-
యంగ్ ముఫాసా వచ్చేస్తున్నాడు.. ట్రైలర్ చూశారా?
చిన్నా, పెద్దా అనే తేడా అందరినీ అలరించిన చిత్రం లయన్ కింగ్. ఈ చిత్రంలో రాజ్యాన్ని పాలించే ముఫాసా, అతని తమ్ముడు స్కార్ పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అడవికి రాజుగా ముఫాసా తన రాజ్యాన్ని కాపాడుతూ ఉంటారు. అతనికి సింబా అనే కుమారుడు జన్మిస్తాడు. ఈ సిరీస్‌లో ఇప్పటికే లయన్ కింగ్-2 కూడా వచ్చింది. తాజాగా లయన్ ప్రీక్వెల్తో మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తున్నారు మేకర్స్.అకాడమీ అవార్డ్ విజేత, దర్శకుడు బారీ జెంకిన్స్ లయన్ కింగ్ ప్రీక్వెల్‌ను తెరకెక్కించనున్నారు. ముఫాసా ఎదగడానికి చేసిన ప్రయాణాన్ని ఈ చిత్రంలో చూపించనున్నారు. 1994లో వచ్చిన ది లయన్ కింగ్ యానిమేటెడ్ క్లాసిక్ ఆధారంగా రూపొందిస్తున్నారు. 2019లో జోన్ ఫావ్రూ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.తాజాగా ముఫాసా ది లయన్ కింగ్ ప్రీక్వెల్‌కు సంబంధించి ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తే అద్భుతమైన విజువల్స్ ఈ సినిమాపై మరింత ఆసక్తిన పెంచేస్తున్నాయి. ముఫాసా చిన్నప్పటి కథను ఈ సినిమాలో చూపించనున్నారు. ఈ చిత్రంలో రఫీకిగా జాన్ కనీ, పుంబాగా సేథ్ రోజెన్, టిమోన్‌గా బిల్లీ ఐచ్నర్, సింబాగా డోనాల్డ్ గ్లోవర్, నాలాగా బియాన్స్ నోలెస్-కార్టర్ కనిపించనున్నారు. కాగా.. ముఫాసా: ది లయన్ కింగ్ డిసెంబర్ 20న థియేటర్లలోకి రానుంది. -
నా జీవితంలో అవి చీకటి రోజులు : ప్రియాంక చోప్రా
బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న ప్రియాంకా చోప్రా ఇప్పుడు హాలీవుడ్లో సినిమాలు చేస్తూ రాణిస్తున్నారు. హాలీవుడ్ నటుడు, గాయకుడు నిక్ జోనస్‌ని ఆమె వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో తొలి నాళ్లల్లో హాలీవుడ్లో తన ప్రయాణం గురించి ప్రియాంకా చోప్రా మాట్లాడుతూ – ‘‘హాలీవుడ్‌కి వెళ్లిన తర్వాత నా కెరీర్ మళ్లీ మొదట్నుంచి మొదలైందా? అనే భావన కలిగింది. హాలీవుడ్లో నాకు తెలిసిన వారు ఎవరూ లేరు. ఒంటరిగా ఫీలయ్యాను. చాలా భయం వేసింది. కొన్ని తిరస్కరణలూ ఎదురయ్యాయి.ఇలా హాలీవుడ్లో నా కెరీర్ తొలి రోజులు ఓ చీకటి అధ్యాయంలా గడిచాయి. ఇండియాలో నేనో స్టార్ హీరోయిన్ని అనే భావనను పక్కన పెట్టి హాలీవుడ్లో నా పని చేసుకుంటూ వెళ్లాను. అందుకే ఇప్పుడు హాలీవుడ్లో మంచి స్థాయిలో ఉండగలిగానని నా నమ్మకం’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ప్రియాంక హాలీవుడ్లో ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’ ఫిల్మ్‌లో నటిస్తున్నారు. -
Monkey Man In OTT: నేరుగా ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మరో క్రేజీ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. హనుమంతుడి స్ఫూర్తితో తీసిన ఈ హాలీవుడ్ చిత్రం.. గత నెలలోనే ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. కావాల్సింది. కానీ సెన్సార్ ఇబ్బందుల వల్ల భారత్ తప్ప అన్నిచోట్ల కూడా విడుదలైంది. హిట్ టాక్ తెచ్చుకుంది. మనోళ్లు ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తుండగా.. సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన విషయం సర్ప్రైజ్ చేసింది. కాకపోతే ఇక్కడే చిన్న తిరకాసు ఉంది. 'స్లమ్ డాగ్ మిలియనీర్' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దేవ్ పటేల్.. ఆ తర్వాత హాలీవుడ్లో ఫేమ్ తెచ్చుకున్నాడు. ఇతడే 'మంకీ మ్యాన్' మూవీతో దర్శకుడిగానూ మారాడు. ఇందులో హీరోగానూ చేశాడు. హనుమంతుడి స్ఫూర్తితో తీసిన ఈ మూవీని పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్టైనర్గా తీశాడు. ఫైట్స్ లాంటివి ఇష్టపడే ఆడియెన్స్ ఈ చిత్రాన్ని చూడొచ్చు. (ఇదీ చదవండి: పెళ్లి న్యూస్‌తో షాకిచ్చిన యంగ్ హీరోయిన్.. హల్దీ వీడియో వైరల్) ఇకపోతే సెన్సార్ ఇబ్బందుల వల్ల 'మంకీ మ్యాన్' మూవీ మన దేశంలో రిలీజ్ కాలేదు. ఇంకెప్పుడు అవుతుందా అని ఎదురుచూస్తున్న టైంలో అమెజాన్ ప్రైమ్, ఆపిల్ టీవీ ఓటీటీల్లో అందుబాటులోకి వచ్చేసింది. ఈ క్రమంలోనే భారతీయ ప్రేక్షకులు తెగ ఎగ్జైట్ అవుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతానికైతే రెంట్ విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. 'మంకీ మ్యాన్' కథ విషయానికొస్తే.. ముంబైని పోలినట్లు యాతనా అనే సిటీ ఉంటుంది. ఇక్కడ ఉండే హీరో.. రాత్రిపూట కోతి మాస్క్ వేసుకుని మల్లయుద్ధ పోటీల్లో పాల్గొంటూ ఉంటాడు. ఇతడికి ప్రత్యేకంగా పేరేం ఉండదు. ఇతడు.. ఓ అమ్మాయిని వ్యభిచారం నుంచి రక్షించేందుకు క్రూరుడైన పోలీస్ అధికారిని ఎదుర్కొంటాడు. హీరోకి పోలీస్ ఆఫీసర్‌కి గతంలో ఉన్న సంబంధమేంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ. ఇందులో తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ్ల కూడా నటించింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 17 సినిమాలు.. ఆ రెండు కాస్త స్పెషల్) -
నేకెడ్ గన్ రీమేక్‌లో...
హాలీవుడ్ హాట్ తార పమేలా ఆండర్సన్ అభిమానులకు ఓ శుభవార్త. ఈ గ్లామరస్ స్టార్ తాజాగా ‘నేకెడ్ గన్’ రీమేక్‌లో నటించడానికి అంగీకరించారు. ఈ మధ్యకాలంలో చేసిన చిత్రాల్లోకన్నా ఈ చిత్రంలో పమేలా పాత్ర నిడివి ఎక్కువ కావడం, హీరోయిన్ పాత్ర కావడం అనేది అభిమానులు ఆనందించే విషయమే. 1980 చివర్లలో 1990 ఆరంభంలో వచ్చిన క్రైమ్ కామెడీ ‘నేకెడ్ గన్’ ఫ్రాంచైజీలో వచ్చిన మూడు చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. మూడో భాగం 1994లో వచ్చింది. 30 ఏళ్లకు ‘నేకెడ్ గన్’ మళ్లీ తెరపైకి రానుంది. ఈ చిత్రాన్ని రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అకీవా షాఫర్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ రీమేక్‌లో లీడ్ రోల్లో లియామ్ నీసన్ నటించనుండగా, అతని సరసన పమేలా ఆండర్సన్ నటించనున్నారు. గత మూడు భాగాల్లో డిటెక్టివ్ పాత్రను లెస్లీ నీల్సన్ చేయగా అతని ప్రేయసిగా ప్రిసిల్లా ప్రెస్లీ నటించారు. రీమేక్‌లో డిటెక్టివ్‌గా లియామ్ నీసన్, అతని ప్రేయసిగా పమేలా ఆండర్సన్ నటించనున్నారు. వచ్చే ఏడాది జూలై 18న ఈ చిత్రం విడుదల కానుంది. ఇక పమేలా గురించి చె΄్పాలంటే... 1990లలో హాటెస్ట్ స్టార్ అంటే పమేలానే. ‘ప్లే బాయ్’ మ్యాగజీన్ మోడల్‌గా అప్పట్లో బోలెడంత పాపులార్టీ తెచ్చుకున్నారామె. అలాగే బుల్లితెర కోసం ‘బేవాచ్’ సిరీస్ (1992–1997)లో చేసిన సీజే పార్కర్ పాత్ర కూడా హాట్ స్టార్‌గా పమేలాకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది. సినిమాల పరంగా ‘రా జస్టిస్, స్కేరీ మూవీ 3, బోరాట్, బేవాచ్’ వంటివి పమేలా క్రేజ్ కొనసాగడానికి ఉపయోగపడ్డాయి. -
ఓటీటీలో బెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ.. క్లైమాక్స్ చూస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్!
ఓటీటీల్లో బోర్ కొట్టని జానర్ అంటే థ్రిల్లరే. మిగతా సినిమాల సంగతేమో గానీ థ్రిల్లర్స్ ని థియేటర్లలో కంటే సింగిల్ గా ఇంట్లోనే చూడటం బెస్ట్ అని చెప్పొచ్చు. అలా హాలీవుడ్ లో 2014లోనే వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ సైన్స్ ఫిక్షన్ టైమ్ ట్రావెల్ థ్రిల్లర్ మూవీ 'ప్రీ డెస్టినేషన్'. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా నిజంగా అంత బాగుందా? ఏంటనేది డీటైల్డ్ గా చూద్దాం.(ఇదీ చదవండి: ‘మంజుమ్మల్ బాయ్స్’ మూవీ రివ్యూ)'ప్రీ డెస్టినేషన్' విషయానికొస్తే.. ఈ సినిమాలో బేబీ జేన్, జేన్, జాన్, బార్ కీప్, ఫిజిల్ బాంబర్ అని ఐదు పాత్రలు ఉంటాయి. 1945-1992 మధ్య కాలంలో స్టోరీ రన్ అవుతూ ఉంటుంది. అసలు వీళ్ల ఐదుగురికి కనెక్షన్ ఏంటి? చివరకు ఏమైందనేదే అసలు కథ.కొన్ని సినిమాలు చూడటానికి చాలా సాధారణంగా ఉంటాయి. 40 నిమిషాలు అయ్యేవరకు 'ప్రీ డెస్టినేషన్' కూడా అలానే అనిపిస్తుంది. డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నాడా అని డౌట్ వస్తుంది. కానీ ఐదు పాత్రలకు సంబంధించిన డీటైల్స్ అన్ని ప్రేక్షకుల అర్థమైన దగ్గర నుంచి థ్రిల్ కలిగిస్తుంది. ఐదు పాత్రలు టైమ్ ట్రావెలింగ్ చేస్తుంటే.. చూస్తున్న మనకు సరికొత్త అనుభూతి, థ్రిల్ అనిపిస్తుంది. ఇక్కడ నిజంగా టైమ్ ట్రావెల్ అనేది సాధ్యమా కాదా అనేది పక్కనబెట్టి చూస్తే మాత్రం మూవీ నచ్చేస్తుంది. ఇంతకంటే ఒక్క విషయం ఎక్కువ చెప్పినా సరే మళ్లీ కథ లీక్ చేసి, మేమే మీకు స్పాయిలర్స్ ఇచ్చేసినట్లు అయిపోద్ది!(ఇదీ చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరో మంచు మనోజ్ భార్య)'ప్రీ డెస్టినేషన్' సినిమాని గ్రేటెస్ట్ అని చెప్పలేం కానీ డిఫరెంట్ మూవీస్ అంటే ఇష్టపడే మూవీ లవర్స్ కచ్చితంగా మిస్సవకుండా చూడాల్సిన మూవీ. 2014లోనే రిలీజైన ఈ చిత్రం హాలీవుడ్ ఆడియెన్స్ కి తెగ నచ్చేసింది. ఓటీటీలోకి వచ్చేసిన తర్వాత గ్లోబల్ ఆడియెన్స్ కి మరింత చేరువైంది. ఇదే మూవీ కథని స్ఫూర్తిగా తీసుకుని తెలుగులో పలు సినిమాలు తీయడం విశేషం. అవేంటో చెబితే మళ్లీ స్టోరీ చెప్పిసినట్లు అవుతుంది.లాస్ట్ అండ్ ఫైనల్.. ఈ సినిమా మొత్తం చూసిన తర్వాత 'అత్తారింటికి దారేది' సినిమాలోని ఫేమస్ డైలాగ్ కచ్చితంగా గుర్తొస్తుంది. అదేంటనేది 'ప్రీ డెస్టినేషన్' చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. కేవలం 97 నిమిషాల నిడివితో ఉన్న ఈ సినిమాని అలా మొదలుపెడితే ఇలా ముగించేయొచ్చు. మరి ఇంకెందుకు లేటు త్వరగా చూసేయండి.(ఇదీ చదవండి: ఖరీదైన బంగ్లాలోకి హీరోయిన్ పూజాహెగ్డే.. రేట్ తెలిస్తే మైండ్ బ్లాకే!)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్‌తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement