breaking news
Calvin Harris
-
వైరల్ కోసం కాదు.. మనసుకు నచ్చిందే పాడా! సింగర్ జాజీ
ఒక పాట హిట్ అయితే చాలు.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవచ్చు! కానీ, ఆ గుర్తింపును నిలబెట్టుకుంటూ తనదైన సంగీతంతో అభిమానులను అలరించడం అంత సులభం కాదు. ఇదే బాటలో సాగుతున్న ఐర్లాండ్ సింగర్, డీజే జాజీ ఇప్పుడు తన తొలి ఆల్బమ్‌తో సంగీత ప్రియుల ముందుకు వస్తోంది.30 ఏళ్ల జాజీ అసలు పేరు యాస్మిన్ బైరన్. ఆమె పాటలు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది సంగీత ప్రియులను అలరించాయి. అయితే, ప్రముఖ సంగీత కళాకారుడు కాల్విన్ హారిస్‌తో కలిసి పనిచేసిన ఆమె.. ఇప్పటివరకు ఎన్నో పాటలను ఒక్కొక్కటిగా విడుదల చేసింది. ఇప్పుడు ‘పీస్ అండ్ పేషెన్స్’ పేరుతో తన తొలి పూర్తి స్థాయి ఆల్బమ్‌ను విడుదల చేయనుంది.ప్రస్తుతం యువతలో డాన్స్ మ్యూజిక్కు ఆదరణ పెరుగుతోంది. 2020 నుంచి ప్రపంచవ్యాప్తంగా 25 ఏళ్లలోపు వారు ఈ తరహా సంగీతాన్ని వినడం 73 శాతానికి పైగా పెరిగినట్లు స్పాటిఫై గతంలో తెలిపింది. అయితే, చాలామంది కళాకారులు పూర్తి ఆల్బమ్‌ల కంటే సింగిల్స్, చిన్న ఆల్బమ్లకే ప్రాధాన్యమిస్తున్నారు. అయినా, పాటలు వైరల్ కావడం కంటే నాణ్యమైన సంగీతాన్ని అందించడమే తనకు ముఖ్యమని జాజీ చెబుతోంది.సంగీత ప్రపంచంలో ఎదగాలంటే ఆన్లైన్లో గుర్తింపు రావడమే కాదు.. ప్రత్యక్షంగా ప్రదర్శనలు ఇచ్చే అవకాశాలు కూడా అవసరమే. అయితే, అనేక నైట్ క్లబ్‌లు మూతపడుతుండటంతో కొత్త కళాకారులకు అవకాశాలు తగ్గుతున్నాయని జాజీ ఆవేదన వ్యక్తం చేసింది. కరోనా తర్వాత బ్రిటన్‌లో రాత్రి వేళల్లో కార్యకలాపాలు నిర్వహించే రంగం కూడా దెబ్బతిన్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. దీంతో క్లబ్ కల్చర్‌ను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడింది.మరోవైపు, తన తొలి ఆల్బమ్‌తో వచ్చే నెల నుంచి బ్రిటన్ అంతటా పర్యటించేందుకు జాజీ సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. అంతకంటే ముందు డబ్లిన్‌లోని అరేనాలో భారీ సంగీత కార్యక్రమంలో జాజీ పాల్గొననుంది. 'కోచెల్లా సంగీత ఉత్సవంలో ప్రదర్శన ఇవ్వడంతో పాటు కాల్విన్ హారిస్‌కు సహాయక కళాకారిణిగా పనిచేసిన నాకు.. స్వస్థలంలో అభిమానుల ముందు ప్రదర్శన ఇవ్వడం నా కెరీర్లో ప్రత్యేకమైన మైలురాయి' అని జాజీ అభిమానులతో ఆనందాన్ని పంచుకుంది.ఈ ఆల్బమ్‌లో ఉత్సాహభరితమైన పాటలతో పాటు తన వ్యక్తిగత అనుభవాలనూ జాజీ పంచుకోనుంది. ముఖ్యంగా ‘ఇన్విజిబుల్’ పాట సంగీత పరిశ్రమలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ప్రతిబింబిస్తున్నట్లుగా, అభిమానులు తన గురించి మరింత తెలుసుకోవాలన్నదే ఈ ఆల్బమ్ వెనుక ఉన్న ఉద్దేశమని ఆమె చెబుతోంది. ప్రతి పాటలోనూ తన జీవితానికి సంబంధించిన ఓ సందేశం ఉంటుందని పేర్కొంది. ఇలా తన జీవితంలో ఎదురైన అనుభవాలను పాటల ద్వారా అభిమానులతో పంచుకుంటూ, తన పాటలతో వారిని మరింతగా ఆకట్టుకోవాలని జాజీ భావిస్తున్నట్లుగా తెలిపింది.ఇదీ చదవండి: 'వేర్ ఈజ్ మై హజ్బెండ్?' సంగీత ప్రపంచంలో సరికొత్త రికార్డు! -
లవర్ తో పెళ్లికి నో చెప్పిన పాప్ స్టార్!
స్టార్ మ్యుజీషియన్, సింగర్ కెల్విన్ హారిస్, టేలర్ స్విఫ్ట్ ను పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదని తేల్చి పారేశాడు. సింగర్, లిరిక్స్ రైటర్ అయిన టేలర్ తో ఏడాది పాటు కెల్విన్ అన్యోన్యంగా ఉంటూ వచ్చాడు. ఏమైందో తెలియదు గానీ, వీరిద్దరూ వివాహం చేసుకుంటార్న వార్తలు ప్రచారం కాగానే తమ బంధానికి మంగళం పాడేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకే టేలర్ స్విఫ్ట్ తో తాను వివాహ బంధానికి సిద్దంగా లేనని చెప్పాడు. అంతటితో ఆగకుండా ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఇష్టం లేదంటూ కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశాడు. అందుకే గత కొన్ని రోజులుగా ఇద్దరు ఎడమొహం పెడమెహంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. కెల్విన్ హారిస్ తో తన జీవితం సరైన మార్గంలో వెళ్లడం లేదని టేలర్ కూడా భావించింది. గతంలో పాప్ సింగర్ రీటా ఓరాతో పన్నెండు మాసాల లవ్ రిలేషన్ కు కటీఫ్ చెప్పిన హారిస్.. ఆ సమయంలో డిప్రెషన్లో ఉన్నాడు. హారిస్ పై రీటా చాలా సీరియస్ అయింది. ఓ అవార్డుల ఫంక్షన్లో పెర్ఫార్మ్ చెయ్యకుండా తనను హారిస్ అడ్డుకున్నాడని తెలిపింది. రీటా ఓరాతో కూడా బ్రేకప్ కావడంలో హారిస్ దే తప్పు అని అందరూ భావిస్తున్నారు. తన జీవితంలో అమేజింగ్ పర్సన్ ఎదురయ్యాడంటూ హారిస్ ను పొగిడేసిన టేలర్ కూడా ప్రస్తుత రిలేషన్ పై అంతగా స్పందించడం లేదు. పెళ్లంటే తనకు ఇష్టం లేదని హారిస్ గతంలో గర్ల్ ఫ్రెండ్స్ తో రిలేషన్ ఉన్నప్పుడు వెల్లడించాడు.


