-
ప్రాన్స్‌తో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు! అలా తింటే మాత్రం..
ప్రాన్స్ అంటే ఇష్టపడని వారుండారు. సీ ఫుడ్స్ బలవర్థకమైనవి రొయ్యలే. అలాంటి రొయ్యలు ఏ కూరగాయలతో వేసి వండినా..వాటి రుచే వేరు. తలుచుకుంటేనే నోట్లో నీళ్లూరిపోతాయి. అంత టేస్టీ..టేస్టీ రొయ్యలను వండకునేటప్పుడు జాగ్రత్త! అంటున్నారు నిపుణులు. ఆరోగ్యానికి ఎంత మేలు చేసే ఈ రొయ్యలను గనుక అలా తింటే ప్రాణాలు ప్రమాదంలో పడ్డట్టే అంటున్నారు వైద్యులు. రోయ్యలు రుచి పరంగానే కాదు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాటి రొయ్యలు సరిగా క్లీన్ చేసి తినకపోతే అలెర్జీలు ఎదుర్కొనాల్సి వస్తుంది. అంతేగాదు ఒక్కోసారి ప్రాణాంతకంగా కూడా మారుతుంది. అదేలా అంటే.. ఆ పార్ట్‌ని తొలగించకుంటే.. రొయ్యల వీపుపై ఉండే నల్లని రక్తనాళాలు తొలగించకపోతే తీవ్రమైన సమస్యలు రావచ్చు. వాటిని ఉన్నప్పుడు తినడం వల్ల మరణం కూడా సంభవించొచ్చు. అందుకే వాటిని వండుకునే ముందు చాలా జాగ్రత్తగా శుభ్రం చేసుకోవాలి.రొయ్యల మీద ఉండే నల్లటి రక్తనాళాలు తప్పనిసరిగా తొలగించాలి. ఇది వ్యర్థాలు, విషపదార్థాలను మోసే ఈ సముద్ర ఆహారాల పేగు మార్గం. ఈ సిరలను తొలగించకపోవడం లేదా పాక్షికంగా వాటిని తొలగించడం వలన తీవ్రమైన ఫుడ్ అలెర్జీ రావడమే కాదు, అదే సమయంలో ప్రాణాంతకం కూడా కావచ్చు. అందుకే అలాంటి అలర్జీలు రాకుండా ఉండాలంటే ఈ రక్తనాళాలని తప్పకుండా తొలగించాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నల్లని రక్తనాళాలు తొలగించకుండా తినడం వల్ల ఆహార అలర్జీకి దారి తీస్తుంది. అయితే అది తిన్న వెంటనే ఒక్కోసారి మీకు కనిపించకపోవచ్చు. అది పేగుల్లో వ్యర్థాలు, టాక్సిన్స్, రసాయనాలు రూపంలో ఉంటుంది. ఇవి మన జీర్ణవ్యవస్థ, పేగుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. వాటిని తొలగించకుండా వండుకుని తినడం వల్ల సడెన్‌గా చర్మంపై దద్దుర్లు రావాడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గురక, గొంతులో ఇబ్బంది తలెత్తవచ్చు. ఒక్కోసారి మరణం కూడా సంభవించే అవకాశం ఉంది. అయితే ఇవి తినడం వల్ల ప్రాణాలకి హాని జరుగుతుందనే విషయం తేల్చడానికి మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందని అన్నారు నిపుణులు. అందువల్ల రొయ్యలు తినేటప్పుడు ఈ నల్లటి రక్తనాళాన్ని తొలగించటం వంటి జాగ్రత్తలు తీసుకుని తినడం మంచిదని చెబుతున్నారు. రొయ్యల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.. బరువు నియంత్రణలో.. బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా తమ డైట్లో రొయ్యలను చేర్చుకోవాలి. ఎందుకంటే రొయ్యలు సులువుగా జీర్ణమవడంతో పాటు. శరీరంలో అదనపు కొవ్వును కరిగించి బరువు తగ్గేలా చేస్తాయి. ఇక గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా రొయ్యలతో లభిస్తాయి. అందువల్ల వారానికి ఒకసారైన రొయ్యల్ని తీసుకోవడం మంచిది. కేన్సర్‌కి చెక్.. వీటిలో సెలీనియం కంటెంట్ పుష్కలంగా ఉండటం వల్ల క్యాన్సర్ కణాలను శరీరంలోకి చొరబడకుండా నివారిస్తుంది. ప్రాణాంతక వ్యాధులతో పోరాడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న క్యాన్సర్ నియంత్రణకు రొయ్యలు మంచి ఆహారం. పుష్కలంగా పోషకాలు అలాగే దంతాలు, ఎముకలు బలంగా ఉండాలంటే కాల్షియం అవసరం అన్న సంగతి అందరికీ తెలిసిందే. రొయ్యలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందడంతో పాటు ఎముకలు, కండరాలు బలపడతాయి. చర్మ సౌందర్యానికి.. చర్మకాంతికి తోడ్పడే విటమిన్ ఇ రొయ్యల్లో ఉంటుంది. ఇది చర్మానికి కావలసిన పోషకాలను అందించి చర్మ కాంతిని మెరుగుపరుస్తుంది. రొయ్యల్లో విటమిన్ బి12 అధికంగా ఉంటుంది. తద్వారా మతిమరుపుని త్వరగా రానివ్వదు. అంతేకాకుండా శరీర నిర్మాణ కణాల అభివృద్ధికి ఉపకరించే శక్తి రొయ్యల్లో ఉంటుంది. (చదవండి: ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడు ఇతడే..ఆరోగ్య రహస్యమిదే..!) -
సెలబ్రిటీలు తాగే బ్లాక్ వాటర్ ఏంటీ? నార్మల్ వాటర్ కంటే మంచిదా..!
చాలా మంది సెలబ్రిటీలు.. బ్లాక్ వాటర్ తాగుతూ ఉన్న ఫొటోలు తెగ సందడి చేస్తున్నాయి. క్రికెటర్ విరాట్ కోహ్లీ నుంచి కరణ్ జోహార్, శృతి హాసన్ ఇలా ఎంతో మంది సెలబ్రిటీల వరకు చాలామంది ఈ నీటినే తాగుతున్నారు. ఎందుకు వాళ్లు ఈ నీటిని తాగుతున్నారు. దీని ప్రత్యేకత ఏంటి?. మాములు వాటర్‌కి దీనికి తేడా ఏంటీ అంటే.. బ్లాక్ వాటర్.. ఈ మధ్యకాలంలో చాలా ట్రెండ్ అవుతోంది. ముక్యంగా సెలబ్రెటీలు బ్లాక్ వాటర్ తాగుతున్న లేదా క్యారీ చేస్తున్న ఫోటోలే ఇందుకు కారణం. ఇక ఈ బ్లాక్ వాటర్ దగ్గర కొస్తే ఇది చూడటానికి బ్లాక్‌గా ఉంటుంది. అయితే ఈ వాటర్ తాగితే అప్పటి వరకు శరీరం కోల్పోయిన నీరు తక్షణమే భర్తీ అవుతుందట. ముఖ్యంగా వ్యాయామం వంటివి చేసినప్పుడు కోల్పోయిన నీరు తక్షణమే పొందడంలో తోడ్పడుతుంట. పైగా వీటిలో పోషకాల శాతం అధికంగా ఉంటాయి. దీని వల్ల ఒనగురే ఆరోగ్య ప్రయోజనాలేంటంటే.. డిటాక్స్ డ్రింక్‌గా.. ఈ బ్లాక్ వాటర్ శరీరం నుంచి విష పదార్థాలను బయటకు పంపించే డిటాక్స్ డ్రింక్‌గా పని చేస్తుంది. బ్లాక్ వాటర్‌లో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు.. శరీరంలో వ్యాధులకు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌ను బయటికి పంపించడంలో శక్తిమంతంగా పని చేస్తుంది. దీంతో వృద్ధాప్య ఛాయలు త్వరగా రావు. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.. బ్రాక్ వాటర్ శరీరంలో యాసిడ్ లెవెల్స్‌ని అదుపులో ఉంచుతుంది. ముఖ్యంగా జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. తీసుకున్న ఆహారం నుంచి సూక్ష్మ పోషకాలను శరీరం త్వరగా గ్రహించగలుగుతుంది. పైగా ఇమ్యూనిటీ పెరుగుతుంది. బరువు అదుపులో ఉంటుంది.. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటే జీవక్రియల పనితీరూ మెరుగుపడుతుంది. ఫలితంగా శరీరంలో కొలస్ట్రాల్ పెరగదు. అదీగాక బరువును కూడా సులభంగా అదుపులో ఉంచుకోవచ్చు. రోజంతా ఉత్సాహాంగా, హెల్తీగా ఉంటారు. నార్మల్ వాటర్‌తో ఈ ప్రయోజనాలు పొందగలమా..? నిపుణులు నార్మల్ వాటర్ తోకూడా ఇలాంటి ప్రయోజనాలనే పొందొచ్చని చెబుతున్నారు.ప్రతిరోజు కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగాలని చెబుతున్నారు. అలాగే రోజంతా శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచేలా 12-15 గ్లాసుల నీరు త్రాగాలని చెప్పారు. ఇక్కడ శరీరానికి తగినంత నీరు అందితే.. బ్లాక్ వాటర్ వల్ల పొందే ప్రయోజనాలనే మాములు వాటర్‌తో కూడా సొంతం చేసుకుంటామని అన్నారు. అలా అని డైరెక్ట్‌గా ట్యాప్ వాటర్ తాగొద్దని చెప్పారు. నార్మల్ వాటర్‌ని గోరువెచ్చగా లేదా కాచ చల్లార్చి తాగితే ప్రయోజనాలు పొందగలరిన తెలిపారు. ఇలా చేస్తే.. శరీరంలో టాక్సిన్స్ తొలుగుతాయిన చెప్పారు. ముఖ్యంగా మలబద్ధకం సమస్య దూరం అవుతుంది. దీంతోపాటు శశరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుందని అన్నారు. అంతేగాక మంచి జీర్ణక్రియ కోసం.. ఉదయాన్ని గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, చియా గింజలు వేసి తీసుకోంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందగలరని అన్నారు. బ్యాక్ వాటర్‌తో కలిగే దుష్ప్రయోజనాలు.. ఈ బ్లాక్ వాటర్ తాగితే ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. ఎక్కువగా తీసుకుంటే అంతే స్థాయిలో సైడ్ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో అధికి పీహెచ్ స్థాయిలు ఉంటాయి. దీని కారణంగా శరీరంలో ఆల్కలైన్ స్థాయులు పెరిగిపోయి.. గ్యాస్-ఉదర సంబంధిత సమస్యలు, వికారం, వాంతులు, చర్మ సమస్యలు, ఏకాగ్రత కోల్పోవడం వంటివి వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. దీనిలో ఉండే అధిక pH మీ చర్మాన్ని పొడిగా మార్చే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు. (చదవండి: లిప్ ఫిల్లింగ్ ట్రీట్మెంట్ మంచిదేనా? ఫెయిలైతే అంతేనా..!) -
వేసవిలో కుండలోని నీళ్లే ఎందుకు బెటర్?
వేసవిలో దాహార్తి మాములుగా ఉండదు. ఎంతలా అంటే ఏం తిన్నా ముందుగా దాహం అనిపించేస్తుంది. దీనిక తోడు బయట ఎండ ధాటికి తట్టుకోలేక చలచల్లగా నీళ్లు ఉంటే చాలనిపిస్తుంది. అందుకని ఫ్రిజ్‌లోని బాటిళ్లను ఖాళీ చేసేస్తుంటాం. అయితే చాలామంది కుండలోని నీళ్లే మంచిది అంటారు. ఫ్రిజ్‌లోని నీరు అస్సలు తాగొద్దని హెచ్చరిస్తుంటారు నిపుణులు. అసలు కుండలోని నీళ్లే ఎందుకు బెటర్ అంటే.. వేసవి రాగానే చల్లదనాన్ని అందించే కూలర్లు, ఏసీల అమ్మకాలు ఊపందుకుంటాయి. ఇదే సమయంలో ఫ్రిజ్ అమ్మకాలు కూడా పెరుగుతాయి. నేడు ప్రతి ఇంట్లో ప్రిజ్ తప్పనిసరిగా ఉంటుంది. కూరగాయలు ఇతర పదార్థాలను స్టోర్ చేసుకోవడంతో పాటు ఇందులో నీటిని కూడా ఉంచి చల్లగా చేసుకుంటాం. అయితే ఫ్రిజ్ నీరు తాగడం అంత మంచిది కాదని కొందరు ఆరోగ్య నిపుణులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. పూర్వకాలంలో వేసవిలో ఎక్కువగా మట్టితో చేసిన కుండ నీరు తాగేవారు. ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో కుండ నీరే తాగుతున్నారు. వేసవిలో కుండ నీరు మాత్రమే చల్లగా ఉంటాయి. ఓపెన్ ప్లేసులో పెట్టడం వల్ల ఇవి మరింత చల్లగా మారుతాయి. ముఖ్యంగా మట్టిలో ఎక్కువగా మినరల్స్ ఉంటాయి. అందువల్ల కుండనీరు తాగగానే అవన్నీ నేరుగా శరీరంలోకి వెళ్లి మేలు చేస్తాయి. అందువల్ల ఫ్రిజ్ నీరు కంటే కుండలోని నీళ్లే ఆరోగ్యానికి మంచిది. రిఫ్రిజిరేటర్ నీరు మోతాదుకు మించి చల్లదనం ఉంటుంది. దీంతో శరీరంలోని కొన్ని కణాలు దెబ్బతింటాయి. కుండలో నీరు అయితే సమపాళ్లలో చల్లగా ఉంటాయి. దీంతో ఇవి తాగడం వల్ల ఎలాంటి హాని జరగదు. రెగ్యులర్‌గా కుండలో నీరు తాగడం వల్ల ఎలాంటి జీర్ణ సమస్యలు ఉండవు. ఫ్రిజ్ లో నీరు ఎక్కువగా తాగితే శరీరంలో వేడి అనూహ్యంగా పెరుగుతుంది. చలవ చేయడం మాటే అటుంచి అందులోనూ ఈ వేసిలో వేడిచేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో తెలియంది కాదు. అందువల్ల కుండలోని నీటికే ప్రాధాన్యత ఇవ్వడం మంచిది నిపుణులు సూచిస్తున్నారు. అదీగాక మట్టి కుండలో నీరు తాగడం వల్ల జీవ క్రియలు పెరుగుతాయి. పైగా ఆరోగ్యంగా కూడా ఉంటారు. (చదవండి: Fennel Seeds: సొంపుతో ఇన్ని లాభాలా? ఐతే దీన్ని..!) -
ఇంగువతో ఇన్ని లాభాలా? బరువును తగ్గించే మ్యాజిక్ డ్రింక్
అసాఫెటిడా, హింగ్ లేదా ఇంగువగా ప్రసిద్ధి చెందింది. రుచి , ఘాటైన వాసనతో ఉండే భారతీయ వంటకాల్లో వాడే కీలకమైన సుగంధ ద్రవ్యం. పూర్వకాలం నుంచే భారతీయులు సుగంధ ద్రవ్యాలను ఎక్కువగా ఉపయోగించేవారు. ఇంగువను ప్రతిరోజు వంటకాలలో ఉపయోగిస్తే శరీరానికి మంచిదని ఆయుర్వేద గుణాలు పుష్కలంగా ఉన్నాయని ఆయుర్వేదం చెబుతోంది. దీని వల్ల ఆరోగ్య ప్రయోజనాలు, దుష్ప్రభావాలు గురించి తెలుసుకుందాం. సాంబారు, పప్పు, పులుసుకూరలు, పచ్చడి తాలింపులలో మాత్రమే వాడుతారు అనుకుంటే పొరపాటే. మంచి వాసన, రుచితోపాటు, ఇంగువ అనేక రకాల ఆరోగ్య సమస్యలను నయం చేస్తుంది. ఇంగువ ఆరోగ్య ప్రయోజనాలు బరువు తగ్గడానికిమ్యాజిక్ డ్రింక్: ఇంగువ నీరు తాగడం వల్ల బరువు త్వరగా తగ్గుతారు. ఇంగువలో ఫైబర్, కార్బోహైడ్రేట్, ప్రొటీన్, ఐరన్, కాల్షియం మొదలైనవి పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఇంగువ నీరు మ్యాజిక్‌లా పనిచేస్తుందని చెబుతారు. ♦జీర్ణక్రియనుమెరుగుపరుస్తుంది గ్యాస్, ఉబ్బరం, అపానవాయువు వంటి కడుపు రుగ్మతల నివారణలో ఉపయోగపడుతుంది. కడుపు పూత,కడుపులో నులి పురుగుల సమస్యతో బాధపడేవారు ఇంగువ వాడి, దీన్ని అధిగమించవచ్చు. ఛాతీపై పూయడం వల్ల ఆస్తమా, కోరింత దగ్గు, ఊపిరితిత్తుల వాపు నుంచి ఉపశమనం లభిస్తుంది. ♦ యాంటీవైరల్ , యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉన్న కారణంగా ఇది ఉబ్బసం, బ్రోన్కైటిస్, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం అందిస్తుంది. ♦ ఇంగువ సహజ యాంటిడిప్రెసెంట్.ఒత్తిడి ,ఆందోళన, డిప్రెషన్‌తో బాధపడేవారికి ఇంగువ మంచి మందు. ♦లైంగిక సమస్యలకు: నపుంసకత్వ సమస్యలలో బాధపడుతున్న పురుషులకు ఇది బాగా సహాయపడుతుంది. అకాల స్కలన సమస్యకు కూడా బాగా పనిచేస్తుందని అని నిపుణులు చెబుతున్నారు. స్త్రీ,పురుషుల్లో లైంగిక వాంఛను గణనీయంగా పెంచుతుందట కేన్సర్ ప్రమాదం: కేన్సర్ కణితి, పరిమాణాన్ని తగ్గించడంలో ఇంగువ బాగా ప్రయోజనకరంగా ఉంటుంది. కేన్సర్ వ్యాప్తిని అరికడుతుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కేన్సర్ కణాలతో పోరాడుతాయి. ♦ఊపిరితిత్తులు, కాలేయం ,మూత్రపిండాలలో మెటాస్టాసిస్ నివారణలో పనిచేస్తుంది. మెదడులోని రక్త నాళాలలో ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంలో సహాయ పడుతుంది. తలనొప్పిని తగ్గిస్తుంది. ♦ యాంటీ ఏజింగ్: చర్మం ముడతలు, కళ్ల క్రింద నల్లటి వలయాలు ముఖంపై ముడతలను కూడా తొలగిస్తుంది. ఇందులోని టైరోసిన్ నిస్తేజమైన చర్మానికి మెరుపునిస్తుంది. ♦ రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాలను తగ్గిస్తుంది కీళ్ల నొప్పి, వాపు తగ్గించే అనాల్జేసిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ,రిలాక్సింగ్ లక్షణాలను కలిగి ఇంగులో ఉన్నాయి. ♦ పీరియడ్స్ సమయంలో తీవ్రమైన నొప్పి లేదా తిమ్మిరితో బాధపడుతుంటే ఇంగువ దివ్యవౌషధంలా పనిచేస్తుంది. ఇందులో ఉండే మూలకాలు బహిష్టు సమయంలో నొప్పిని తగ్గించడంతో పాటు ఇతర సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడతాయి. ♦ పంటి నొప్పికి కూడా ఇంగువ మంచి ఫలితాలనిస్తుంది.ఇంగువలో నొప్పి నివారణ గుణాలు అలాగే యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి నొప్పి తగ్గించి ఉపశమనాన్ని అందిస్తాయి. -
మధుమేహం : ఈ సూపర్ ఫుడ్‌తో చెక్ చెప్పొచ్చు!
ప్రస్తుత కాలంలో డయాబెటిస్ సమస్య అందరిలోనూ కనిపిస్తోంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ముఖ్యంగా జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల మధుమేహం సమస్య నానాటికి పెరిగి పోతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. మధుమేహం విషయంలో, రక్తంలో చక్కెర స్థాయులను సాధారణంగా ఉండేలా చూసుకోవడం మొదటి ప్రాధాన్యతగా తీసుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయి తగ్గించుకోవడానికి కొన్ని సూపర్‌ఫుడ్‌ల సహాయం తీసుకోవచ్చు. అవేంటో చూద్దామా... దాల్చిన చెక్క: రక్త ప్రవాహంలో చక్కెర కదలికను పెంచడం ద్వారా మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. సొరకాయ: సొరకాయలో 92శాతం నీరు, 8శాతం ఫైబర్ ఉంటుంది. దీనిలో గ్లూకోజ్, చక్కెర సంబంధిత సమ్మేళనాల పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. ఇది డయాబెటిక్ రోగులకు అద్భుతమైన కూరగాయగా పరిగణిస్తారు. కాకరకాయ: రుచికి చేదుగా ఉండే కాకరకాయలో పాలీపెప్టైడ్–పి ఉంటుంది. ఇది ఇన్సులిన్ లాంటి హైపోగ్లైసిమిక్ ప్రొటీన్. ఇది కణాలలోకి గ్లూకోజ్‌ని తీసుకురావడంలో సహాయపడుతుంది. మెంతులు: ఇవి ఫైబర్, ఇతర రసాయనాలను కలిగి ఉంటాయి. ఇవి జీర్ణక్రియను నెమ్మదిస్తాయి. శరీరంలోని కార్బోహైడ్రేట్లు, చక్కెరను గ్రహించడంలో సహాయపడతాయి. దీని కారణంగా రక్తంలో చక్కెర సాధారణంగా ఉంటుంది. ఆకు కూరలు: ఈ కూరగాయలలో ఫైబర్, మెగ్నీషియం, విటమిన్ ఎ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెరను తగ్గించడంలో సహాయపడతాయి. జొన్నలు, రాగులు: జొన్నలు, రాగులు వంటి చిరుధాన్యాలలో డయాబెటిస్‌ను నియంత్రించే కారకాలు ఉంటాయి. రాగి జావ, జొన్న రవ్వతో చేసిన ఉప్మా, జొన్న రొట్టెలు, రాగి జావ, రాగి రొట్టెలు తీసుకోవడం డయాబెటిక్స్‌కు చాలా మంచిది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్‌తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement