breaking news
Inca
-
సముద్ర గర్భంలో సాహసతార
స్కూటీ డ్రైవింగ్‌కు, స్కూబా డైవింగ్‌కు తేడా తెలియని చిన్న గ్రామంలో పుట్టి పెరిగింది అతుల్య. స్కూబా డైవింగ్ గురించి తెలుసుకోవడానికి ఆమెకు చాలాకాలమే పట్టింది. అయితే... భవిష్యత్ కాలాలు కూడా గుర్తు పెట్టుకునే విజయాలను స్కూబా డైవింగ్‌లో సాధించింది. స్కూబా డైవింగ్ శిక్షణ పూర్తి చేసిన కేరళకు చెందిన మొదటి మహిళగా, కమర్షియల్ స్కూబా డైవింగ్‌లో ఐఎన్సీఏ సర్టిఫికేషన్ పొందిన మొదటి భాతీయురాలిగా రికార్డ్ సృష్టించింది...సముద్రం ఇప్పటికీ ఒక అంతచిక్కని రహస్యమే. పాలక్కాడ్‌కు చెందిన 29 ఏళ్ల అతుల్య బెల్గాడ్కు ఆ రహస్య ప్రపంచంలోకి తొంగిచూడాలనే ఆసక్తి ఒక శక్తిగా మారింది. ఆ శక్తితోనే మహిళలకు తక్కువ ప్రాతినిధ్యం ఉన్న స్కూబాడైవింగ్‌లో తనదైన గుర్తింపు తెచ్చుకునేలా చేసింది. నీటి అడుగున చేసే కమర్షియల్ డైవింగ్ అనేది పైప్లైన్లు, ఇంటర్నెట్ కేబుళ్ల నిర్వహణ, వెల్డింగ్...మొదలైన వాటికి సంబంధించిన సాంకేతిక వృత్తి. దీనికి శారీరక బలం, సముద్రంపై అవగాహన, క్రమశిక్షణ అవసరం.మహిళలు ఒక్కరూ లేరు!త్రిస్సూర్‌లోని సెయింట్ మేరీస్ కాలేజీలో బీఏ చదువుతున్న రోజుల్లో స్కూబాడైవింగ్ గురించి తొలిసారిగా విన్నది అతుల్య. స్కూబాడైవింగ్‌లో మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉందనే విషయం కూడా తెలుసుకుంది. ఆ సమయంలోనే ‘నేను ఎందుకు ప్రయత్నించ కూడదు!’ అని ఆలోచించి స్కూబాడైవింగ్పై ఆసక్తి పెంచుకుంది.‘నీటి అడుగున ఉన్న ప్రపంచాన్ని అన్వేషించాలనే ఆలోచన నన్ను ఎంతగానో ఆకర్షించింది. సముద్రగర్భంలో ఏముందో చూడాలనే ఆసక్తి అంతకంతకూ పెరుగుతూ పోయింది’ అంటున్న అతుల్యకు ఈత కొట్టడంలో మంచి ప్రావీణ్యం ఉంది. స్కూబా డైవింగ్‌ను కెరీర్‌గా ఎంచుకోవడానికి సంబంధించి తల్లిదండ్రులను ఒప్పించింది. వారు ఓకే అనడంతో మరింత ధైర్యం వచ్చింది. స్కూబా డైవింగ్ కోసం కోవలం వెళ్లింది. మహిళలు ఒక్కరూ కనిపించలేదు! ఏవేవో భయాలే ఉండేవి. అయితే శిక్షణ సజావుగా సాగింది. ఆ తరువాత కమర్షియల్ స్కూబాడైవింగ్‌లో శిక్షణ కోసం దక్షిణాఫ్రికాకు వెళ్లింది. అక్కడే కమర్షియల్ స్కూబాడైవింగ్‌లో సర్టిఫికేషన్ పొందింది. కేరళకు తిరిగి వచ్చిన తరువాత మూడు సంవత్సరాల పాటు కోస్టల్ పోలీసులకు ట్రైనర్‌గా పనిచేసింది.ఆ తరువాత అండమాన్‌లో సంవత్సరం పాటు పనిచేసింది. ఆ సమయంలో అతుల్య పనితీరును గమనించిన దక్షిణాఫ్రికాలోని ఒక డైవింగ్ కంపెనీ ఆమెను సంప్రదించింది. అలా ఆమె దక్షిణాఫ్రికా ప్రయాణం మొదలైంది.ఆహ్లాదమే కాదు... ప్రమాదం కూడా!సముద్రగర్భ ప్రయాణాలు ఎంత ఆహ్లాదకరమైనవో అంతే ప్రమాదకరమైనవి కూడా. ‘ప్రమాదాలకు దూరంగా ఉండడానికి ప్రతి డైవ్‌కు ముందు ఆ వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేస్తాను’ అంటున్న అతుల్య ‘నీటి అడుగున దేనినీ తాకరాదు’ అనే నియమాన్ని కచ్చితంగా పాటిస్తుంది. స్టోన్‌ఫిష్ అచ్చం రాయిలాగే కనిపిస్తుంది. మనం దానిని తాకితే, దాని విషపూరితమైన ముళ్లతో తీవ్రమైన గాయమై ఇన్ఫెక్షన్ వస్తుంది. దాని కాటుకు సరిౖయెన చికిత్స చేయకపోతే పరిస్థితి ప్రమాదకరంగా మారుతుంది. ‘సముద్రపు అడుగున ఉన్న ఏదీ మనకు చెందినది కాదు. మనలాగే అక్కడ నివసించే జీవులకు కూడా వాటి సొంత జీవితాలు ఉంటాయి. మనం వాటికి ఆటంకం కలిగించకూడదు. వాటి స్థలాన్ని మనం గౌరవించాలి’ అంటుంది అతుల్య.తన సాహసాలను సముద్రం దగ్గరే ఆపాలనుకోవడం లేదు అతుల్య. ‘జీవితంలో మరిన్ని సాహసాలు చేయాలనుకుంటున్నాను. దీనికోసం కొన్ని లక్ష్యాలను ఏర్పాటు చేసుకున్నాను. కేరళలో ఒక స్కూబా డైవింగ్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఉంది’ అంటుంది అతుల్య. అది నిజం కాదు!‘సాధారణంగా మేము సుమారు 50 మీటర్ల లోతు వరకు డ్రైవ్ చేస్తాము. నీటి అడుగున స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను తీసుకువెళ్తామని చాలామంది అనుకుంటారు. కాని అది నిజం కాదు’ అంటుంది అతుల్య. వారు ఉపయోగించే గాలిలో 21 శాతం ఆక్సిజన్, 79 శాతం నైట్రోజన్ ఉంటాయి. నిర్దిష్ట లోతుకు మించి స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను ఉపయోగిస్తే అది విషపూరితంగా, ప్రమాదకరంగా మారుతుంది. లోతైన డైవ్‌ల కోసం హీలియం మిశ్రమాలను ఉపయోగిస్తారు. కొన్ని డైవ్‌ల తరువాత గొంతు మారే అవకాశం ఉంటుంది.చరిత్ర గర్భంలోకి!కోజికోడ్ సమీపంలో కుంజలి మారక్కర్ చరిత్రతో సంబంధం ఉందని నమ్మే ప్రాంతంలో డైవ్ చేస్తున్నప్పుడు రాళ్లతో మూసివేయబడిన అనేక పురాతన కట్టడాలను అతుల్య చూసింది. తిరువనంతపురంలో డైవ్ చేస్తున్నప్పుడు గుహల ప్రవేశద్వారాల్లా కనిపించే ఒక కట్టడాన్ని చూసింది. ‘సముద్ర గర్భం ఒక రహస్య భాండాగారం లాంటిది. ఈ ప్రదేశాలను మనం లోతుగా అధ్యయనం చేస్తే తెలియని విషయాలెన్నో కనుగొనవచ్చు’ అంటుంది అతుల్య.మరో ప్రపంచంలోకి...ఆసక్తి, ధైర్యం, శారీరక బలం ఉంటే ఎవరైనా కమర్షియల్ స్కూబా డైవింగ్ చేయవచ్చు. నీటి అడుగులోకి వెళ్లినప్పుడు అత్యంత సుందర దృశ్యాలు కనిపిస్తాయి. బయట మనం ఎప్పుడూ, ఎక్కడా చూడని రంగులు, అద్భుతాలు కనువిందు చేస్తాయి. చేపలు గుంపులుగా కలిసి తిరగడం, ఆక్టోపస్ రంగు మార్చుకోవడం చూడటం వంటివి అద్భుతమైన అనుభవాలు. నీటి అడుగున ఉన్న ప్రతిదానికి ఒక ప్రత్యేకమైన అందం ఉంది. దీనితోపాటు ప్రమాదాలు కూడా ఉంటాయి. బలమైన ప్రవాహాలు, సుడిగుండాలు, నీటి అడుగున విద్యుత్‌తీగలు, స్టోన్‌ఫిష్, స్ట్రింగే, లయన్‌ఫిష్ వంటి ప్రమాదకరమైన సముద్ర జీవులు, వీటితో పాటు కఠినమైన వాతావరణ పరిస్థితులు స్కూబా డైవింగ్‌ను సవాలు చేస్తాయి. లోతుకు వెళ్లే కొద్దీ చుట్టూ చీకటి ఆవహిస్తుంది. దారి తెలుసుకోవడానికి టార్చ్‌లైట్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. పదునైన రాయిలాంటి చిన్న వస్తువు కూడా ప్రమాదకరంగా మారవచ్చు. డైవింగ్ చేస్తున్నప్పుడు భద్రతకు సంబంధించిన ఆలోచనలు వస్తూ పోతుంటాయి.– అతుల్య -
ముంబైలో INCA అవార్డ్స్.. ఉత్తమ నటుడిగా నాగచైతన్య (ఫోటోలు)
-
క్షురకర్మ పండగ
చారిత్రక ‘మాచు పిచ్చు’ ప్రదేశమే కాదు, పెరూ దేశంలో చూడదగ్గ మరో ఉత్సవం ‘చాచు’. ‘ఇన్కా’ సామ్రాజ్యం నుంచీ కొనసాగుతున్న ఈ ఉత్సవంలో సింపుల్‌గా చేసేది ‘వికునా’ల క్షురకర్మ. వికునాలంటే దక్షిణ అమెరికాలో మాత్రమే కనిపించే అరుదైన పొట్టిరకం అడవి ఒంటెలు. వికునా ఉన్ని అతి శ్రేష్టమైనది. అయితే ఏడాదికి దాని ఉన్ని అరకిలోకు మించదు. ఒకప్పుడు ఇన్కా రాజులు, రాణులు మాత్రమే ఆ ఉన్నితో తయారైన వస్త్రాలు ధరించేవారు. సాధారణ మనుషులు వాటిని ధరించడం మీద నిషేధం ఉండేది. వికునా ఉన్నితో చేసిన ఒక కోటు ప్రస్తుతం సుమారు 30 వేల డాలర్లకు అమ్ముడుపోతుంది. ఇంత ఖరీదైనది కాబట్టే దానికి అనుగుణమైన వేట సాగేది. కాబట్టి ఉన్ని సేకరణను ప్రభుత్వం నియంత్రిస్తోంది. అయితే ‘చాచు’ పండగను మాత్రం పాతకాలంలోలాగే జరుపుతోంది. ఏడాదికి ఒకమారు వందలాదిమంది ‘ఇన్కా’ సంప్రదాయ వేషధారణలో వాటిని చుట్టుముట్టి ఒకచోటికి తరలేలా చేస్తారు. ఈ మొత్తం తతంగాన్ని పర్యవేక్షిస్తున్నట్టుగా ఒకరు రాజు వేషాన్ని కూడా ధరిస్తారు. అన్నింటినీ ఒక దగ్గరకు చేర్చి, శుభ్రంగా బొచ్చుగొరిగి, తిరిగి జాగ్రత్తగా వికునాలను అడవిలోకి వదిలేస్తారు.


