breaking news
Ashmita Karnani
-
వయసెంతో చెప్పి షాకిచ్చిన తెలుగు సీరియల్ నటి
సాధారణంగా ఆడపిల్లలు, మహిళలు తమ వయసు దాచుకునే ప్రయత్నం చేస్తారు. ఎన్ని ఏళ్లు అనేది అస్సలు చెప్పుకోరు. వేరే ఎవరు అడిగినా చెప్పేందుకు పెద్దగా ఇష్టపడరు. సెలబ్రిటీలు అయితే ఎప్పుడూ యంగ్‌గా కనిపించాలని తెగ తాపత్రయపడుతుంటారు. కానీ తెలుగు సీరియల్ నటి మాత్రం నిర్భయంగా తన వయసుని బయటపెట్టింది. ఇది కోల్పోయేది కాదు సంపాదించుకునేది అని ఆసక్తికర స్టేట్మెంట్ ఇచ్చింది.(ఇదీ చదవండి: బ్రేకప్ చెప్పేసుకున్న బిగ్‌బాస్ తెలుగు జంట పవన్-రీతూ)గతంలో 'పద్మవ్యూహం', 'మేఘసందేశం', 'మనసు మమత' తదితర సీరియళ్లలో నటించిన అస్మిత.. మొత్తంగా 15కి పైగా చేసింది. 2019లో కొరియోగ్రాఫర్ సుధీర్‌ని పెళ్లి చేసుకున్న ఈమె.. తర్వాత ఏడాది అంటే 2020 మేలో నటనకు వీడ్కోలు చెప్పేసింది. ప్రస్తుతం సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానెల్‌తో అభిమానులకు టచ్‌లో ఉంటోంది. అయితే తన వయసు 46 ఏళ్లు అని చెప్పి నెటిజన్లకు షాకిచ్చింది. ఈ మేరకు ఇన్ స్టాలో ఓ పోస్ట్ పెట్టింది.'ఈ రోజు నేను నన్ను నేను సెలబ్రేట్ చేసుకుంటున్నాను. చాలా ఏళ్లుగా నా వయసెంతో ఎప్పుడూ చెప్పలేదు. వయసు పెరగడం దాచుకోవాల్సిన విషయం అని మనల్ని నమ్మించేలా చేశారు. కానీ ఈ రోజు నేను 46 ఏళ్ల వయసులో ఉన్నాను. నా జీవితంలో నేను గడిపిన, ఎదుర్కొని నిలబడిన ప్రతి ఏడాది గురించి గర్వపడుతున్నా. నన్ను తీర్చిదిద్దిన అనుభవాలు, నాకు పాఠాలు నేర్పిన తప్పులు, నేను అందించిన, అందుకున్న ప్రేమ, అన్నింటికంటే ముఖ్యంగా ఈ ప్రయాణంతో మారిన వ్యక్తిత్వం గురించి గర్వపడుతున్నాను''నేను మళ్లీ చిన్నప్పటికి వెళ్లాలని కోరుకోవడం లేదు. నా జీవితంలో గడిచిన సంవత్సరాలని చెరిపివేయాలని అనుకోవడం లేదు. ఈ కొత్త దశలోనూ నేర్చుకుంటూ, ఎదుగుతూ, మారుతూ 100 శాతం వ్యక్తిత్వంతో జీవించాలని కోరుకుంటున్నాను. వయసు కోల్పోయేది కాదు. నేను సంపాదించుకునేది. అదే నా జీవితంలో అతిపెద్ద గర్వకారణం' అని అస్మిత రాసుకొచ్చింది. అయితే అస్మిత పోస్ట్ చూసిన కొందరు.. అంత వయసులా ఈమె కనిపించడం లేదే అని మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: వరదల్లో కొట్టుకుపోయిన 'ఇరుముడి' బ్రిడ్జి) View this post on Instagram A post shared by Ashmita karnani (@ashmita_9) -
పర్సనల్ విషయాల్లో తలదూర్చాడు.. వార్నింగ్ ఇచ్చా: నటి
నటి అష్మిత (Ashmita karnani).. ఇటు బుల్లితెర, అటు వెండితెరపైనా రాణించింది. బాబీ, వర్షం, మధుమాసం, మురారి, ఓం నమో వెంకటేశాయ, కాటమరాయుడు, అతిథి.. ఇలా అనేక చిత్రాల్లో నటించింది. బుల్లితెరపై చంద్రముఖి, ముద్దు బిడ్డ, ఆకాశగంగ, శ్రావణ సమీరాలు, మనసు మమత, అగ్నిసాక్షి, మధుమాసం వంటి సీరియల్స్ చేసింది. చాలాకాలం కిందటే నటనకు గుడ్‌బై చెప్పేసి యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ వస్తోంది. ఇటీవల యూట్యూబ్‌లో అప్లోడ్ చేసిన వీడియోలో తనకు ఎదురైన చేదు అనుభవాలను చెప్పుకొచ్చింది.నన్నే చూస్తూ..నా అసిస్టెంట్ ఊరెళ్లినప్పుడు మరో వ్యక్తిని అతడి స్థానంలో పెట్టి వెళ్లాడు. అతడు సిన్సియర్‌గానే ఉండేవాడు. కానీ రానురానూ తనకు నాపై పొజెసివ్‌నెస్ మొదలైంది. ఎప్పుడూ నాకు ఎదురుగా నిలబడి నన్నే చూస్తూ ఉండేవాడు. ఓసారి అతడిని ఫ్రూట్స్ తీసుకురమ్మని చెప్పాను. సెట్లో మేము ఏది తెచ్చుకున్నా అందరం పంచుకునేవాళ్లం. అలా ఆ ఫ్రూట్స్‌ను అందరితో షేర్ చేసుకున్నాను. అది చూసి ఫ్రస్టేట్ అయిపోయేవాడు. ఒకరోజు కోపంతో పిలిచి.. మేడమ్, నేను మీకోసం పండ్లు తీసుకొస్తే వాళ్లకిస్తున్నారేంటి? అని నిలదీశాడు. జోక్యం చేసుకోవద్దని వార్నింగ్నీ పని నువ్వు చూసుకో.. నేను వాళ్లకిస్తా, వాళ్లు నాకిస్తారు. మధ్యలో నీకేంటి సమస్య? అని తిట్టాను. మరో రోజు ఓ నటి మిస్డ్ కాల్ ఉంటే.. ఫోన్ చేయబోయాను. ఇంతలో అతడు.. ఆమెకు ఫోన్ చేయొద్దు, ఆమె నన్ను ఏంట్రా?.. అని పిలుస్తుందని అభ్యంతరం చెప్పాడు. నా వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవద్దు అని మళ్లీ వార్నింగ్ ఇచ్చాను. మరో రోజు నా ఫ్రెండ్‌తో చాలాసార్లు ఫోన్ మాట్లాడాను. అది గమనించిన అతడు నా ఫోన్లో నెంబర్ తీసుకుని ఫోన్‌బూత్‌లో నుంచి కాల్ చేశాడు. మీరెవరు? ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? అని ప్రశ్నించాడు. పనిలో నుంచి తీసేశాఆ తర్వాత షూటింగ్ లేకపోయినా నాకు ఫోన్లు చేసేవాడు. నాకు కాల్ చేయొద్దని కరాఖండి చెప్పాను. అతడి సైకోనెస్ చూసి రేపటినుంచి రావొద్దంటూ మరో అసిస్టెంట్‌ను పెట్టుకున్నాను. తీరా సెట్‌కు వెళ్లాక అక్కడి కాస్ట్యూమ్ డిజైనర్.. అతడిని అసిస్టెంట్‌గా తీసేయొద్దు అని బతిమాలుతున్నారు. అరె, మీ బాధేంటి? అని అడిగితే.. మేడమ్‌కు మీరైనా సర్ది చెప్పండి అంటూ రాత్రంతా ఆయన ఇంటిముందు ఏడ్చుకుంటూ ఉన్నాడట! వారం రోజులపాటు అదే పని చేశాడు. తర్వాత ఇక రాలేదట.. మేకప్ ఆర్టిస్ట్‌గా సెటిలయ్యాడని విన్నాను.అతడొస్తే నేను రానుఇండస్ట్రీలో ఓ నటుడు నన్ను ప్రేమించాడు. నేను కాల్ చేస్తే ఐ లవ్యూ అష్మిత అని రింగయ్యేది. చెత్తగా అనిపించేది. నాకతను అస్సలు నచ్చేవాడు కాదు. మా ఇద్దరి మధ్య ఏదో ఉందని అతడే రూమర్లు సృష్టించాడు. ఆ విషయం నాకు తెలిసింది. ఓ షోకి నాతో పాటు ఆ నటుడిని కూడా పిలిచారు. అతడొస్తే నేను రానని చెప్పేశాను. ఇప్పటికే పుకార్లు ఎక్కువయ్యాయి. కాబట్టి ఇప్పట్లో మీతో కలిసి ఏ ప్రాజెక్టులూ చేయనని చెప్పేశాను. అప్పటికే నేను కొరియోగ్రాఫర్ సుధీర్‌తో లవ్‌లో ఉన్నాను అని పేర్కొంది. తర్వాత సుధీర్‌నే పెళ్లి చేసుకుని సెటిలైంది అష్మిత.చదవండి: నిహారిక విడాకులు.. తప్పు నాదే!: నాగబాబు


