-
ఢిల్లీ హిట్ అండ్ రన్ కేసులో చార్జిషీట్
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన ఢిల్లీ హిట్ అండ్ రన్ కేసులో ఏడుగురు నిందితులపై పోలీసులు శనివారం 800 పేజీల చార్జిషీట్ దాఖలు చేశారు. దాదాపు 120 మంది సాక్ష్యాలను అందులో పొందుపరిచారు. నిందితుల్లో నలుగురిపై హత్యా నేరం మోపారు. దీనిపై విచారణను ఏప్రిల్ 13కు మెట్రోపాలిటన్ జడ్జి సన్యా దలాల్ వాయిదా వేశారు. గత డిసెంబర్ 31న ఢిల్లీలో న్యూ ఇయర్ వేడుకలు చేసుకుని అర్ధరాత్రి దాటాక స్కూటీపై వెళ్తున్న అంజలీసింగ్ అనే 20 ఏళ్ల యువతిని నిందితులు కారుతో ఢీకొట్టడం, ఆమె కారు కింద చిక్కుకుందని తెలిసి కూడా అలాగే 12 కిలోమీటర్లకు పైగా లాక్కెళ్లడం తెలిసిందే. దాంతో ఒళ్లంతా ఛిద్రమై అంజలి అత్యంత బాధాకరంగా మరణించింది. -
అంజలి కేసు: ఘటన తర్వాత పక్కా ప్లాన్‌తోనే..
ఢిల్లీ: సుల్తాన్‌పురి హిట్ అండ్ రన్ కేసు ఊహించని మలుపులు తీసుకుంటోంది. పోలీసుల దర్యాప్తులో రోజుకో కొత్త విషయం వెల్లడి అవుతోంది. ఘటన జరిగిన సమయంలో కారు ఉంది ఐదుగురు కాదని, కేవలం నలుగురే ఉన్నారని తాజాగా పోలీసులు ప్రకటించడం ఈ కేసును మలుపు తిప్పింది. అంతేకాదు.. ఈ కేసులో కారు నడిపింది దీపక్ ఖన్నా కాదని గురువారమే సంచలన ప్రకటన చేశారు పోలీసులు. ఘటన జరిగిన సమయంలో కారు నడిపింది తనేనని దీపక్ ఖన్నా అనే వ్యక్తి పోలీసుల ముందు అంగీకరించాడు. దీంతో దీపక్‌తో పాటు కారులో ఉన్నారని చెబుతూ ముందుకొచ్చిన మనోజ్ మిట్టల్, అమిత్ ఖన్నా, కృషన్, మిథున్‌లను పోలీసులు నిందితులుగా చేర్చారు. అయితే.. దర్యాప్తులో వీళ్లను తప్పించేందుకు మరో ఇద్దరు యత్నించారని సీసీటీవీ ఫుటేజీ ద్వారా గుర్తించి.. వాళ్లను కూడా నిందితుల జాబితాలో చేర్చారు. వాళ్లే కారు ఓనర్ అశుతోష్, మరో నిందితుడు అంకుశ్ ఖన్నా. అయితే.. అంకుశ్ ఖన్నా.. అమిత్ ఖన్నా సోదరుడు. ఘటన జరిగిన సమయంలో డ్రైవింగ్ సీట్లో ఉంది అమిత్ ఖన్నా. ఈ విషయాన్ని సోదరుడికి చెప్పాడు అమిత్. అమిత్ ఖన్నాకు డ్రైవింగ్ లైసెన్స్ లేదు. దీంతో సోదరుడికి ఏం జరగకూడదనే ఉద్దేశంతో కార్ ఓనర్ అశుతోష్‌ను కలిసి ఈ ప్రమాద ఘటన గురించి చర్చించాడు అంకుశ్. ఆపై ఎలాగోలా నేరం తనపైనే వేసుకునేలా దీపక్‌ను ఒప్పించారు. కారు నడిపింది అమిత్ ఖన్నా అని, ఘటన జరిగిన సమయంలో అసలు దీపక్ కారులోనే లేడని, ఇంట్లో ఉన్నాడని పోలీసులు తాజాగా వెల్లడించారు. డబ్బు ఆశ చూపించడం వల్లనో, స్నేహితుడనే కారణంతోనో ఆ నేరం తనపై వేసుకునేందుకు దీపక్ ముందుకు వచ్చి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. అశుతోష్‌ను శుక్రవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు అంకుశ్ ఖన్నా కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. జనవరి 1వ తేదీ అర్ధరాత్రి 2 గంటల సమయంలో స్కూటీపై వస్తున్న అంజలి సింగ్, నిధిలను కారుతో ఢీ కొట్టారు ఈ నిందితులు. నిధి పక్కకు పడిపోగా.. అంజలి కాలు కారు కింది భాగంలో ఇరుక్కుపోయింది. సాయం కోసం ఆమె అరుస్తుండగానే.. అదేం పట్టనట్లు ముందుకు వెళ్లిపోయారు కారులో ఉన్న వాళ్లు. అది చూసి భయంతో నిధి అక్కడి నుంచి జారుకుంది. అయితే కొద్ది దూరం వెళ్లాక అంజలి మోచేయి భాగం కనిపించిందని, అయినా మద్యం మత్తులో పట్టించుకోకుండా వాళ్లు ముందుకు వెళ్లిపోయారని తెలుస్తోంది. అలా గంట.. రెండు గంటల మధ్య సుల్తాన్‌పురి నుంచి 13 కిలోమీటర్ల పాటు ప్రయాణించి.. దారిలో యూటర్న్లు కొడుతూ.. కంఝావాలా వద్ద ఆమె మృతదేహాన్ని వదిలేసి వెళ్లిపోయారు. చివరికి కారును అశుతోష్‌కు అప్పగించి.. ఓ ఆటోలో కారులోని నలుగురు పారిపోయారు. అంజలిని అలా ఈడ్చుకెళ్లే క్రమంలో ఆమె దుస్తులు చినిగిపోవడంతోపాటు తీవ్ర గాయాలై మరణించింది. శరీరంపై 40 గాయాలు అయ్యాయి. చర్మం ఒలుచుకుపోయి ఉంది. పక్కటెముకలు బయటకు పొడుచుకువచ్చాయి. తల పలిగి పుర్రె భాగం బయటకు వచ్చింది. సగం మెదడు ఎక్కడో పడిపోయింది అని శవ పరీక్షలో తేలింది. తల పగిలి, వెన్నెముకకు తీవ్రగాయాలు కావడం, అవయవాలు దెబ్బ తినడంతో రక్తస్రావం జరిగి ఆమె మృతి చెందని పోస్ట్‌మార్టం నివేదికలో నిర్ధారణ అయ్యింది. అయితే ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్లు అత్యాచారం జరగలేదని తేలింది. -
టీనేజర్‌పై హత్యానేరం
సాక్షి, న్యూఢిల్లీ: మెర్సిడెస్ బెంజ్ కారుతో ఢిల్లీ సివిల్ లైన్స్‌లో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ఒక వ్యక్తి మరణానికి కారకుడైన 17 ఏళ్ల బాలుడిపై ఉద్దేశపూర్వకం కాని, శిక్షార్హమైన హత్యానేరం కింద కేసు నమోదైంది. ఆ బాలుడి గత డ్రైవింగ్ రికార్డు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు శనివారం పోలీసులు తెలిపారు. నివాస ప్రాంతంలో విపరీతమైన వేగంతో ఆ బాలుడు కారు నడిపినట్లు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా స్పష్టమైందని డీసీపీ మాథుర్ వర్మ తెలిపారు. ఆ బాలుడు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం ఇదేం తొలిసారి కాదని ఆయన తెలిపారు. గతంలోనూ ప్రమాదాలు చేసిన చరిత్ర అతడికి ఉందన్నారు. 17 ఏళ్ల తర్వాత ఢిల్లీలో ఇలాంటి కేసు మళ్లీ నమోదైందని, 1999లో సంజీవ్ నందా అనే వ్యక్తి బీఎండబ్ల్యూ కారుతో ఢీకొట్టడం వల్ల ఆరుగురు మృతి చెందారని పోలీసు అధికారి ఒకరు చెప్పారు. హీరో సల్మాన్ ఖాన్ విషయంలోనూ పోలీసులు ఇలాంటి చర్యలే తీసుకున్నారు. కాగా, వ్యాపారస్తుడైన బాలుడి తండ్రిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. మైనరా...? కాదా..? ఇదిలా ఉండగా మెర్సిడెస్ నడిపిన నిందితుడు నిజంగా మైనరేనా కాదా అన్నది నిర్ధారించుకోవడం కోసం పోలీసులు ధ్రువీకరణ పత్రాలను పరిశీలిస్తున్నారు. నిందితుడిని జువనైల్‌గా చూపిస్తూ అతడి కుటుంబం సమర్పించిన ధ్రువీకరణ పత్రాలు నిజమైనవా కాదా అన్న విషయాన్ని వారు తనిఖీ చేస్తున్నట్లు తెలిసింది. నిందితుడు దేశం విడిచి పారిపోకుండా ఉండేందుకు పోలీసులు అతని పాస్‌పోర్టును స్వాధీనం చేసుకున్నారు. తొలుత మంగళవారం బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటికీ ఆ తరువాత విడిచిపెట్టారు. బాలుడి తండ్రిని శనివారం న్యాయస్థానం ఎదుట హాజరు పరిచారు. మితిమీరిన వేగంతో తన కుమారుడు వాహనం నడుపుతున్నాడని తెలిసినప్పటికీ అతని తండ్రి నిందితుడిని అదుపు చేయలేదని పోలీసులు ఆరోపించారు. వేగంగా వాహనం నడిపే కొడుకు చేతికి కారు ఇచ్చి తండ్రి మనోజ్ అగర్వాల్ నేరాన్ని ప్రోత్సహించాడని వారు ఆరోపించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
విజృంభిస్తున్న ఎండలు
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
ఉచిత సామూహిక వివాహాలు పేదలకు వరం
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
పోలింగ్‌కు సర్వం సిద్ధం
రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు
ప్రజ్వల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి
తప్పక చదవండి
- పోస్టల్ ఓటింగ్‌లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్‌రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్‌రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
Advertisement