాధించిన తొలి ఆసియా సంతతి క్రీడాకారిణిగా నిలిచింది.
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్‌కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
IPL 2024: సన్‌రైజర్స్, లక్నో మ్యాచ్.. లంక యువ స్పిన్నర్ అరంగేట్రం
ఒక్క క్లిక్‌తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
IPL 2024 SRH VS LSG: మరో మూడేస్తే..!
ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
తప్పక చదవండి
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్‌తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్‌కి టెండర్ వేసిన 'దేవర'?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement