-
అతిపెద్ద విమానం వచ్చిందోచ్..!
- దేశంలోనే తొలిసారిగా శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండింగ్ - ఖాళీ విమానం 300 టన్నుల ఇంధనాన్ని నింపుకొని ఆగకుండా18,000 కి.మీ. ప్రయాణించగలదు - గరిష్టంగా 640టన్నుల బరువును మోసుకుంటూ గాలిలోకి ఎగరగలదు. - విమానం పొడవు 84 మీటర్లు, రెక్కలతో కలిపి వెడల్పు 88.4 మీటర్లు. దాదాపు రెండు ఫుట్‌బాల్ మైదానాల స్థలాన్ని ఈ విమానం ఆక్రమిస్తుంది. (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) శంషాబాద్: ప్రపంచంలోనే అతిపెద్దదైన ‘ఆంటోనోవ్ ఏఎన్-225 మైరియా’ కార్గో విమానం భారతదేశంలో తొలిసారిగా హైదరాబాద్‌లో అడుగిడింది. గురువారం అర్ధరాత్రి 12.05 గంటలకు శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దీనిని ల్యాండ్ చేశారు. 240 ప్రపంచ రికార్డులు కలిగిన ఏన్-225 రాకతో శంషాబాద్ విమానాశ్రయ అధికారులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. చెక్ రిపబ్లిక్ ప్రాగ్లో తయారైన 117 టన్నుల బరువైన పవర్ జనరేటర్‌ను తుర్క్‌మెనిస్థాన్‌లోని తుర్కమెంబాషి విమానాశ్రయం నుంచి ఆస్ట్రేలియాలోని పెర్త్‌కు ఈ విమానం తీసుకెళుతోంది. 24 గంటల విశ్రాంతి అనంతరం శుక్రవారం రాత్రి 11 గంటల తర్వాత బయలుదేరనుంది. ఇండోనేషియాలోని జకార్తాలో మరోసారి విశ్రాంతి తీసుకుని.. ఆదివారం పెర్త్‌కు చేరుకోనుంది. ప్రపంచంలో ప్రస్తుతం సర్వీసులో ఉన్న అతిపెద్ద రవాణా విమానం ఇదే. ఆరు టర్బో ఇంజన్లతో పనిచేస్తుంది. ఆరుగురు సిబ్బంది నియంత్రిస్తారు. గరిష్టంగా 640 టన్నుల బరువును మోసుకుంటూ గాలిలోకి ఎగరగలదు. విమానం పొడవు 84 మీటర్లు, రెక్కలతో కలిపి వెడల్పు 88.4 మీటర్లు. దాదాపు రెండు ఫుట్‌బాల్ మైదానాల స్థలాన్ని ఈ విమానం ఆక్రమిస్తుంది. దీని ఎత్తు 18.1 మీటర్లు. అంటే ఆరు అంతస్తుల భవనంతో సమానం. ఆకాశంలో 11 కిలోమీటర్ల ఎత్తులో గరిష్టంగా గంటకు 850 కిలోమీటర్ల వేగంతో ఇది దూసుకెళ్లగలదు. ఖాళీ విమానం 300 టన్నుల ఇంధనాన్ని నింపుకొని ఎక్కడా ఆగకుండా 18,000 కిలోమీటర్లు ప్రయాణించగలదు రవాణా చేసే కార్గో బరువును బట్టి ఇంధనాన్ని తగ్గిస్తారు. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం కాకముందు.. దానిలో భాగమైన ఉక్రెయిన్‌లో 1980 దశకంలో ఈ భారీ విమానం తయారీని ప్రారంభించారు. అసలు దీనిని తయారు చేసింది మాత్రం సరుకు రవాణా కోసం కాదు.. సోవియట్ స్పేస్ షటిల్ ‘ది బ్యూరాన్’ను తరలించడం కోసం. 1988 డిసెంబర్ 21న ఇది తొలిసారిగా ప్రయాణించింది. కొన్ని కారణాలతో 1994లో పక్కనపెట్టారు. 2001లో దీనికి కొత్త ఇంజన్లు అమర్చి, పునరుద్ధరించాక తిరిగి ప్రయాణం మొదలుపెట్టింది. ఆస్ట్రేలియాలో వర్స్‌లీ అల్యూమినా అనే అల్యూమినియం మైనింగ్ సంస్థకు 117 టన్నుల భారీ పవర్ జనరేటర్‌ను రవాణా చేయడానికి అంతర్జాతీయ లాజిస్టిక్స్ (రవాణా) కంపెనీ ‘డీబీ చెంకర్’ ఈ విమానాన్ని ఆంటోనోవ్ సంస్థ నుంచి అద్దెకు తీసుకుంది. ఈ విమానం ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో దిగే సమయాన్ని సంబరంగా జరుపుకొనేందుకు అక్కడి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 50 వేల మంది ఈ విమానాన్ని చూడడానికి రానున్నారు. ఇందుకోసం రన్‌వే సమీపంలో ప్రత్యేకంగా వేదికలూ నిర్మిస్తున్నారు. -
హైదరాబాద్ లో ల్యాండ్ అయిన అతిపెద్ద విమానం
హైదరాబాద్ : ప్రపంచంలోనే అతిపెద్దదైన కార్గో విమానం శుక్రవారం రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ప్రపంచంలోనే అతి పెద్దదైన అంటనోవ్ ఏఎన్-225 మ్రియా విమానం దేశంలోనే తొలిసారిగా శంషాబాద్ విమానాశ్రయానికి విచ్చేసింది. ఈ విమానానికి ఆరు టర్బోఫ్యాన్ ఇంజిన్లు ఉండడమే కాకుండా గరిష్ఠంగా 640 టన్నుల సామర్థ్యంతో రవాణా చేయగలుగుతుంది. తుర్కమెనిస్థాన్ నుంచి విమానం హైదరాబాద్ విమానాశ్రయానికి వచ్చినట్లు విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్‌కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్‌పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పందెంరాయుళ్లకు జైలుశిక్ష
IPL 2024: ముగిసిన లీగ్ మ్యాచ్‌లు.. ప్లే ఆఫ్స్‌కు చేరిన జట్లు ఇవే
రాజస్తాన్, కేకేఆర్ మ్యాచ్ రద్దు.. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ హ్యాపీ
కమల్‌హాసన్- శంకర్ కాంబో.. లేటేస్ట్ అప్డేట్ ఇదే!
హీరోయిన్ను పెళ్లాడిన మలయాళ హీరో.. ఎంతో సింపుల్‌గా! (ఫోటోలు)
ఈ వారం ఓటీటీల్లో సినిమాల జాతర.. ఆ రెండే కాస్తా స్పెషల్!
చరిత్ర సృష్టించిన అభిషేక్.. విరాట్ కోహ్లి రికార్డు బద్దలు
రూ.8300 కోట్ల పెట్టుబడికి సిద్దమైన రీసైక్లింగ్ కంపెనీ.. టార్గెట్ ఏంటో తెలుసా?
స్పేస్‌లోకి తొలి తెలుగు వ్యక్తి గోపీ తోటకూర.. ప్రారంభమైన ప్రయోగం
AP: వివాదాస్పద ఎస్పీలపై కీలక చర్యలు
తప్పక చదవండి
- అధికారం చేపట్టగానే అగ్నివీర్ రద్దు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
- కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
- పెట్టుబడుల సునామీ.. టాటా మోటార్స్ కీలక నిర్ణయం
- హీరామండి హీరోయిన్.. వేలకోట్ల అధిపతిని పెళ్లాడిన భామ!
- సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్, అఖిలేష్
- T20 WC Trophy: ఈ పొట్టోడిని గెలవడమే అందరి టార్గెట్
- నాణ్యతలేని ‘పతంజలి సోన్‌పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
- మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
- RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
Advertisement