-
Anu Emmanuel: అందానికి చీర కడితే అను ఇమ్మాన్యుయేల్లా ఉంటుందేమో (ఫోటోలు)
-
Anu Emmanuel Pics: అను ఇమ్మాన్యుయేల్ టెంప్టింగ్ ఫోజులు (ఫొటోలు)
-
Japan Review: ‘జపాన్’ మూవీ రివ్యూ
టైటిల్: జపాన్ నటీనటులు: కార్తి, అను ఇమ్మాన్యుయేల్, సునీల్, విజయ్ మిల్టన్ తదితరులు నిర్మాణ సంస్థ: : డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాతలు: ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు దర్శకత్వం: రాజు మురుగన్ సంగీతం: జీవి ప్రకాష్ కుమార్ సినిమాటోగ్రఫి: ఎస్. రవి వర్మన్ ఎడిటింగ్: ఫిలోమిన్ రాజ్ విడుదల తేది: నవంబర్ 10, 2023 కథేంటంటే.. జపాన్ ముని అలియాస్ జపాన్(కార్తి) ఓ గజదొంగ. గోడలకు కన్నం వేసి దొంగతనం చేయడం.. గుర్తుగా అక్కడ ఓ బంగారు కాయిన్‌ను పెట్టి వెల్లడం అతని స్పెషాలిటీ. ఓ సారి హైదరాబాద్‌లోని రాయల్ అనే నగల దుకాణం నుంచి రూ. 200 కోట్ల విలువ చేసే గోల్డ్‌ని కొట్టేస్తారు. ఆ గోల్డ్ షాపులో తెలంగాణ హోమంత్రి సత్యమూర్తి(కేఎస్ రవికుమార్) షేర్ కూడా ఉండడంతో పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఈ కేసు విచారణకై స్పెషల్ ఆఫీసర్స్ భవాని(విజయ్ మిల్టన్), శ్రీధర్(సునీల్) రంగంలోకి దిగుతారు. మరోవైపు కేరళ, కర్ణాటక పోలీసులు కూడా జపాన్ కోసం వెతుకుతుంటారు. అసలు ఆ దొంగతనం ఎవరు చేశారు? జపాన్ దొంగగా మారడానికి గల కారణం ఏంటి? దోచుకున్న డబ్బు, బంగారం ఏం చేశాడు? శ్రీధర్‌తో పాటు మరికొంతమంది పోలీసు అధికారులు జపాన్‌కి ఎందుకు సహాయం చేశారు? పోలీసులకు చెందిన రహస్యాలు జపాన్ దగ్గర ఏం ఉన్నాయి? చివరకు జపాన్ జీవితం ఎలా ముగిసింది? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో ‘జపాన్’ సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. కార్తి నటించిన 25వ సినిమా కావడంతో ‘జపాన్’పై ముందు నుంచే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు టీజర్, ట్రైలర్ కూడా అద్భుతంగా ఉండడంతో ఈ చిత్రం కచ్చితంగా ఢిపరెంట్‌గా ఉంటుందని భావించారు. అయితే సినిమా మాత్రం ఆ రేంజ్లో లేదనే చెప్పాలి. ఓ భారీ నగల దుకాణంలో దొంగతనం సీన్‌తో సినిమా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత ఈ కేసును ఛేదించడానికి భవానీ, శ్రీధర్ పాత్రలు రావడం..వారికి సంబంధించిన సీన్స్ చూసి ఇది సీరియస్‌గా సాగే పోలీసు-దొంగ కథలా అనిపిస్తుంది. అయితే హీరో ఎంట్రీ తర్వాత మాత్రం ఇది క్యాట్- మౌస్ తరహాలో సాగే యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ అని అర్థమవుతుంది. దొంగతనం చేసిన డబ్బులతో హీరోగా సినిమాలు చేసే వ్యక్తిగా కార్తిని పరిచయం చేశారు. కార్తి డైలాగ్ డెలివరీ, గెటప్ రెండూ డిఫరెంట్‌గా ఉండడంతో కథపై ఆసక్త పెరుగుతుంది. ఒక పక్క జపాన్ స్టోరీ నడిపిస్తూనే.. మరోపక్క ఇన్వెస్టిగేషన్ పేరుతో సామాన్యుడు గంగాధర్‌ని పోలీసులు పెట్టే టార్చర్‌ని చూపిస్తూ.. ఏదో జరుగబోతుందనే ఆసక్తిని కలిగించారు. ఊహించని ట్విస్టులేవో ఉంటాయనుకున్న ప్రేక్షకుడి అక్కడ నిరాశే కలుగుతుంది. హీరోకి ఎయిడ్స్ ఉందని స్టార్టింగ్‌లోనే చెప్పించి.. ఏదో జరుగుతుందనే క్యూరియాసిటీని ప్రేక్షకుల్లో కలిగించారు. కానీ దానికి సరైన ముగింపు ఇవ్వలేదు. వెన్నుపోటు సన్నివేశాలను కూడా బలంగా రాసుకోలేకపోయాడు. ఇక హీరోయిన్ సంజుతో జపాన్ లవ్‌ట్రాక్ కూడా అంతగా ఆకట్టుకోలేదు. ఫస్టాఫ్‌లో వచ్చే కామెడీ సీన్స్ కొన్ని చోట్ల మాత్రమే నవ్విస్తాయి. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ద్వితియార్థంలో కాస్త ఎమోషనల్‌గా సాగుతుంది. సినిమా కథ అంటూ తను దొంగగా ఎందుకు మారాడో చెప్పే సీన్ ఆకట్టుకుంటుంది. ఇక క్లైమాక్స్‌లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఎమోషనల్‌కు గురిచేస్తాయి. ఎవరెలా చేశారంటే.. కార్తి నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి పాత్రలోనైనా జీవించేస్తాడు. జపాన్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. ఆయన గెటప్, డైలాగ్ డెలివరీ కొత్తగా ఉంటాయి. సినిమా కోసం కార్తి పడిన కష్టం తెరపై కనిపిస్తుంది. హీరోయిన్ సంజు పాత్రకు అను ఇమ్మాన్యుయేల్ ఉన్నంతలో న్యాయం చేసింది. ఆ పాత్ర నిడివి చాలా తక్కువనే చెప్పాలి. పోలీసు అధికారి శ్రీధర్‌గా సునీల్ కొన్ని చోట్ల భయపెట్టాడు..మరికొన్ని చోట్ల తేలిపోయాడు. అయితే ఆయన పాత్రను తీర్చిదిద్దిన విధానం బాగుంది. భవాని పాత్రకు విజయ్ మిల్డన్ న్యాయం చేసే ప్రయత్నం చేశాడు. జపాన్ కోసం పోలీసులు అరెస్ట్ చేసిన సామాన్యుడు గంగాధర్ పాత్రను పోషించిన వ్యక్తి నటన బాగుంది. కెఎస్ రవికుమార్‌తో పాటు మిగిలి నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం పర్వాలేదు. పాటలు ఆకట్టుకోలేదు కానీ నేపథ్యం సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సిందే. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
అవార్డుల కంటే ప్రేక్షకుల గుర్తింపే ముఖ్యం
‘‘అవార్డుల కోసం సినిమాలు తీయాలనే ఆలోచన నాకు ఉండదు. ప్రేక్షకులు ఇచ్చే గుర్తింపు, ప్రేమ, అభిమానం, ఆప్యాయత చాలా ముఖ్యం. అవార్డులు వస్తే అదనపు బోనస్‌గా భావిస్తాను. ప్రేక్షకుల ప్రేమ, అభిమానంతో పాటు ‘జోకర్’ చిత్రానికి జాతీయ అవార్డు తీసుకోవడం నాకు గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. ‘జపాన్’ కూడా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుంది’’ అని దర్శకుడు రాజు మురుగన్ అన్నారు. కార్తీ, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన చిత్రం ‘జపాన్’. ఎస్ఆర్ ప్రకాశ్‌బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ సినిమా నేడు రిలీజవుతోంది. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో అన్నపూర్ణ స్టూడియోస్ విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా రాజు మురుగన్ మాట్లాడుతూ– ‘‘నేను సినిమాల్లోకి రావడానికి చార్లీ చాప్లిన్‌గారే స్ఫూర్తి. మూకీ చిత్రాలతోనే ఎన్నో ఆలోచనలు, భావోద్వేగాలను రేకెత్తించారు ఆయన. ఇక కార్తీగారిని దృష్టిలో పెట్టుకునే ‘జపాన్’ కథ రాశాను. కార్తీ, నిర్మాతలు ప్రభు, ప్రకాశ్‌గార్ల సహకారంతోనే ‘జపాన్’ చిత్రం ఇంత గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది. ఒక దర్శకుడిగా చిన్నా పెద్దా అని కాకుండా అన్ని రకాల సినిమాలు చేయాలనుకుంటున్నాను’’ అన్నారు. -
దీపావళి నాకు కలిసొచ్చిన పండగ.. జపాన్ విజయం ఖాయం: కార్తీ
క్వాంటిటీ కంటే క్వాలిటీకే ప్రాముఖ్యతనిచ్చే నటుడు కార్తీ. అందుకే నటుడిగా పరిచయం అయ్యి సుమారు 18 ఏళ్లు కావస్తున్నా.. ఇప్పుటికి 25 చిత్రాలే చేశారు. అయితే ప్రస్తుతం వరుసగా చిత్రాలు చేస్తున్నారు. ఈయన ఇటీవల నటించిన విరుమాన్, సర్థార్, పొన్నియిన్‌సెల్వన్ పార్టు 1, 2 చిత్రాలు మంచి విజయాన్ని సాధించారు. కాగా కార్తీ తాజాగా కథానాయకుడిగా నటించిన చిత్రం జపాన్. ఇది ఈయన 25వ చిత్రం కావడం విశేషం. రాజుమురుగన్ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్.ప్రకాశ్‌బాబు, ఎస్ఆర్.ప్రభు నిర్మించిన ఈ భారీ చిత్రానికి జీవీ.ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని ,రవివర్మన్ ఛాయాగ్రహణను అందించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం దీపావళి పండగ సందర్భంగా శుక్రవారం తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా నటుడు కార్తీ చైన్నెలో మీడియాతో ముచ్చటించారు. ఆయన మాట్లాడుతూ జపాన్ చిత్రం తనకు చాలా స్పెషల్ అని పేర్కొన్నారు. దర్శకుడు రాజుమురుగన్ కథ,సంభాషణలు తనకు చాలా నచ్చాయన్నారు. జపాన్ చిత్రంలో కార్తీ కనిపించడని, పాత్రే కనిపిస్తుందని అన్నారు. ఇంతకు ముందు కాశ్మోరా చిత్రంలో భిన్నమైన పాత్రను పోషించినా జపాన్‌లో పూర్తిగా వైవిధ్యభరిత కథా పాత్రను చేసినట్లు చెప్పారు. జీవీ.ప్రకాశ్‌కుమార్ సంగీతం, రవివర్మన్ ఛాయాగ్రహణ చిత్రానికి పక్కా బలంగా ఉంటాయన్నారు. నటుడు సునీల్, విజయ్ మిల్టన్ లతో కలిసి నటించడం మంచి అనుభవంగా పేర్కొన్నారు. ఇక దీపావళి తనకు కలిసొచ్చిన పండగ అని, ఈ పండగ సందర్భంగా జపాన్ చిత్రం విడుదల కావడం సంతోషంగా ఉందని చెప్పారు. జపాన్ చిత్ర విజయంపై చాలా నమ్మకం ఉందనే అభిప్రాయాన్ని కార్తీ వ్యక్తం చేశారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్‌కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement