breaking news
Dollars investment
-
లక్ష డాలర్ల ఫీజు ఇంకో ఏడాది
వాషింగ్టన్: కొత్త హెచ్1–బీ వీసా దరఖాస్తులపై ఇంకో ఏడాది లక్ష డాలర్ల ఫీజు వసూలు చేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసినట్లు వైట్‌హౌస్ ప్రకటించింది. ప్రభుత్వ విభాగాలు మరింత సమన్వయంతో పనిచేయడం ద్వారా హెచ్1–బీ వీసాల దరఖాస్తులను నిశితంగా పరిశీలించాలని ట్రంప్ మరో ఉత్తర్వు ద్వారా ఆదేశించారు. 2025లో మొదటిసారి లక్ష డాలర్ల ఫీజును ప్రవేశపెట్టాక ఐటీ ఔట్సోర్సింగ్ కంపెనీల నుంచి వచ్చే హెచ్1–బీ వీసా దరఖాస్తులు 92 శాతం వరకూ తగ్గాయని ట్రంప్ తాజా ఉత్తర్వుల్లో తెలిపారు. అమెరికా ఆర్థిక, భద్రతపరమైన ప్రయోజనాలను కాపాడేందుకు గత ఏడాది నాటి ఈ ఉత్తర్వులను పొడిగించడం అవసరమైందని స్పష్టం చేశారు. అమెరికన్ ఉద్యోగులు, పట్టభద్రుల ఉద్యోగ అవకాశాలకు, కంపెనీలు అత్యధిక నైపుణ్యం అవసరమైన విదేశీయులను మాత్రమే నియమించుకునేలా చేసేందుకు ఈ ఉత్తర్వులు ఉపయోగపడతాయని వివరించారు. హెచ్1– బీ వీసాల లబ్ధి అత్యధికంగా పొందుతున్నది భారతీయ టెకీలన్న విషయం తెలిసిందే. 2025లో ట్రంప్ హెచ్1–బీ వీసా దరఖాస్తులకు లక్ష డాలర్ల ఫీజు వసూలు చేయాలని నిర్ణయించినప్పుడు కొన్ని న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. రెండు ఫెడరల్ కోర్టుల్లో కేసులు నమోదయ్యాయి. నాటి ఉత్తర్వుల కాలపరిమితి ఈ నెలతో ముగియనుండగా తాజా ఆదేశాలు వెలువడటం గమనార్హం. అయితే ఈ లక్ష డాలర్ల ఫీజు అనేది అమెరికాలో విద్యార్థి వీసాలపై ఉన్న వారికి, ప్రస్తుతం హెచ్1–బీ వీసాపై ఉన్న వారి రెన్యువల్‌కూ వర్తించదు. ఈ వీసాదారుల వేతనాలు, పని నిబంధనలకు సంబంధించి కంపెనీ ఇప్పటికే సమర్పించిన లేబర్ కండిషన్ అప్లికేషన్ల సమాచారాన్ని 30 రోజుల్లో సమీక్షించాలని, అనంతరం స్పాన్సర్ చేసే సంస్థలపై మరిన్ని చర్యలు అవసరమా? లేదా? అన్నది నిర్ణయించాలని ట్రంప్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. -
భారత రియల్టీ మార్కెట్లోకి చైనా వాండా గ్రూప్
చైనా రియల్టీ దిగ్గజం దలియాన్ వాండా గ్రూప్ భారత రియల్టీ మార్కెట్లో 500 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టాలని యోచిస్తోంది. భారత్‌లో పారిశ్రామిక టౌన్‌షిప్‌ల అభివృద్ధి కోసం ఈ మేరకు పెట్టుబడులు పెట్టనున్నది. జాయింట్ వెంచర్ల ఏర్పాటు కోసం డీఎల్ఎఫ్ వంటి కంపెనీలతో సంప్రదింపులు జరుపుతోంది. డీల్స్ హౌసింగ్‌డాట్‌కామ్ చేతికి రియల్టీ సంస్థ - రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి రిస్క్ అసెస్మెంట్ సర్వీసులందజేసే రియల్టీ బిజినెస్ ఇంటెలిజెన్స్‌ను రూ. 10 కోట్లకు ప్రముఖ రియల్ ఎస్టేట్ పోర్టల్ హౌసింగ్‌డాట్‌కామ్ కొనుగోలు చేసింది. పీవీఆర్ చేతికి డీఎల్ఎఫ్ డీటీ సినిమాస్ - డీఎల్ఎఫ్కు చెందిన డీటీ సినిమాస్‌ను పీవీఆర్ రూ.500 కోట్లకు కొనుగోలు చేసింది. డీఎల్ఎఫ్కు చెందిన డీఎల్ఎఫ్ యుటిలిటిస్ సంస్థ సినిమా ఎగ్జిబిషన్ బిజినెస్‌ను డీటీ సినిమాస్ పేరుతో నిర్వహిస్తోంది. ఈ సంస్థ 6,000 సీటింగ్ సామర్థ్యం ఉన్న 29 స్క్రీన్లతో ఈ వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. పీవీఆర్ సినిమాస్ సంస్థ 43 నగరాల్లో 467 స్క్రీన్లను నిర్వహిస్తోంది. డీటీ సినిమాస్ కొనుగోలుతో పీవీఆర్ సంస్థ 44 నగరాల్లో 506 స్క్రీన్లను నిర్వహించే స్థాయికి చేరుతుంది.


