-
వయసు18...చోరీలు16
సాక్షి, సిటీబ్యూరో: పదహేరేళ్ల వయస్సు నుంచే బైక్‌ల చోరీలకు పాల్పడుతూ మూడుసార్లు పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లొచ్చి మళ్లీ నేరాల బాట పట్టి హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులకు కంటిమీద కునుకులేకుండా చేసిన బాలనేరస్తుడిని పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ జానకి షర్మిలా కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.వనపర్తి జిల్లా, కొత్తకోట గ్రామానికి చెందిన యువకుడు(18) పదో తరగతి వరకు చదువుకున్నాడు. ఉపాధి నిమిత్తం నగరానికి వలసవచ్చిన అతను బోరబండలో ఉంటూ బైక్ మెకానిక్ సెంటర్లో పని చేసేవాడు. ఈ క్రమంలో చెడు అలవాట్లకు బానిసైన అతను బైక్‌లపై ఉన్న మోజుతో వాటిని చోరీ చేసి సరదాగా షికార్లు చేసేవాడు. 2016లో నకిలీ తాళాలతో దుండిగల్ పోలీసు స్టేషన్ పరిధిలో బైక్ చోరీకి పాల్పడ్డాడు. పోలీసులు అతడిని అరెస్టు చేసి బైక్ జువనైల్ హోమ్‌కు తరలించారు. బయటికి వచ్చినా తీరు మార్చుకోని అతను 2017లో రైల్వే స్టేషన్లు, ఆలయాలు, కార్యాలయాలు, రోడ్డు పక్కన పార్క్ చేసే వాహనాలను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడ్డాడు. 2017, 2018లో పోలీసులు అ తడిని జువనైల్ హోమ్‌కు తరలించారు. రెండు నెలల్లో 16 చోరీలు... జూలై నెలలో జువనైల్ హోమ్ నుంచి బయటికి వచ్చిన ఇతను కేపీహెచ్‌బీ, కూకట్పల్లి, మాదాపూర్, మియాపూర్, సనత్‌నగర్, ఎస్ఆర్ నగర్, సైఫాబాద్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో 16 బైక్‌లను ఎత్తుకెళ్లాడు. వరుస చోరీలకు తీవ్రంగా పరిగణించిన సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ మాదాపూర్ సీసీఎస్ ఇన్స్పెక్టర్ సుధీర్ కుమార్ నేతృత్వంలోని ఎస్ఐ విజయ్, హెడ్ కానిస్టేబుళ్లు ప్రసాద్, దాసు, రవీందర్ రెడ్డిలతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. సనత్‌నగర్, కేపీహెచ్‌బీ ప్రాంతాల్లో సీసీటీవీ పుటేజీ ఆధారంగా పోలీసులు పాత నేరస్తుడి పనిగా నిర్ధారణకు వచ్చారు. అప్పటి నుంచి అతడి కదలికలపై నిఘా ఉంచిన మాదాపూర్ సీసీఎస్ పోలీసులు మంగళవారం బోరబండ రైల్వే స్టేషన్ సమీపంలో అతడిని పట్టుకున్నారు. రూ.15 లక్షల విలువైన బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో మాదాపూర్‌లో రెండు, కేపీహెచ్బీలో మూడు, సనత్‌నగర్‌లో నాలుగు, కూకట్‌పల్లిలో రెండు, ఎస్ఆర్నగర్లో రెండు, బంజారాహిల్స్‌లో ఒకటి, సైఫాబాద్‌లో ఒకటి, మియాపూర్‌లో ఐదు బైక్‌లు చోరీ చేసినట్లు తెలిపారు. పెట్రోల్ అయిపోతే మరో బైక్ నకిలీ తాళాలతో బైక్‌లు చోరీ చేస్తున్న ఇతను ఇప్పటివరకు ఒక్క బైక్‌ను కూడా ఎక్కడా విక్రయించలేదు. చోరీ చేసిన బైక్‌పై షికారు చేస్తుండగా పెట్రోల్ అయిపోతే ఆ బైక్‌ను అక్కడే వదిలేసి వెళ్లేవాడు. అనంతరం సమీపంలో మరో బైక్‌ను చోరీ చేసి పెట్రోల్ అయిపోయేంత వరకు దానిపై తిరిగేవాడు. పలు రకాల బైక్‌లు నడపాలన్న కోరికతో దారి తప్పిన ఈ బాలనేరస్తుడు పోలీసులకు చుక్కలు చూపించినా సీసీ కెమెరా పుటేజీ ఆధారంగా దొరికిపోయాడు. -
'నిర్భయ' బాలఖైదీపై నిరంతర పర్యవేక్షణ: మేనక
నిర్భయ గ్యాంగ్‌రేప్ కేసులో అరెస్టయి.. వచ్చే నెల విడుదల కాబోతున్న బాల ఖైదీపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని సూచించనున్నట్లు సోమవారం కేంద్ర మంత్రి మేనకా గాంధీ పేర్కొన్నారు. అతని శిక్షా కాలాన్ని మరింత పెంచే అవకాశం లేదని, మైనర్ కావడంతో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. 2012లో జరిగిన ఢిల్లీ గ్యాంగ్‌రేప్ ఘటనలో అరెస్టయిన పదిహేడున్నర ఏళ్ల మైనర్.. ఫ్రొహిబిషన్ సెంటర్లో మూడేళ్ల శిక్షా కాలాన్ని పూర్తి చేసుకున్నాడు. ప్రసుత్తం అతనికి 21 సంవత్సరాలు రావడంతో కోర్టు ఆదేశాల మేరకు విడుదల చేయనున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలింగ్ కేంద్రాల తనిఖీ
పట్టుదలతో చదవండి
స్వర్ణకారుల సమస్యలు పరిష్కరిస్తాం
ఆదాయపు పన్ను మాఫీ చేయిస్తాం
ఓపెన్ కాస్టుల్లో పనివేళలు మార్చండి
కమిషనింగ్ పూర్తిచేయండి
ఓదెల మల్లన్న సాక్షిగా చెబుతున్నా..
సర్కారు ఆస్పత్రిలో గడువు ముగిసిన మందులు!
ఎన్నికల ప్రచార వ్యయం నమోదుపై సమావేశం
వేడెక్కిన ప్రచారం
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement