breaking news
Andy Roddick
-
క్వార్టర్స్ చేరిన అల్కరాజ్కు ఊహించని షాక్!
యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో స్పెయిన్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. గాయం నుంచి కోలుకున్న అల్కరాజ్ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్‌లో మంచి ఫామ్ కనబరుస్తున్నాడు. భారత కాలమాన ప్రకారం సోమవారం తెల్లవారుజామున జరిగిన ప్రిక్వార్టర్స్‌లో రెండో సీడ్ అల్కరాజ్ 6-4, 6-3, 6-4తో అమెరికాకు చెందిన 20వ సీడ్ టామీ పాల్‌ను వరుస సెట్లలో మట్టికరిపించాడు. రెండు గంటల 20 నిమిషాల పాటు సాగిన పోరులో అల్కరాజ్ 33 విన్నర్లు సంధించి ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. క్వార్టర్ ఫైనల్లో అల్కరాజ్ 8వ ర్యాంకర్ బెంజమిన్ షెల్టన్‌ను ఎదుర్కోనున్నాడు. ఇక షెల్టన్ మూడో రౌండ్లో 6-2, 6-3, 6-4తో స్టిఫానోస్ సిట్సిపాస్‌ను వరుస సెట్లలో ఖంగుతినిపించి అల్కరాజ్తో పోరుకు సిద్ధమయ్యాడు.Photo Credit: Twitterఅయితే క్వార్టర్ ఫైనల్లో అల్కరాజ్ తాను తలపడబోయే ప్రత్యర్థిని తప్పుగా ఊహించడం ఆసక్తి రేపింది. టామీ పాల్‌తో మ్యాచ్ ముగిసిన తర్వాత అల్కరాజ్ సెట్ (యూఎస్ ఓపెన్‌లో మ్యాచ్‌లు జరిగే ప్రదేశం)కు వెళ్లాడు. 2003 యూఎస్ ఓపెన్ చాంపియన్ ఆండీ రాడిక్ క్వార్టర్స్‌లో అల్కరాజ్ ఎదుర్కోబోయే చాలెంజర్ గురించి ప్రశ్న అడిగాడు. "మీరు షెల్టన్ లేదా సిట్సిపాస్లో ఒకరితో క్వార్టర్స్ ఆడనున్నారు. మరి ఇద్దరిలో ఎవరితో ఆడడం మీకు ఇష్టం" అని ప్రశ్నించాడు. అయితే ఆండీ రాడిక్ ప్రశ్న పూర్తి కాకముందే.. అతడి ముందు ఉన్న పేపర్‌ను పరిశీలించిన అల్కరాజ్.. "ఓరి దేవుడా, ఇది నేను ఊహించలేదు. మెద్వెదెవ్ లేదా టియాఫోల్లో ఒకరితో తలపడతానని భావించాను. కానీ ఇక్కడ వేరే పేర్లున్నాయి.’’ అని పేర్కొన్నాడు. Photo Credit: Twitterతాను ఒకటి తలిస్తే దైవమొకటి తలచిందన్నట్లుగా తన పరిస్థితి తయారైందని అల్కరాజ్ చెప్పడంతో స్టూడియోలో ఉన్నవారంతా గొల్లుమని నవ్వారు. అల్కరాజ్, ఆండీ రాడిక్ వీడియో సంభాషణ వైరల్‌గా మారింది. ఇక ఫ్రాన్స్‌కు చెందిన టియాఫో డానిల్ మెద్వదెవ్‌ను ఓడించి క్వార్టర్స్‌లో అలెక్స్ మిచెల్సెన్తో పోటీకి సిద్ధమయ్యాడు.టామీ పాల్‌ను ఓడించి క్వార్టర్స్‌లో అడుగుపెట్టిన కార్లోస్ అల్కరాజ్ కొన్ని రికార్డులు సాధించాడు. యూఎస్ ఓపెన్‌లో క్వార్టర్స్ చేరడం అల్కరాజ్కు ఇది ఐదో సారి. హార్డ్ కోర్టుపై అల్కరాజ్కు ఇది వరుసగా 18వ విజయం కాగా, యూఎస్ ఓపెన్‌లో ఇది వరుసగా 11వ విజయం. ఓవరాల్‌గా అల్కరాజ్ గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో క్వార్టర్ ఫైనల్ చేరడం ఇది 15వ సారి.Undeniable.Carlos Alcaraz dispatches Paul 6-4, 6-3, 6-4 to reach the quarterfinals! pic.twitter.com/9BycpgCDQZ— US Open Tennis (@usopen) September 6, 2026 Alcaraz didn't know he was playing Shelton or Tsitsipas next at the US Open:Carlos: "I thought.. I thought.. Oh my God I thought I was playing Medvedev or Tiafoe. Oh my God." 😭😭😭“You gonna watch the match?"Carlos: "For sure I'm gonna watch it." 😭 pic.twitter.com/P4eRQBzOkp— The Tennis Letter (@TheTennisLetter) September 6, 2026Read: సాత్విక్-చిరాగ్ జోడీకి వైఎస్ జగన్ అభినందనలు -
ఆగస్టు 30న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: ఆండీ రాడిక్ (మాజీ టెన్నిస్ క్రీడాకారుడు), కామెరాన్ దియాజ్ (హాలీవుడ్ నటి) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 1. ఇది రవి సంఖ్యకావడం వల్ల అధికారుల సహకారం తో, పట్టుదలతో అనుకున్న పనులన్నింటినీ అవలీలగా సాధిస్తారు. వయసు పై బడుతున్నా, హుషారుగా, ఆకర్షణీయంగా కనిపిస్తూ, ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు. ఇల్లు, ఆస్తులు కొనుక్కోవాలనే కోరిక తీరుతుంది. ఇంటిలో పాతవస్తువుల స్థానంలో ఖరీదైన ఫర్నీచర్‌ను అమర్చుకుంటారు. పుట్టిన తేదీ 30 అంటే 3. ఇది బృహస్పతికి సంబంధించిన సంఖ్య కాబట్టి మీకు మంచి మేధోవికాసం, తెలివి తేటలు, ధారణ శక్తి కలుగుతాయి. విషయ పరిజ్ఞానం పొందుతారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తారు. నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తారు. చాలా కాలంగా బదిలీ కోసం ఎదురు చూస్తున్న వారి కల ఫలిస్తుంది. పాతస్నేహితులను కలుసుకుంటారు. న్యాయకోవిదులకు, వైద్యులకు, యూనిఫారం ధరించే ఉద్యోగులకు మంచి పేరు వస్తుంది. లక్కీ నంబర్స్: 1,2,3, 5,6,9; లక్కీ కలర్స్: రోజ్, ఆరంజ్, క్రీమ్, గోల్డెన్, శాండల్, బ్లూ; లక్కీ డేస్: బుధ, గురు, శుక్ర, ఆదివారాలు. సూచనలు: దక్షిణామూర్తిని ఆరాధించడం, అనాథలను ఆదుకోవడం, విష్ణుసహస్రనామ పారాయణ చేయడం, ఆలయాలు, ఇతర ప్రార్థనా స్థలాలలో భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు పొందవచ్చు. - డాక్టర్ మహమ్మద్ దావూద్


